రెండు కార్యాల మధ్య అంతరం

గురు, 11/07/2019 - 19:01

మనవు చేసే రెండు విభిన్నమైన కార్యాల మధ్య అంతరాన్ని వివరించే ఇమాం అలి[అ.స] ల వారి ఉపదేశం.

రెండు కార్యాల మధ్య అంతరం

ఇమాం అలి[అ.స]: “రెండు కార్యాల మధ్య చాలా అంతరం ఉంది,మొదటిది చేసే పని యొక్క ఆనందం అంతమైపోతుంది కానీ దాని పరిణామం[ప్రభావం] మిగిలిపోతుంది.రెండవది చేసే పని యొక్క బాధ మరియు కష్టం అంతమైపోతుంది కానీ దాని ప్రతిఫలం మిగిలిపోతుంది”.

జీవితంలో మనం చేసే కొన్ని పనులు ఒక నిమిషం కోసం అనందాన్ని ఇస్తాయి కానీ దాని పరిణామాలు జీవితం యొక్క చివరి శ్వాస వరకూ బాధిస్తాయి.మనము చేసే ప్రతీ పని ఆ అల్లాహ్ కు తెలుసు ఒక వేళ ఈ ప్రాపంచిక జీవితంలో దాని పరిణామాన్ని చూడలేకపోయినా ప్రళయదినం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు.పాపాలకు అలవాటు పడ్డ వారు ఆనంధభరితమైన మరియు ఆహ్లాదమైన జీవితాన్నే కోరుకుంటారు ఎందుకంటే వారు ఆ జీవితానికి అలవాటు పడ్డారు కాబట్టి.వారు చేసే పాపాలు వారికి ఆ కొంత సమయం వరకే ఆనందాన్ని ఇస్తాయి కానీ దాని ప్రభావం మాత్రం మిగిలిపోతుంది.ఈ లోకంలో చేసే చిన్నపాటి తప్పులకు శిక్ష తప్పదు అలాంటిది ఆ అల్లాహ్ యొక్క న్యాయస్థానం నుండి తప్పించుకోవటం సాధ్యమా?వెరేవైపు విశ్వాసులకు ఈ లోకంలో కష్టాలు తప్పవు వారు ఈ కష్టాలను ఆ అల్లాహ్ కొరకు స్వీకరిస్తారు మరియు ఎటువంటి కఠినమైన పరిస్థితి ఎదురైనా ఆ అల్లాహ్ దారిని విడిచిపెట్టరు ఎందుకంటే అల్లాహ్ వాగ్దానాలపై వారికి ఉన్నవిశ్వాసము అటువంటిది. ఏ దారిని స్వీకరించాలి?అనేది మానవుని చేతిలో ఉంది.తొందరగా అంతమైపోయే ఆనందభరిత జీవితమా?లేదా మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే కష్టపూరిత జీవితమా?

రెఫరెన్స్: నెహ్జుల్ బలాఘా,హిక్మత్ నం:117.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17