విజయవాడలో ఖుద్స్ డే సందర్భంగా షియా ముస్లిములు ర్యాలీ నిర్వహించి అందులో ఇవ్వబడిన ఉపన్యాసం...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ఖుద్స్ డే. ఖుద్స్ అనగా ఇస్లాం విశ్వాసాలనుసారం కాబా తరువాత అతి పవిత్రమైన, ప్రతిష్టాత్మకమైన మరియు ముఖ్యమైన కట్టడం గల ప్రదేశం, దీనినే బైతుల్ ముఖద్దస్ అంటారు. కాబా కు ముందు ముస్లిములు దీనికి అభిముఖంగా నిలబడి నమాజ్ చదివేవారు. ఇది పాలస్తీనా దేశంలో ఉంది. ఆ భూమిని యూధులు 1948లో ఆక్రమించుకున్నారు. స్వదేశీయులైన పాలస్తీన దేశస్తుల పట్ల అన్యాయం మరియు దౌర్జన్యానికి దిగారు. ఇరాన్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుప్రీమ్ నేత ఆయతుల్లాహ్ ఖుమైనీ(రహ్మతుల్లాహ్ అలైహ్) రమజాన్ మాసం యొక్క చివర శుక్రవారాన్ని ఖుద్స్ డే గా ప్రకటించి యావత్ ప్రపంచ దుర్మార్గుల మరియు దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా నినాదాలను వ్యక్తం చేయాలని కోరారు. ముఖ్యంగా ఏ పాపం ఎరుగని పాలస్తీనా దేశ ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయం మరియు దౌర్జన్యానికి వ్యతిరేకించాలని అన్నారు. ఆ విధంగా ఆయతుల్లాహ్ ఖుమైనీ(రహ్మతుల్లాహ్ అలైహ్) యొక్క దృఢ ప్రయత్నం, ఖుద్స్ షరీఫ్ మరియు అణగారిన పాలస్తీన ప్రజల గురించి ముస్లిముల గొంతులను ఏకం చేయడానికి కారణంగా నిలిచింది. ఈ కొన్ని దశబ్ధాలలో ఇది తన ప్రభావితమైన పనితీరును చూపించింది మరియు ఇన్షా అల్లాహ్ ఇక ముందు కూడా చూపిస్తుంది. ప్రపంచ దేశాలు ఖుద్స్ డే ను స్వాగతం పలికారు మరియు దాన్ని ప్రాముఖ్యత ఇచ్చారు.
ఈ సంవత్సరం ఇతర సంవత్సరాల ఖుద్స్ డేల కు తేడా ఉంది., అదేమిటంటే ఇప్పటి వరకు కేవలం ముస్లిములు మాత్రమే ఇజ్రాయీల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసేవారు కాని గత 6 నెల నుండి ఇజ్రాయీల్, పాలస్తీనా ప్రజలు ముఖ్యంగా గాౙా లో ప్రదర్శిస్తున్న క్రూరత్వాన్ని చూస్తున్న యావత్ ప్రపంచ ప్రజలందరూ నిత్యం తమ నినాదాలను, వ్యతిరేకతను మరియు అసమ్మతను ర్యాలీల రూపంలో, ఉపన్యాసాల రూపంలో వెల్లడిస్తూనే ఉన్నారు. తప్పకుండా వారు కూడా ఈ ఖద్స్ డే సందర్భంగా ర్యాలీలను నిర్వహిస్తారని ఆశిస్తున్నాము.
మేమూ మనసున్న మానవులమనీ, ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగా జీవించే హక్కుందనీ, ఏ ఒక్కరికీ మరొక్కరి పై అధికారం చేలాయించే హక్కు లేదనీ వెల్లడిస్తూ మరియు ఇజ్రాయీల్ తన అన్యాయాలను ఆపివేయాలనీ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము.
అల్లాహు అక్బర్.....
వ్యాఖ్యానించండి