గుస్ల్ చేసేటప్పుడు దృష్టిలో ఉంచవలసిన కొన్ని ముఖ్యాంశాల వివరణ...
కొన్ని విషయాలు గుస్లె చేసేటప్పుడు దృష్టిలో ఉంచడం అవసరం:
1. గుస్ల్ కు ముందు మన శరీరం పై మనీ(వీర్యం) లేదు అది పూర్తిగా శుభ్రమైపోయింది అనే నమ్మకం కలిగి ఉండాలి. అనగా ముందుగా శరీరం పై ఉన్న మనీను తొలగించి ఆ భాగాన్ని శభ్రం చేసి ఇక మనీ మిగిలి లేదు అనే నమ్మకం కలగాలి, ఆ తరువాత గుస్ల్ నియ్యత్ చేసి గుస్ల్ స్నానం పూర్తి చేయాలి.
2. గుస్ల్‌కు ముందు మిగిలి ఉన్న మనీ బయటకు రావడానికి, మూత్ర విసర్జన చేసుకోవాలి.
3. నీళ్లు చర్మానికి చేరకుండా అడ్డుపడే వాటిని దూరం చేయాలి, జిడ్డు లాంటివి. ఒకవేళ వాటిని దూరం చేయలేకపోయే పరిస్థితిలో ఉంటే లేదా దాన్ని దూరం చేయడం కష్టమైతే గుస్ల్ కు బదులుగా తయమ్ముమ్ చేయాలి. ఒకవేళ ఆ అడ్డు పడేది తయమ్ముమ్ భాగాలలో ఉంటే అప్పుడు గుస్ల్ మరియు తయమ్ముమ్ రెండూ చేయాలి.
4. ఒకవేళ గుస్ల్ తరువాత ఏదైనా భాగం సరిగా కడుక్కోలేదు అని సందేహం కలిగితే దాన్ని పట్టించుకోకుండా రెండోసారి గుస్ల్ చేయడం అవసరం లేదు.
ఒకవేళ నీకు పూర్తి తల మరియు మెడ కడుగు విషయంలో సందేహం కలిగింది ఇంకా శరీరం యొక్క వేరే భాగాలను కడుగుతున్నావు అలాంటప్పుడు నువ్వు తిరిగి సందేహం ఉన్న చోట్లను కడుక్కోని సందేహాన్ని దూరం చేసుకోవాలి.
ప్రశ్న: గుస్లె జనాబత్, హైజ్, నిఫాస్, ఇస్తిహాజా, మయ్యత్ మరియు మసె మయ్యత్, ఇవన్నీ వాజిబ్ గుస్ల్ లు ఇంకా ఏమైనా గుస్ల్ లు ఉన్నాయా?
సమాధానం: ఔను, ఇంకా చాలా గుస్ల్ లు ఉన్నాయి కాని అవన్నీ ముస్తహబ్ గుస్ల్ లు, వాజిబ్ కావు. వాటి నుండి కొన్నింటిని క్రింద చూడగలరు:
1. గుస్లె జుమా, ఇది చాలా తాకీదు చేయబడిన గుస్ల్. ఈ గుస్ల్ యొక్క సమయం శుక్రవారం రోజు ఉదయం నుండి మగ్రిబ్ వరకు అయితే మధ్యానం జవాల్‌కు ముందు చేయడం ఉత్తమం.
2. ఎహ్రామ్ గుస్ల్
3. ఈదైన్(ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్‌హా) ఈ రెండు రోజులలో ఉదయం నుండి మగ్రిబ్ వరకు అయితే ఈద్ నమాజ్ కు ముందు చేయడం ఉత్తమం.
4. జిహ్ హిజ్ మాసం యొక్క 8, 9వ తేదీలో జవాల్ సమయంలో గుస్ల్ చేయడం ఉత్తమం.
5. ఇస్తిఖారా యొక్క గుస్ల్.
6. నమాజె ఇస్తిస్ఖా యొక్క గుస్ల్.
7. మక్కాలో ప్రవేశించడానికి చేసే గుస్ల్.
8. కాబా దర్శనానికి చేయు గుస్ల్.
9. మస్జిద్దున్నబీ లో ప్రవేసించడానికి చేసే గుస్ల్
ఈ గుస్ల్ ల తరువాత ఉజూ చేయాల్సినవసరం లేనటువంటి గుస్ల్ లు.
ఇవి కాకుండా ఇంకా చాలా గుస్ల్ లు ఉన్నాయి వాటన్నింటి గురించి ఇక్కడ చెప్పడం కష్టం....
ప్రశ్న: ఒకవేళ జనాబత్ తరువాత మూత్రం యొక్క ఇస్తిబ్రా లేకుండా, మూత్ర విసర్జన చేయకుండానే గుస్ల్ చేసి అన్ని పనులు చేసిన తరువాత మనీ బయటకు వస్తే, అది ఒక బొట్టు అయినా సరే, అప్పుడు ఏమి చేయాలి?
సమాధానం: మాపై మరో సారి గుస్ల్ చేయడం వాజిబ్ అవుతుంది, ఆ వచ్చిన మనీ ఎటువంటి కామచర్య చేయకుండానే వచ్చినా సరే.
ఇలా నీపై మరోసారి గుస్ల్ చేయడం వాజిబ్ అవుతుంది ఒకవేళ బయటకు వచ్చినది మనీ అని తెలిసినప్పుడు.
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి