ఇతరుల గురించి స్వతహాగా అభిప్రాయాలు వ్యక్త చేయకూడదు అన్న విషయం పై సంక్షిప్త వివరణ ఒక ఆయత్ సహాయంతో.
మేము ఒక దారిన వెళుతున్నామనుకోండి, దారి మధ్యలో చీకటి ప్రదేశానికి చేరుకోగానే మన ముందుకు వెళ్ళకుండా ఆగిపోతాము, ఎందుకంటే చీకటి వల్ల మనకు అక్కడున్నవి తెలియవు గనక. అలాగే మనకు ఎవరి గురించి అయితే తెలియదో వారి పట్ల కూడా మన నోళ్ళు మెదప కుండా ఆపుకోవాలి, వారి గురించి ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదు. ఏమీ తెలుసుకోకుండా త్వరగా తీర్మానించేయకూడదు.
అల్లాహ్ పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “నీవు తెలుసుకోవలసిన అవసరం లేని విషయాల వెంట పడకు. ఎందుకంటే చెవి, కన్ను, హృదయం – వీటన్నింటి గురించి ప్రశ్నించటం జరుగుతుంది”.[ఇస్రా:36].
మేము నిరంతరం గుర్తు పెట్టుకోవలసిన విషయమేమిటంటే ఏదోకరోజు జనం కూడా మన గురించి స్వతహాగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు, అది గుర్తుపెట్టుకొని ఇతరుల గురించి సొంత అభిప్రాయాలు వ్యక్తం చేసేటప్పుడు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
వ్యాఖ్యానించండి