సృష్టికర్త కారుణ్యం పట్ల నిరాశ చెందకండి

మంగళ, 03/24/2020 - 09:28

ఎట్టి పరిస్థితులలోనూ సృష్టికర్త కారుణ్యం పట్ల నిరాశ చెందకండి అని ఖుర్ఆన్ ఉపదేశిస్తుంది...

సృష్టికర్త కారుణ్యం పట్ల నిరాశ చెందకండి

ముందుగా కొన్ని ఆయతులను చూద్దాం..
అల్లాహ్ తన దాసులతో ఇలా అన్నాడు: “ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందకండి”(మార్గభ్రష్టు మాత్రమే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు)[హిజ్ర్:56]
ప్రవక్త యాఖూబ్ తమ కుమారులతో ఇలా అన్నారు: “అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి”[యూసుఫ్:87]
ప్రవక్త యూసుఫ్[అ.స] తమ సోదరులతో ఇలా అన్నారు: “(నిరాశ చెందకండి) అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక1. ఆయన కరుణించేవారందరిలోకీ గొప్పగా కరుణించేవాడు”[యూసుఫ్:92]
ప్రవక్త మూసా[అ.స] మిస్ర్ నుండి దుర్మార్గుల నుండి తప్పించుకొని మదాయన్ కు వచ్చనప్పుడు ప్రవక్త షుఐబ్[అ.స] వారితో ఇలా అన్నారు: “భయపడకు నువ్వు దుర్మార్గ జనుల బారి నుంచి విముక్తి పొందావు”[ఖిసస్:25]
దైవప్రవక్త[స.అ] తమ సహచరునితో ఇలా అన్నారు: “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు”[తౌబహ్:40]
ఈ ఆయతుల ద్వార మనిషి దేని గురించో దిగులుగా ఉన్నప్పుడు, అతడి మనసు కలతగా ఉన్నప్పుడు ఉదాహారణకు ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ వల్ల మనసు బాగులేక దిగులు చెందుతున్నప్పుడు అతడికి ధైర్యమివ్వాలని, తెలుస్తుంది.
ధైర్యాన్ని ఇవ్వలేకపోతే పోయారు భయపెట్టి కరోనా వైరస్ శోకక ముందే భయంతో ఒకరి చావుకు కారణం కాకండి.
వైధ్య నిపుణులు చెప్పే జాగ్రత్తలను పాటించండి.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 34