సుప్రీమ్ నేత ఆయతుల్లాహ్ ఖామెనయీ(హఫిజహుల్లాహ్) ఖుద్స్ డే సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసం నుండి కొన్ని అంశాలు.
సుప్రీమ్ నేత ఆయతుల్లాహ్ ఖామెనయీ(హఫిజహుల్లాహ్) ఖుద్స్ డే సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసం నుండి కొన్ని అంశాలు.
వారు ఇలా అన్నారు నేను పాలస్తీన సమస్యను హృదయపూర్వకంగా నమ్మేవారందరికి కొన్ని సిఫార్సులు చేయాలనుకుంటున్నాను:
1. పాలస్తీన యొక్క స్వాతంత్ర్యం కోసం యుద్ధం, అల్లాహ్ మార్గంలో జిహాద్, ఇస్లామీయ అభిలాష మరియు ఫరీజా(విధి). ఇలాంటి యుద్ధంలో విజయం తప్పని సరి, ఎందుకంటే యుద్ధం చేసేవ్యక్తి చనిపోయినా సరే “ఇహ్దల్ హుస్నయైన్”[ఖుర్ఆన్9:52](రెండు గొప్ప మంచి కార్యముల నుండి ఒకటి) తప్పకుండా పొందుతాడు. అదీకాకుండా పాలస్తీన సమస్య, ఒక మానవ సమస్య. కోట్ల సంఖ్యలో ప్రజలను తాము జీవిస్తున్న ఇళ్ళ, సాగుభూములు, జీవనాధారాన్ని పొందే ప్రదేశాల నుండి ఇక మీకు వాటితో ఎటువంటి సంబంధం లేదు అని లాక్కోవటం అది కూడా చంపి మరియు అన్యాయంగా లాక్కోవటం, ఇవి అంతరాత్మగల ప్రతీ మనిషి మనసును కలచివేస్తుంది మరియు ప్రభావితం చేస్తుంది. ధైర్యం మరియు శక్తి ఉంటే వారిపై ఎదురు తిరగడానికి సిద్ధమై నిలబడతాడు, అందుకని దీన్ని కేవలం పాలస్తీన సమస్య లేదా అరేబీయుల సమస్య అని నిర్ధారించటం చాలా పెద్ద తప్పు.
పాలస్తీన దేశం యొక్క కొన్ని అంశాల వల్ల లేదా అరేబీయ దేశాల అధికారుల రాజీ ప్రయత్నాలను చూసి, ఈ ఇస్లామీయ మరియు మానవ సమస్యను వదిలేయడాన్ని సమ్మతంగా భావించేవారు, ఈ సమస్యను అర్థం చేసుకోవడంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ఇందులో ప్రక్షిప్తం లాంటి అపకారానికి పాల్పడుతున్నారు.
2. ఈ యుద్ధం యొక్క నిజమైన లక్ష్యం .నది నుండి సముద్రం వరకు . (అనగా రూమ్ నది నుండి ఉర్దున్ సముద్రం వరకు) ప్రాంతమంతా పాలస్తీన యొక్క స్వాతంత్ర్యం మరియు పాలస్తీనియులందరు తమ దేశానికి తిరిగి రావటం. ఈ (గొప్ప లక్ష్యా)న్ని ఆ భూమి యొక్క ఏదో ఒక మూలలో ఒక అధికారం కోసం పరిమితం చేయటం, అది కూడా అతి అగౌరవ స్థితిలో, దీన్ని ఇంకితజ్ఞానం లేని జియోనిజం చెబుతుంది, ఇది న్యాయమూ కాదు మరియు యదార్థఅభిలాషా కాదు. యదర్థమేమిటంటే ఈనాడు కోట్ల సంఖ్యలో పాలస్తీన ఆలోచన, అనుభవం మరియు ఆత్మవిశ్వాసం యొక్క ఉన్నత స్థాయికి చేరుకొని ఆ గొప్ప జిహాద్ కోసం వారు నడుము బిగించుకున్నారు. వారికి అల్లాహ్ సహాయం మరియు విజయం పట్ల నమ్మకం ఉంచటం ఎంతైనా అవసరం ఉంది, ఎందుకంటే అల్లాహ్ ఇలా ప్రవచించెను.. وَلَيَنْصُرَنَّ اللَّهُ مَنْ يَنْصُرُهُ ۗ إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ ..అల్లాహ్ కు సహాయపడేందుకు సమాయత్తం అయిన వారికి అల్లాహ్ కూడా తప్పకుండా సహాయపడతాడు. నిశ్చయంగా అల్లాహ్ మహాబలుడు, సర్వాధిక్యుడు.(హజ్, ఆయత్40).
3. ఈ యుద్ధంలో హలాల్ మరియు షరా పరమైన వాటిని, వాటిలో ప్రపంచ మద్దత్తును ఉపయోగించటం సమ్మతమైనది. కాని ముఖ్యంగా పడమటి అధికారమాలపై మరియు బాహ్య లేదా గుప్త పరంగా వాటిపై ఆధారపడి ఉన్న సంస్థల పై భారోసా చేయకూడదు. అవి ప్రతి ఇస్లామీయ శక్తి ప్రభావం యొక్క అస్థిత్యం యొక్క శత్రువు. వారి దృష్టిలో మానవుల మరియు దేశ హక్కుల పట్ల ఎటువంటి విలువలేదు. ఇస్లామీయ ఉమ్మత్ కు కలిగే ఎక్కువ శాతం నష్టాలకు మరియు దానికి వ్యతిరేకంగా జరిగే అన్యాయాలకు బాధ్యులు వారే. ఇప్పుడు ఎన్నో ఇస్లామీయ మరియు అరేబీయ దేశాలలో నరమేధం, యుద్ధప్రేరణ, బాంబుదాడులు లేదా కరువు లాంటి వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థ లేదా అపరాధ బలగాలు జవాబుదారులు?
ఈనాడు ప్రపంచం కరోనా ద్వార సంభవించే మృత్యువులను లెక్కపెడుతుంది కాని ఎవరూ ప్రశ్నించలేదు, ప్రశ్నించరు కూడానూ; అమెరికా మరియు యూరప్ ఏ దేశాలలో యుద్ధ మంటలు రేపారో అక్కడ లక్షల మంది మరణించారు, బంధించబడ్డారు మరియు కనిపించకుండా పోయారు, వాటికి బాధ్యులెవరూ? అని. ఆఫ్గనిస్తాన్, యమన్, లీబియా, ఇరాఖ్, షామ్ మరియు ఇతర దేశాలలో అన్యాయంగా ధారబోసే రక్తానికి బాధ్యులెవరు? పాలస్తీనలో జరిగే అపరాధాలకు, అన్యాయ మరియు విధ్వంస చర్యలకు, మరియు దౌర్జన్యాలకు బాధ్యులెవరు? ముస్లిముల నరమేధం పై ఎవరూ ఎందుకని సంతాపాన్ని ప్రకటించరు? కోట్ల సంఖ్యలో పాలస్తీనీయులు డబ్భై ఏళ్లుగా తమ ఇళ్ళ నుండి దూరంగా దేశబహిష్కరణలో ఎందుకు ఉన్నారు? ముస్లిముల మొదటి ఖిబ్లా(నమాజు దిశ)ను ఎందుకని అవమానించాలి? పేరు పొందిన ఐక్యరాజ్య సమితి తన కర్తవ్యాల పై అమలు చేయటం లేదు మరియు గొప్ప గొప్ప మానవ హక్కు సంఘాలకు చావు వచ్చింది. ‘పిల్లల మరియు స్ర్తీల హక్కుల నినాదాలు’ అవి అన్యాయాలకు గురి అయిన యమన్ మరియు పాలస్తీన పిల్లలకు మరియు స్ర్తీలకు సంబంధించినవి కావు.
వ్యాఖ్యానించండి