పంజతనే పాక్ ఎవరూ మరియు ఎందుకు వారిని పంజతనే పాక్ అంటారు మొదలగు అంశాల వివరణ...
1. పంజతనే పాక్ ఎవరు?
జ. దైవప్రవక్త[స.అ], హజ్రత్ అలీ[అ.స], హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ], హజ్రత్ ఇమామ్ హసన్[అ.స] మరియు హజ్రత్ ఇమామ్ హుసైన్[అ.స]
2. వీరిని పంజతనే పాక్(పవిత్రమైన ఐదుగుర) అని ఎందుకు అంటారు?
జ. ఈ ఐదుగురు ఒక దుప్పటి క్రింద చేరినప్పుడు “తత్హీర్ ఆయత్” అవతరింపబడింది
3. తత్హీర్ ఆయత్ అంటే ఏమిటి?
జ. అహ్లెబైత్[అ.స]లు పవిత్రులు అని ప్రకటించబడిన ఖుర్ఆన్ యొక్క ఒక ఆయత్
4. ఆ దుప్పటి ఎవరిది?
జ. ఆ దుప్పటి హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] గారిది, అందులోనే వీరందరూ సంగ్రహించారు
5. ఈ సంఘటన ఎలా తెలిసింది?
జ. హదీసె కిసా ద్వారా తెలిసింది. దీనిని పఠిస్తూ ఉంటారు, ఈ పవిత్ర కథనం ద్వార దుఆలు స్వీకరించబడతాయి
6. ఈ పంజతనే పాక్ యొక్క శుభకరము ద్వార దుఆలు స్వీకరించబడతాయా?
జ. నిస్సందేహంగా వారి ద్వారా ప్రవక్తల దుఆలు స్వీకరించబడ్డాయి, వారిని ప్రవక్తలు ఆశ్రయించారు
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.
వ్యాఖ్యానించండి