నుబువ్వత్ (దైవదౌత్యం)

ఆది, 06/13/2021 - 18:30

ప్రవక్తల నుబువ్వత్ (దైవదౌత్యం) విశ్వాసం పట్ల షియా మరియు అహ్లెసున్నత్ వర్గాల మధ్య కొన్ని అంశాలలో అభిప్రాయబేధం కలిగివున్నారు...

నుబువ్వత్ (దైవదౌత్యం), దైవప్రవక్త పవిత్ర, మూసూమ్

ప్రవక్తల నుబువ్వత్ (దైవదౌత్యం) విశ్వాసం పట్ల షియా మరియు అహ్లెసున్నత్ వర్గాల మధ్య కొన్ని అంశాలలో అభిప్రాయబేధం కలిగివున్నారు. వాటిలో మొట్టమొదటి అంశం ఇస్మత్(పవిత్రత).
షియా ముస్లింల విశ్వాసాల ప్రకారం; “ప్రవక్త(అ.స)లు, అల్లాహ్ చేత ప్రవక్తగా ఎన్నుకోక ముందు మరియు ఆ తరువాత కూడా పవిత్రులు”.
అహ్లెసున్నతుల విశ్వాసాల ప్రకారం; “కేవలం అల్లాహ్ ఆదేశాలను ప్రచారం చేసేంత వరకు మాత్రమే పవిత్రులై ఉంటారు ఆ తరువాత వేరే విషయాలలో మాములు మనిషి వలే అప్పుడప్పుడు తప్పుఒప్పులు చేస్తూ ఉంటారు”. “దైవప్రవక్త(స.అ) చాలా సందర్భాలలో తప్పు చేశారు మరియు సహాబీయులలో కొందరు  ఆ తప్పును సరిదిద్దారు” అని అహ్లె సున్నత్ మూల గ్రంథాలు అయిన సహాహ్‌లలో ఎన్నో హదీసులు ఉన్నాయి.
ఉదా: దైవప్రవక్త(స.అ) బద్ర్ యొక్క బంధీయుల విషయంలో తప్పు చేశారని, ఉమర్ అభిప్రాయం సరైనదని, ఒకవేళ ఉమర్ ఉండక పోతే దైవప్రవక్త‎(స.అ) నాశనం అయిపోయేవారు[1] అనీ.

కొన్ని నమూనాలు:
1. దైవప్రవక్త(స.అ) మదీనహ్ పట్టణానికి వచ్చినప్పుడు మదీనహ్ వాసులను తాబీర్(కర్జూరములను ఎరువులు వేస్తుండగా) చూసి ఇలా ప్రవచించారు: “వాటిని తాబీర్ చేయకండి, ఇవి కొన్నిరోజులలో కర్జూరాలు అవుతాయి”. అవన్నీ కుళ్ళిపోయినప్పుడు వాళ్ళు దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చి ఫిర్యాదు చేయసాగారు. అప్పుడు దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: “సోదరులారా! మీరు ప్రాపంచిక వ్యవహారములలో నా కన్న ఎక్కువ తెలిసిన వారు”.

ఇంకో రివాయత్‌లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “నేను కూడా మీ మాదిరి ఒక మనిషిని, ఒకవేళ మీ ప్రపంచానికి సంబంధించిన ఆదేశం ఇస్తే, నా అభిప్రాయన్ని వ్యక్తం చేస్తే, అమలు చేయండి, (ఎందుకంటే) నేను కూడా మనిషినే కదా.[2]

2. రివాయత్‌లో ఇలా ప్రవచించబడి ఉంది: ఒకసారి దైవప్రవక్త‎(స.అ)పై చేతబడి చేయబడింది, అతను ఏమి చేస్తున్నారో అతనికే తెలిసేది కాదు. అతను తన భార్యల వద్ద వెళ్ళాను అని అనుకునే వారు[3] కాని అలా అయ్యి ఉండేది కాదు. అతనికి అప్పుడప్పుడూ ఏదో తయారు చేశాను అని అనిపించేది కాని అలా అయ్యి ఉండేది కాదు.[4]

3. రివాయతులలో ఇలా కూడా ప్రవచించబడి ఉంది: దైవప్రవక్త‎(స.అ) నమాజులో మరిచిపోయారు, అతనికి ఎన్ని రక్అతులు చదివారో కూడా తెలియలేదు.[5]

4. ఒకసారి దైవప్రవక్త(స.అ) గురక పెట్టేంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు, ఆ తరువాత  నిద్ర నుండి లేచి వుజూ చేయకుండానే నమాజు చదివించేశారు.[6]

5. ఇలా కూడా ప్రవచించబడి ఉంది: దైవప్రవక్త‎(స.అ)కు కోపం వచ్చినప్పుడు తప్పు లేకుండానే ప్రజలను దూషించేవారు. మరియు వాళ్ళపై లఅనత్ చేసే వారు.[7]

6. ఈ రివాయత్ కూడా వినండి: దైవప్రవక్త‎(స.అ), రమాజాన్ మాసంలో ఉదయం లేచినప్పుడు(అప్పుడప్పుడు) అపవిత్రంగా ఉండేవారు అందుకు నమాజ్ వదిలేయాల్సి వచ్చేది.[8]

ఇవేకాకుండా మరెన్నో రివాయతులు[9] అహ్లెసున్నత్ గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉన్నాయి. వాటిని ఇక్కడ వివరించి దైవప్రవక్త(స.అ) పవిత్రతను ఇంకా కించపరచలేము.   

వివేకం మరియు దీన్ అంగీకరించనటువంటి ఇలాంటి తప్పుడు రివాయతులు వాళ్ళ గ్రంథాలలో ఉన్నాయి. అవి మానవత్వానికి కూడా వ్యతిరేకమైనవి. ఈ రివాయతుల వెనుక కేవలం దైవప్రవక్త‎(స.అ) యొక్క మర్యాదను కించపరచాలనే మరియు స్వయంగా వాళ్ళు కూడా ఇష్టపడనటువంటి ప్రవచనాలను దైవప్రవక్త(స.అ)కు అంటకట్టాలనే ఉద్దేశం మాత్రమే కనిపిస్తుంది.[10]
ఎంత ఇస్లాం శత్రువులు ఇస్లాం దుస్తులు ధరించి తప్పుడు రివాయతులు ఉల్లేఖించి అవి ఇస్లాం ఉల్లేఖనాలు అని రచించినా అవి సరైనవో కాదో వివేకంగా పరిశీలించాల్సిన అవసరం ఇస్లాం వర్గ ఉలమాలకు ఉంది. 

రిఫరెన్స్
[1]. అల్ బిదాయహ్ వన్నిహాయహ్, ఇమామ్ అహ్మద్, ముస్లిం, అబూదావూద్ మరియు తిర్మిజీ చే ఉల్లేఖించబడింది.
2. సహీ ముస్లిం, కితాబుల్ ఫజాయిల్, భాగం7, పేజీ95. ముస్నదె అహ్మద్ హంబల్, భాగం1, పేజీ163 మరియు భాగం3, పేజీ152.
3. సహీ బుఖారీ, భాగం7, పేజీ29.
4. సహీ బుఖారీ, భాగం4, పేజీ 68.
5. సహీ బుఖారీ, భాగం1, పేజీ123 మరియు భాగం2, పేజీ65.
6. సహీ బుఖారీ, భాగం1, పేజీ37 మరియు పేజీ 44 మరియు పేజీ 171.
7. సుననె దారమీ, కితాబుర్రిఫాఖ్
8. సహీ బుఖారీ, భాగం2, పేజీ232 మరియు 234
9. సహీ ముస్లిం, బాబొ ఫజాయిలి ఉస్మాన్, భాగం7, పేజీ117
10. సహీ బుఖారీ, భాగం3, పేజీ114 మరియు భాగం 7, పేజీ96.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14