ఆది, 03/10/2024 - 16:00
అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే గాని మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు...
రమజాన్ నెల, ఖుర్ఆన్ అవతరింబజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. అయితే రోగగ్రస్తుని గానో, ప్రయాణీకుని గానో ఉన్నవారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తిచేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే గాని మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తిచేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి, తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్ అభిలాష!. (బఖరహ్:185)
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి