జబీరహ్

మంగళ, 03/12/2024 - 23:33

జబీరహ్ అంటే ఏమిటి?, ఎక్కడ దీని పై అమలు చేయాలి? అన్న విషయాల పై సంక్షిప్త వివరణ...

జబీరహ్

ప్రశ్న: జబీరహ్ అంటే ఏమిటీ?
సమాధానం: గాయం లేదా ఖర్‌హహ్ లేదా విరిగిన భాగం పై పట్టీ కట్టుకున్నప్పుడు దాన్ని ఫిఖా పరిభాషలో జబీరహ్ అంటారు.

ప్రశ్న: గాయం మరియు విరిగిన భాగం అర్థమయ్యింది కాని ఖర్‌హహ్ ఏమిటో తెలియలేదు.
సమాధానం: ఖురూహ్ (ఖర్‌హహ్ యొక్క బహువచనం) అంటే శరీరం పై ఏర్పడే పుండ్లు మరియు మొటిమలు.

ప్రశ్న: జబీరహ్ ఉన్నప్పుడు గుస్ల్ లేదా ఉజూ లేదా తయమ్ముమ్ ఎలా చేయాలి?
సమాధానం: ఒకవేళ జబీరహ్ ను ఎటువంటి నష్టం లేకాండా తొలగించగలిగితే దాన్ని తొలగించి గుస్ల్ చేసుకోవాలి, లేదా దాని క్రింద నుండి మసహ్ చేసుకోవాలి, ఏది వాజిబ్ అయితే దాన్ని అలా అమలు పరుచుకోవాలి అంటే గుస్ల్ వాజిబ్ అయితే గుస్ల్ చేసుకోవాలి, ఉజూ లేదా తయమ్ముమ్ వాజిబ్ అయితే దాని పై చేయిని త్రిప్పుకోవాలి.

ప్రశ్న: ఒకవేళ జబీరహ్ ను తొలగించడం హాని కలిగే అవకాశం ఉండడం వల్ల సాధ్యం కాకపోతే?
సమాధానం: జబీరహ్ చుట్టుప్రక్కల భాగాలను నువ్వు ఎంత కడుక్కోగలిగితే అంత కడుక్కోవాలి ఆ తరువాత జబీరహ్ పై చేయిని త్రిప్పుకోవాలి ఎందుకంటే ఇది జబీరహ్ ద్వార కప్పబడి ఉన్న దానికి బదులు కాబట్టి.
1. జబీరహ్ యొక్క ఉపరిభాగం; దేన్నైతే మన తడి చేతితో త్రిప్పుతున్నామో అది శుభ్రమై(పాక్) ఉండాలి, ఇక గాయం వల్ల జబీరహ్ లోపల ఉన్న నజాసత్ అంత పట్టించుకోవలసినది కాదు.
2. జబీరహ్ కబ్జా అయినది కాకూడదు.
3. జబీరహ్ యొక్క గాయం విరిగిన ఎముకకు సమానంగా ఉండాలి(సాధారణంగా చూస్తూ ఉంటాము).

ప్రశ్న: ఒకవేళ జబీరహ్, గాయం కన్నా పెద్దది అయి ఉంటే ఏమి చేయాలి?
సమాధానం: ఎక్కువగా ఉన్న ప్రదేశం నుండి తొలగించి దాని క్రింద ఉన్న భాగాన్ని కడుక్కోవాలి లేదా దాని పై చేతిని త్రిప్పుకోవాలి. సందర్భాన్ని బట్టి అలా అమలు చేయాలి.

ప్రశ్న: ఒకవేళ జబీరహ్ తీయడం సాధ్యం కాకపోతే లేదా గాయం ఉన్న ప్రదేశం నుండి దాన్ని తొలగించడం నష్టానికి గురి అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఏమి చేయాలి?
సమాధానం: తొలగించకుండా మరియు జబీరహ్ పై చేతిని త్రిప్పుతూ ఉజూ చేసుకో.

ప్రశ్న: ఒకవేళ ఆ జబీరహ్ (ఏదైతే ఎక్కువగా ఉందో) ను తీయడం వల్ల గాయం లేని భాగానికి నష్టం కలుగుతుంది మరియు గాయం ఉన్న భాగానికి ఇంకా నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు ఏమి చేయాలి?
సమాధానం: ఒకవేళ జబీరహ్ తయమ్ముమ్ భాగాలపై లేకపోతే తయమ్ముమ్ కు బదులుగా ఉజూ చేసుకోవాలి. ఒకవేళ తయమ్ముమ్ భాగాల పై జబీరహ్ ఉంటే ఉజూ మరియు తయమ్ముమ్ రెండూ చేసుకోవాలి.

ప్రశ్న: ఒకవేళ జబీరహ్ పూర్తి ముఖం పై లేదా పూర్తి చేతుల పై లేదా పూర్తి కాళ్ల పై ఉంటే ఎలా ఉజూ చేసుకోవాలీ?
సమాధానం: జబీరహ్ పై చేయిని త్రిప్పుతూ ఉజూ చేసుకోవాలి.

ప్రశ్న: ఒకవేళ జబీరహ్ పూర్తి భాగాల పై లేదా ఎక్కువ శాతం భాగాల పై ఉంటే?
సమాధానం: జబీరహ్ పై చేయిని త్రిప్పుతూ ఉజూ మరియు తయమ్ముమ్ రెండూ చేయాలి.

ప్రశ్న: ఒకవేళ ముఖం లేదా చేతులు గాయం లేదా పుండు తెరుచుకొని ఉన్నాయి, దానిపై కట్టు కట్టి లేదు, డాక్టర్ దానిపై నీళ్లు పడకూడదు అని అన్నాడు అప్పుడు ఉజూ ఎలా చేయాలి?
సమాధానం: గాయాన్ని కడగకుండా దాని చుట్టు ప్రకలు కడుక్కోవాలి.

ప్రశ్న: ఉదాహారణకు నా ముఖం లేదా చేతుల కొంత భాగం విరిగిపోయింది, కట్టు కట్టి లేదు మరియు నీళ్లు ఉపయోగించడం ద్వార నష్టం కూడా కలుగుతుంది, అలా అని అక్కడ గాయం కూడా లేదు అప్పుడు ఉజూ ఎలా చేయాలి?
సమాధానం: నువ్వు ఉజూకు బదులుగా తయమ్ముమ్ చేసుకోవాలి.

ప్రశ్న: ఒకవేళ మస్‌హ్ చేసే భాగాలు ఉదా: తల లేదా కాళ్ల పై కట్టు వేయని గాయం ఉంది, నీళ్లు దానిని నష్టం కలిగిస్తుంది, అప్పుడు ఉజూలో మస్‌హ్ ఎలా చేయాలి?
సమాధానం: అప్పుడు నువ్వు తయమ్ముమ్ చేయాలి.

ప్రశ్న: ఒకవేళ గుస్ల్ చేయాలనుకుంటున్నపుడు. శరీరం యొక్క ఏదో ఒక భాగం పై గాయం లేదా పుండు ఉంది, ఆ గాయం లేదా పుండు తెరుచుకొని ఉన్నాయి అలాంటి సమయంలో ఏమి చేయాలి?
సమాధానం: గాయం లేదా పుండు భాగాన్ని వదిలి మిగిలిన భాగాలను కడుక్కోవాలి లేదా తయమ్ముమ్ చేసుకోవాలి, అందులో నీకు ఇష్టం వచ్చిన దాని పై అమలు చేసుకోవచ్చు.

ప్రశ్న: ఒకవేళ నా శరీరం యొక్క ఏదో ఒక భాగం విరిగి ఉంది అయితే నేను గుస్ల్ ఎలా చేయాలి?
సమాధానం: గుస్ల్ కు బదులుగా తయమ్ముమ్ చేయాలి.

రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 18 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 29