తయమ్ముమ్-1

ఆది, 03/10/2024 - 15:21

తయమ్ముమ్ ఎప్పుడు చేయాలి అన్న విషయం పై సంక్షిప్త వివరణ....

తయమ్ముమ్-1

ఇంతకు ముందు మీరు చాలా సార్లు తయమ్ముమ్ అన్న పదాన్ని వినే ఉంటారు. మీకు ఈ పదం కొత్త పదంగా కాదు తెలిసిన పదంగానే అనిపించి ఉంటుంది. అయితే దాని గురించి చాలా మందికి వివరంగా తెలిసి ఉండక పోవచ్చు అంటే తయమ్ముమ్ దేనికి సంబంధించినది? ఈ తయమ్ముమ్ ఎప్పుడు చేస్తారు?, అది ఎప్పుడు వాజిబ్ అవుతుంది?, దాని సమయం ఏమిటి? మరియు దాని రహస్యం ఏమిటి? అన్న విషయాలు తెలిసి ఉండవు. ఇక్కడ వాటి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందా.

తయమ్ముమ్ పదం ఖుర్ఆన్ లో ఉంది.
ప్రశ్న: తయమ్ముమ్ ఆయత్ ఉన్న సూరహ్ పేరు ఏమిటి?
సమాధానం: అది సూరయె నిసా అందులో అల్లాహ్ ఇలా ఆదేశించెను:
وَإِنْ كُنْتُمْ مَرْضَى أَوْ عَلَى سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِنْكُمْ مِنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ إِنَّ اللَّهَ كَانَ عَفُوًّا غَفُورًا
అనువాదం: ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసివస్తే లేక మీరు స్ర్తీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టి(ని ఉపయోగించే) సంకల్పం చేసుకోండి. (దాంతో) మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించే వాడు, క్షమాభిక్ష పెట్టేవాడు.(సూరయె నిసా, ఆయత్43)

ప్రశ్న: తయమ్ముమ్ ఎప్పుడు చేస్తారు?
సమాధానం: గుస్ల్ మరియు ఉజూ చేయలేని పరిస్థితిలో వాటికి బదులుగా తయమ్ముమ్ చేస్తారు. వాటి వివరణ:
1. గుస్ల్ లేదా ఉజూ చేయడానికి సరిపడ నీళ్లు లేనప్పుడు. గుస్ల్ కు సరిపడ నీళ్లు లేక పోయినప్పుడు గుస్ల్ కు బదులుగా తయమ్ముమ్ చేయాలి మరియు అలాగే ఉజూకు సరిపడ నీళ్లు లేనప్పుడు ఉజూ కు బదులుగా తయమ్ముమ్ చేసుకోవాలి.
2. నీళ్లు ఉన్నాయి కాని దాని వరకు చేరడం అంత సులభం కాని పని, ఈ నిస్సహాయ స్థితి కారణంగా నీ చుట్టు ప్రక్కల పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ఉదాహారణకు అల్లాహ్ నిన్ను దాన్ని పొందడానికి దారి లేకుండా చేసినప్పుడు అనగా నీళ్లు పొందే శక్తి నీలో లేనప్పుడు ఉదా: నీళ్లు ఒక లోతైనా బావిలో ఉన్నాయి లేదా చాలా దూర ప్రదేశంలో ఉన్నాయి వెళ్లి రావడం లేదా నడవడం చాలా కష్టంగా ఉంది, లేదా నీళ్ల లబ్ధి హరామ్ చర్య పై ఆధారపడి ఉంది, ఉదా: ముబాహ్ నీళ్లు ఉన్న ఆ కబ్జా పాత్రను ఉపయోగించడం లేదా నీళ్ల లబ్ధి పై ప్రాణ, ధన మరియు కుటుంబ ప్రమాధాల భయం ఉండడం.
3. స్వయ దాహం లేదా మరో వ్యక్తి దాహం “దాని ద్వారానే అతడి రక్షణ ముడి పడి ఉన్నప్పుడు” , అంతే కాదు ముఖ్యమైన జంతువు దాహం వల్ల పోయే ప్రమాదం ఉన్నప్పుడు మరియు నీ వద్ద దాహం తీర్చే మరియు ఉజూ చేయడానికి సరిపడేంత నీళ్లు లేనప్పుడు నీవ్వు తయమ్ముమ్ చేయాలి.
4. నమాజ్ సమయం చాలా తక్కువ ఉన్నప్పుడు నువ్వు ఉజూ లేదా గుస్ల్‌తో పాటు నమాజ్ ను ఆ సమయం లో చదవలేను అనుకున్నప్పుడు తయమ్ముమ్ చేయాలి.
5. ఉజూ మరియు గుస్ల్ చేయడానికి నీళ్లు పొందడం లేదా దాని ఉపయోగం వల్ల తట్టుకోలేని కష్టాల్లో పడవచ్చు అని భావించినప్పుడు ఉదా; నీళ్ల లబ్ధి అవమానం లేదా అపనింద పై ఆధారపడి ఉంది, లేదా ఆ నీళ్లు నీకు అసహ్యం కలిగించేతగా మారిపోయి ఉన్నాయి అలాంటి నీళ్లను ఉపయోగిస్తే నీకు కష్టంగా అనిపిస్తుంది, ఇలాంటి పరిస్థితిలో తయమ్ముమ్ చేయాలి.
6. నీళ్లు ఉపయోగించడం అవసరమైనటువండి ఒక వాజిబ్ కార్యాన్ని అమలు పరచడం నీపై వాజిబ్ అయినప్పుడు ఉదాహారణకు మస్జిద్ నుండి నజాసత్ ను శుభ్రచేయడం. మరో వైపు నీళ్లు కూడా తక్కువగా ఉన్నాయి. ఇలాంటప్పుడు మస్జిద్‌ను శుభ్రం చేయడం అవసరం. నమాజ్ కోసం తయమ్ముమ్ చేసుకోవాలి.
7. గుస్ల్ లేదా ఉజూ కోసం నీళ్లు ఉపయోగించడం నీ ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం ఉన్నప్పుడు. అనగా నీళ్లు ఉపయోగించడం వల్ల ఏదైనా రోగానికి గురి అవ్వడం లేదా నీ అనారోగ్యం పెరిగే లేదా చికిత్సకు కష్టం వచ్చే పరిస్థితులలో లేదా జబీరహ్ ఉజూ లేదా జబీరహ్ గుస్ల్ ను అమలు పరిచే విధంగా లేని రోగం గనక ఉంటే తయమ్ముమ్ చేయడం అవసరం.

రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 30