షిర్క్ షిర్క్

శుక్ర, 02/09/2024 - 17:32

కొన్ని చర్యల సంబంధం షిర్క్ కు ముడి పడి ఉన్నాయి, అది షర్క్ తో కూడిన విశ్వాసం...

షిర్క్ షిర్క్

మనిషి బహుదేవారాధన తో తన విశ్వాసాన్ని షిర్క్ తో మలినం చేసుకోకూడదు. కొన్ని సందర్భాలలో విశ్వాసం, షర్క్ తో కూడి ఉంటుంది, దీని గురించి ఖుర్ఆన్ లో కూడా వివరించబడి ఉంది.
1. గౌరవాన్ని ఇతరుల నుండి ఆశించడం: “ఏమిటి వారు గౌరవ ప్రతిష్ఠల కోసం వారి వద్దకు వెళుతున్నారా?!”[సూరయె నిసా, ఆయత్139].
2. మంచి కార్యను చెడు కార్యములతో కలిపేయడం: “వారు మిశ్రమమైన కర్మలు చేశారు-కొన్ని సత్కార్యాలు, కొన్ని దుష్కార్యాలు!”[సూరయె తౌబహ్, ఆయత్102].
3. ఇతరులతో కలిసే టప్పుడు వర్గ మరియు సమూహం పట్ల పక్షపాతం కలిగి ఉండడం: “ప్రతి (మత) వర్గం తన వద్దనున్న దాంతోనే సంబరపడిపోసాగింది”[సూరయె మొమినూన్, ఆయత్53].
4. ప్రార్ధన పట్ల అశ్రద్ధత మరియు జనులకు చూపేందుకు చేయడం: "ఆ నమాజీలకు వినాశం తప్పదు('వైల్' అనే నరక స్థానం వారి కొరకు ఉంది). (ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు.[సూరయె మాఊన్, ఆయత్4,5].
5. యుద్ధంలో జనం నుండి భయపడడం: “యుద్ధం చేయమని ఆజ్ఞాపించబడితే, వారిలోని ఒక వర్గంవారు అల్లాహ్ కు భయపడవలసిన రోతిలో జనులకు భయపడసాగారు”[సూరయె నిసా, ఆయత్77].
6. వ్యాపార మరియు ప్రాపంచిక వ్యవహారాలలో ఆదిక్యతను కోరడం, నచ్చడం: “అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది”[సూరయె తకాసుర్, ఆయత్1].
7. ధర్మం మరియు ప్రపంచం ఎన్నుకొనే విషయంలో ప్రపంచాన్నే ఎన్నుకొని దైవప్రవక్త(స.అ)ను ఒంటరిగా విడవడం: “(జనుల పరిస్థితి ఎలా ఉందంటే) ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కానవచ్చినా వారు దాని వైపుకు పరుగెడుతున్నారు”[సూరయె జుముఅహ్, ఆయత్11].

అహంకారం ఫలితం షిర్క్
అహంకారం ద్వార అహంకారికి నష్టాలు కూడా కలుగుతాయి వాటిలో ఒకటి అవిశ్వాసం మరియు షిర్క్; షైతాన్ యొక్క అహంకారం వల్ల అతడికి కలిగిన నష్టాన్ని అల్లాహ్ సూరయే బఖరహ్ లో వివరించెను: “మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి” అని మేము దూతలను ఆజ్ఞాపించినపుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి, అవిధేయులలో చేరిపోయాడు.[సూరయె బఖరహ్, ఆయత్34]
మరో ఆయత్ లో ఇలా ఉంది: “ఏ హక్కూ లేకుండా భూమిపై గర్వాన్ని ప్రదర్శించేవారిని నా ఆదేశాల నుంచి మరలిస్తాను. ఒకవేళ సూచనలన్నింటినీ తిలకించినా కూడా వారు వాటిని విశ్వసించరు. సరైన మార్గం వారికి కానవస్తే వార దానిని తమ మార్గంగా చేసుకోరు. పెడదారి కనిపిస్తే మాత్రం దాన్ని తమ మార్గంగా చేసుకుంటారు. మా ఆయతులను ధిక్కరించి, వాటిపట్ల నిర్లక్ష్య వైఖరిని కనబరచటం వల్ల వారికీ దురవస్థ పట్టింది”[సూరయె అఅరాఫ్, ఆయత్146]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19