హజ్రత్ మూసా ఇబ్నె జాఫర్[అ.స] ఇంట్లో నాలుగు ఫాతెమాలు ఉండేవారు వారెవరెవరు అన్న వివరణ...
చరిత్రకారుల రచన ప్రకారం, హజ్రత్ మూస ఇబ్నె జాఫర్[అ.స] యొక్క నలుగురు కూతుర్ల పేర్లు కూడా ఫాతెమా అని పెట్టారు. ఆ నలుగురు ఫాతెమాలు “ఫవాతిము అర్బఅ” అని ప్రఖ్యాతి చెందారు. వివరణ:
1. ఫాతెమా కుబ్రా, ఈమె హజ్రత్ “మాసూమహ్”గా బిరుదు పొందారు, ఈమె సమాధి “ఖుమ్” లో ఉంది.
2. ఫాతెమా సుగ్రా, ఈమె “బిబి హైబత్”గా ప్రఖ్యాతి చెందారు, ఈమె సమాధి “ఆజర్ బాయిజాన్” దేశంలో ఉన్న “బాకూ” పట్టణంలో ఉంది.
3. ఫాతెమా ఉస్తా, ఈమె “సిత్త ఫాతెమా” గా ప్రఖ్యాతి చెందారు, ఈమె సమాధి “ఇస్ఫెహాన్”లో ఉంది.
4. ఫాతెమా ఉఖ్రా, ఈమె “ఖాహరె ఇమామ్”గా ప్రఖ్యాతి చెందారు, ఈమె సమాధి “రష్త్” పట్టణంలో ఉంది.[జిందగానియె కరీమయె అహ్లె బైత్[అ.స], పేజీ82].
నోట్: కేవలం హజ్రత్ మాసూమహ్[స.అ] మాత్రమే నజ్మా ఖాతూన్(ఇమామ్ రిజా[అ.స] తల్లి)కి జన్మించారు.
రిఫ్రెన్స్
అలీ అక్బర్ మహ్దీ పూర్, జిందగానియె కరీమయె అహ్లె బైత్(అ.స), నష్రె హాజిఖ్, చాప్2, 1384.
వ్యాఖ్యానించండి