హజ్జ్ మాసూముల హదీసులలో

ఆది, 08/04/2019 - 19:12

హజ్జ్ ప్రాముఖ్యతను వివరించే మాసూముల హదీసులు.

హజ్జ్,కాబా,మక్కా.

1.ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: అల్లాహ్! అల్లాహ్![దేవుని కొరకు] దేవుని గృహం[కాబా] గురించి గుర్తుంచుకోండి, ఎప్పటివరకైతే మీరు బ్రతికుంటారో దానిని[కాబాను] ఖాలీగా ఉండనివ్వవద్దు. ఒకవేళ హజ్జ్ వదిలివేయబడితే మీపై దేవుని కృప కూడా నిలిచిపోతుంది.[బిహారుల్ అన్వార్, 96వ భాగము,పేజీ నం:16].
2.ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: దేవదూత జిబ్రయీలు దైవప్రవక్త[స.అ.వ] ల వారిపై అవతరించి ఈ విధంగా సెలవిచ్చారు: ''ఓ ముహమ్మద్! మీ అనుచరులకు హజ్జ్ మరియు సజ్జ్ కొరకు ఆజ్ఞాపించండి. హజ్జ్ అనగా తల్బియా[లబ్బైక్ చెప్పటం] ద్వారా తమ కంఠస్వరాన్ని వినిపించటం మరియు సజ్జ్ అనగా ఒంటెలను దేవుని మార్గంలో వధించటం.[మ ఆనిల్ అఖ్బార్, పేజీ నం:224].
3.ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: ఎవరైతే మక్కా వచ్చి వెళ్ళే సమయంలో మార్గమధ్యలో మరణిస్తే వారు ప్రళయదినం యొక్క సోకం నుండి అల్లాహ్ సన్నిధిలో ఉంటారు.[మలాజుల్ అఖ్బార్, 7వ భాగం, పేజీ నం:223].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6