దైవప్రవక్త(అ.స)ల పవిత్రత

సోమ, 06/14/2021 - 17:57

దైవప్రవక్త(అ.స)ల పవిత్రత షియా వర్గం వారి విశ్వాసం ప్రకారం..

దైవప్రవక్త(అ.స)ల పవిత్రత

షియా ముస్లింలు తమ ఇమాముల ఆదేశాల ప్రకారం “దైవప్రవక్తలను అపవిత్రతల నుంచి చాలా దూరం, వారు ఎటువంటి తప్పు చేయరు” అని నమ్ముతారు. ముఖ్యంగా అంతిమ దైవప్రవక్త‎(స.అ) పట్ల వాళ్ళ అభిప్రాయం: “దైవప్రవక్త(స.అ), తప్పులు మరియు పాపములన్నీంటి నుండి అవి చిన్నవి కానివ్వండి లేదా పెద్దవి కానివ్వండి దైవప్రవక్త(స.అ)గా ఎన్నుకోక ముందు మరియు ఆ తరువాత కూడా పవిత్రులు మరియు అలాగే ప్రతీ పొరపాటు, ఉన్మాది తనం, జాదూ లాంటి అవివేక పనుల నుండి పవిత్రులు. అంతే కాదు దైవప్రవక్త(స.అ), మానవత్వానికి వ్యతిరేకమైన మరియు మంచి గుణాలకు భిన్నమైన కార్యములు ఉదా: దారిలో నడుస్తూ తినడం, గట్టిగా నవ్వడం, సమాజం దృష్టిలో అయిష్టమైన పనుల నుండి ఆమడ దూరంగా ఉంటారు”. అలాంటిది అందరి మధ్య భార్య చెంప పై చెంప పెట్టడం, భార్యతో కలిసి హబషీయుల ఆటపాటలు తిలకించడం[1], లేదా ఏదో యుద్ధంలో తన భార్యతో పరుగులు తీయడం మరియు ఒకసారి భార్య గెలవడం మరో సారి దైవప్రవక్త(స.అ) గెలవడం మరియు తన భార్యతో ఇది దానికి బదులు అని చెప్పడం[2]. దైవప్రవక్త ఇలాంటి పనులను చేయడం అసాధ్యం.

షియా ముస్లింలు, “దైవప్రవక్త‎(స.అ) యొక్క పవిత్రతకు వ్యతిరేకంగా ఉన్న రివాయతులన్నీంటిని అమవీ మరియు వాళ్ళ అనుచరులు కలసి కట్టుగా తయారు చేసినవి” అని నమ్ముతారు. మరి దాని గురించి ఇలా అంటారు: ఈ రివాయతులను, దైవప్రవక్త‎(స.అ) మరియు అతని అహ్లెబైత్(అ.స)ల ప్రాముఖ్యతను తక్కువ చేయాలని తయారు చేశారు. మరియు ఇవి శత్రువుల చేత తయారు చేయబడ్డ నకిలీ హదీసులు. చరిత్రలో భద్రంగా ఉన్న వాళ్ళ తప్పుడు పనులకు ప్రతికూలమైన హేతువుగా ఉండాలని ఈ తప్పుడు రివాయతులను తయారు చేశారు. దైవప్రవక్తే తప్పులు చేశారు మరియు తన మనసు కోరికలను నిర్వర్తించారు ఉదాహారణగా వాళ్ళు తమ పుస్తకాలలో లిఖించిన కొన్ని రివాయతులు: జనాబె జైనబ్ తన తల దువ్వుకుంటున్నారు అప్పడు ఆమె జైద్ బిన్ హారిసహ్ యొక్క భార్య, ఇంతలో దైవప్రవక్త‎(స.అ) ఆమెను చూశారు మరియు ఆమె ప్రియుడయ్యి ఇలా అన్నారు: سبحان الله مقلب القلوب.[3] ఇలాంటి వేరే రివాయతులు[4]

స్వయంగా దైవప్రవక్త(స.అ) యొక్క పరిస్థితే ఇలా ఉంటే ఇక ముఆవియా, మర్వాన్ బిన్ హకం, అమ్రోఆస్, యజీద్ బిన్ ముఆవియా అంతేకాదు ఇలాంటి పనులు చేసిన, పరుల స్త్రీల పై అత్యాచారం చేసిన, అమాయకులను చంపిన ఖలీఫాలందరిని ఎందుకని నిందించగలము!!!?.

కవి ఇలా ప్రవచించెను:
اذا کان رب البيت للدف ضاربا؛            فلاتلومن الصبيان فی حاله الرقص

అనువాదం: ఇంటి పెద్ద డప్పు వాయిస్తే ఆ ఇంటి పిల్లలు డాన్సు చేస్తే ఈసడించుకోకండి.

ఇక మిగిలింది “దైవప్రవక్త‎(స.అ) కేవలం అల్లాహ్ ఆదేశాలను ప్రచారించడంలో మాత్రమే పవిత్రులు” అనే అంశం. అయితే ఇది పూర్తిగా వ్యర్ధపు వచనం దానిపై ఎటువంటి వివేకమైన సాక్ష్యాలు లేవు ఎందుకంటే “దైవప్రవక్త‎(స.అ) యొక్క ప్రవచనాల ఈ భాగం దైవవాణి అని మరియు ఇంకో భాగం అతని ప్రవచనాల భాగం అని, ముందు భాగంలో పవిత్రులని రెండవ భాగంలో తప్పుచేసే అవకాశం ఉందని చెప్పడానికి సాక్ష్యం లేదు”. దైవప్రవక్త(స.అ) గురించి ఇలా నమ్మినట్లైతే దైవప్రవక్త(స.అ) ఉపదేశాలు(సున్నతే నబీ) విలువలేనిదిగా మారుతాయి.

మనకు కూడా దైవప్రవక్త(స.అ) యొక్క పవిత్రతను సంపూర్ణంగా నమ్మడం ఎంతైన అవసరం ఉంది లేకపోతే ఖుర్ఆన్‌ ను కూడా సందేహించవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరూ ఖుర్ఆన్ యొక్క ఒక్క సూరా చివరిలోనైనా “ఇదీ అల్లాహ్ యొక్క ప్రవచనం” అని అల్లాహ్ యొక్క సంతకాన్ని చూసివుండరు. ఈ మాట ఒక యదార్ధాన్ని తనలో దాచిపెట్టుకొని ఉంది. మతపక్షపాతం లేని మనిషి కొంచెం వివేకంతో ఆలోచిస్తే ఈ విశ్వాసాన్ని తప్పకుండా అంగీకరిస్తాడు. ఖుర్ఆన్ అల్లాహ్ యొక్క ప్రవచనాల గ్రంథం అని నమ్మినవాడికి ఖుర్ఆన్ ఆదేశాలను ప్రచారించే(దైవప్రవక్త) వారి యొక్క పవిత్రతను పూర్తిగా నమ్మాల్సివస్తుంది. ఎందుకంటే ఎవరికైనా సరే “నేను, అల్లాహ్ ప్రవచిస్తుండగా విన్నాను” అని చెప్పలేడు, అలాగే “నేను దైవదూత జిబ్రయీల్, దైవవాణి తీసుకురావడన్ని చూశాను” అని చెప్పలేడు, ఇది అసాధ్యం. కేవలం దైవప్రవక్త(స.అ) చెబితేనే మనకు తెలిసింది ఇది అల్లాహ్ యొక్క గ్రంథం అని.

సంక్షిప్తంగా చెప్పాలంటే పవిత్రత గురించి షియా ముస్లింల ప్రవచన సరైనది అదే మనసును తృప్తి పరుస్తుంది. షైతాను మరియు కోరికల దుష్టప్రేరణ అంతం చేస్తుంది. ఇస్లాం యొక్క శత్రువులు(యూధులు, క్రైస్తవులు, నాస్తికులు మొ॥) వారు మా విశ్వాసాలను హేళన చేసేందుకు, దైవప్రవక్త‎(స.అ)పై అధికప్రసంగం చేయవచ్చని మా లోపాలను వెతుకుతూ ఉంటారు. వాళ్ళందరి నోళ్ళను కట్టేసే విశ్వాసాలు కేవలం షియా ముస్లింలవే. ముస్లిముల లోపాలను వాళ్ళు కేవలం అహ్లెసున్నతుల పుస్తకాలను చదివి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మీరు కూడా చూసే ఉంటారు ముస్లిములకు వ్యతిరేకంగా ప్రదర్శించే సాక్ష్యాలు సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలలో దైవప్రవక్త(స.అ)కు ఆమడ దూరంలో ఉన్నటువంటి అపవిత్ర కార్యములు మరియు ప్రవచనాలే, అని[5].

రిఫరెన్స
1. సహీ బుఖారీ, భాగం3, పేజీ228 మరియు భాగం2, పేజీ3, కితాబుల్ ఈదైన్.
2. ముస్నదె అహ్మద్, భాగం6, పేజీ75.
3. తఫ్సీరె జలాలైన్, ఈ ఆయత్ “ و تخفي في نفسك ما الله مبديه” యొక్క వ్యాఖ్య క్రమంలో.
4. సహీ ముస్లిం, భాగం7, పేజీ138, బాబొ ఫజాయిలి ఆయిషా.
5. బుఖారీ, భాగం3, పేజీ152, కితాబుష్ షహాదాత్ యొక్క షహాదతుల్ ఆమా అను అధ్యాయంలో ఇలా రివాయత్ ఉంది: .....హజ్రత్ ఆయెషా ఇలా ప్రవచించెను: దైవప్రవక్త(స.అ) మసీదులో ఒక వ్యక్తిని ఖుర్ఆన్ చదువుతుండగా విని ఇలా అన్నారు: అల్లాహ్ ఇతడిపై దయ చేయుగాక నేను ఫలానా ఫలానా సూరాల యొక్క ఫలానా ఫలానా ఆయతులను మరిచిపోయాను ఇతడు గుర్తుకుతెచ్చాడు.
ఇక మీరే చదివి చకితులవ్వండి. ఆ అంధుడు  గుర్తుచేయకపోతే ఏమైయ్యేదో.... . అల్లాహ్ ఇలాంటి ఉన్మాది మాటల నుండి రక్షించుగాక.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18