అల్లాహ్ యొక్క పవిత్ర గృహం అయిన కఅబహ్ గురించి కొన్ని అంశాలు...
అరేబీయ దేశం యొక్క మక్కా పట్టణంలో ఉన్న అల్లాహ్ గృహం; కఅబహ్. దీనిని జనాబె ఇబ్రాహీమ్[అ.స] మరియు జనాబె ఇస్మాయీల్[అ.స]లు అల్లాహ్ ఆదేశానుసారం ప్రజల కోసం నిర్మించారు.
హాజీయులు ఈ కఅబహ్ చుట్టూ ప్రదక్షణాలు చేస్తారు. నమాజ్ చదివేటప్పుడు కఅబహ్ వైపుకు నిలబడతారు. మన మొదటి ఇమామ్ హజ్రత్ అలీ[అ.స] ఈ కఅబహ్ లోనే జన్మించారు.
జనాబె ఇబ్రాహీమ్[అ.స] మరియు ఇస్మాయీల్[అ.స] తరువాత ఈ కఅబహ్ లో విగ్రహాలు ఉంచబడ్డాయి, దైవప్రవక్త[అ.స] కాలం వరకూ ఈ విగ్రహాలు అట్టే పెట్టి ఉన్నాయి. దైవప్రవక్త[స.అ] మక్కాపై విజయం సాధించిన తరువాత అలీ[అ.స]ను తన భూజాల పై ఎత్తుకొని ఆ విగ్రహాలను పడగొట్టించారు.
కఅబహ్ కన్న ముందు బైతుల్ ముఖద్దస్, ముస్లిముల ఖిబ్లా(నమాజ్ చదివే వైపు)గా ఉండేది, ఒకరోజు నమాజ్ చదువుతుండగా ముఖాన్ని కఅబహ్ తరపుకు మరలించబడింది, ఇప్పటి వరకూ అదే ఖిబ్లాగా మిగిలి ఉంది.
మన చివరి ఇమామ్[అ.స] కఅబహ్ వద్దనే ప్రత్యేక్షమవుతారు.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.
వ్యాఖ్యానించండి