కష్టాలు విశ్వాసులకు సుఖాలు అవిశ్వాసులకా?

శని, 05/04/2019 - 18:54

మీ జీవితం ఎటువంటి కష్టాలు లేకుండా సుఖంగా గడుస్తుందంటే మీ విశ్వాసాన్ని ఒక సారి పరీక్షించుకోవటం మంచిది.

దేవునిని విశ్వసించకుండా,ఎటువంటి భయభక్తులు లేకుండా పాపాలు చేస్తూ జీవితాన్ని గడుపుతున్న అవిశ్వాసులు సుఖంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు.వేరే వైపు ఆ దేవునిని నమ్ముకుని రాత్రింబవళ్ళు కష్టపడి ఆ దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండి పాపాల జోలికి పోకుండా ఆ దేవుడు చూపిన దారిలోనే తమ జీవితాన్ని గడిపే విశ్వాసులను చూస్తే అన్ని కష్టాలు వారికేనా అనిపిస్తుంది.దీనికి కారణమేమిటి? అన్న ప్రశ్న ఒక్కోసారి కలుగుతుంది.నిజంగా అవిశ్వాసులు గడుపుతున్న జీవితం కేవలం ఆ అల్లాహ్ వారికిచ్చిన వరము కాదు అది వారికి ఇవ్వబడిన ఒక అవకాశం మాత్రమే.అల్లాహ్ దివ్యఖురానులో ఈ విధంగా సెలవిస్తున్నాడు: “మేము ఇస్తున్న అవకాసాన్ని అవిశ్వాసులు తమ పాలిట మేలైనదని భావించరాదు సుమా!వారు తమ పాపాల పుట్టను పెంచుకోవటానికే ఈ అవకాసాన్ని ఇస్తున్నాం.అవమానభరితమైన శిక్ష వారికోసమే ఉంది” (ఆలి ఇమ్రాన్/178). ఇమాం సాదిఖ్(అ.స)ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “తీవ్రమైన కష్టాలన్ని ప్రవక్తల కొరకే వారి తరువాత ఎవరైతే వారికి దగ్గరగా ఉంటారో వారి విశ్వాసాన్ని బట్టి అవి(కష్టాలు) వెంబడిస్తాయి” (అల్ కాఫి,2వ భాగం,పేజీ నం:252). ఇమాం సాదిఖ్(అ.స)ల వారు వేరే హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: “అతి పెద్ద కష్టాలు అతి పెద్ద ప్రతిఫలాన్ని కలిగి ఉంటాయి మరియు భగవంతుడు ఏ సమూహాన్ని కష్టాల పాలు చేయకుండా వారిని ఇష్టపడడు” (అల్ కాఫి,2వ భాగం,పేజీ నం:452).

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9