హజ్రత్ ఈసా(అ.స) యొక్క యాదార్థగాథ ఖుర్ఆన్ దృష్టిలో

గురు, 11/10/2022 - 09:02

హజ్రత్ ఈసా(అ.స) మరియు వారి పవిత్ర తల్లి హజ్రత్ మర్యమ్ ముఖద్దస్(అ.స) గురించి ఖుర్ఆన్ వర్ణించిన పద్దితి గనక మా వద్ద లేకపోయి ఉంటే, యావత్ ప్రపంచానికి వారి పవిత్ర తెలిసేదికాదు...

హజ్రత్ ఈసా(అ.స) యొక్క యాదార్థగాథ ఖుర్ఆన్ దృష్టిలో

ఖుర్ఆన్ ఉపదేశాల మరియు జ్ఞానం గురించి కొంచెం అవగానవున్న వారికి, ఖుర్ఆన్ లో హజ్రత్ ఈసా[అ.స] గురించి ఏ విధంగా మరియు ఎంత పవిత్రంగా వివరించబడి ఉందో తెలుస్తుంది. వారిని వివరిస్తూ ఉపయోగించబడిన పదాలు, వాక్యాలలో ఉన్న పదగోషం వేరే మతాల మూల గ్రంథాలలో కనిపించవు.
ఇస్లాం ఆలోచనల ప్రకారం హజ్రత్ ఈసా(అ.స) పట్ల గొప్ప గొప్ప పరిశోధకులు, జ్ఞానులు మరియు పండితులు ప్రత్యేక దృష్టిని చూపించారు. అల్లామా ఫఖీహ్ మర్హూమ్ కాషిఫుల్ గితా వారు ఇలా అన్నారు: "ఒకవేళ ప్రత్యేకంగా హజ్రత్ ఈసా(అ.స) మరియు వారి పవిత్ర తల్లి హజ్రత్ మర్యమ్ ముఖద్దస్(అ.స) గురించి ఖుర్ఆన్ వర్ణించిన పద్దితి గనక మా వద్ద లేకపోయి ఉంటే, యావత్ ప్రపంచానికి వారి పవిత్ర తెలిసేదికాదు, ఎందుకంటే ఒకవేళ హజ్రత్ ఈసా(అ.స) గొప్పతం గురించి తెలుసుకోవడానికి బైబిళ్ల సప్రదించినట్లైతే వారిని వర్ణించిన విధానాన్ని చూసి ఖలం సిగ్గుపడి ఉండేది".[1]
గుర్తుండిపోయే విధంగా హజ్రత్ ఈసా(అ.స) వర్ణన ఖుర్ఆన్ మాటల్లో:

(ఓ ముహమ్మద్ స.అ) ఈ గ్రంథంలో మర్యమ్ విషయాన్ని కూడా ప్రస్తావించు. అప్పుడామె తన వాళ్ళనుంచి వేరై, తూర్పు వైపుకు వచ్చింది. ఆ తరువాత వారికి చూటుగా తెర వేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు జిబ్రయీల్(అ.స)ను పంపాము. అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు. నేను నీ బారి నుంచి కరుణామయుని(అల్లాహ్) శరణు వేడుతున్నాను, నువ్వు ఏ మాత్రం దైవభీతి గలవాడవైనా (ఇక్కడ నుంచి వేళ్ళిపో) అని ఆమె చెప్పింది. నేను నీ ప్రభువు తరపున పంపబడిన దూతను. నీకు ఒక పవిత్రుడైన పిల్లవాణ్ణి ఇవ్వటానికి వచ్చాను, అని అతనన్నాడు. నాకు పిల్లవాడు కలగటమేమిటీ? నన్ను ఏ మగాడూ కనీసం తాకనైనా లేదే! నేను దుర్నడత గల దాన్ని కూడా కానే!! అని ఆమె అన్నది. జరిగేది మాత్రం ఇదే. అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా, మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయం, అని నీ ప్రభువు సెలవిచ్చాడు, అని అతను వివరించాడు. అంతే ఆమె గర్భవతి అయింది. ఈ కారణంగా ఆమె ఏకాంతం కోసం దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఆ తరువాత పురిటినొప్పులు ఆమెను ఒక ఖర్జూర చెట్టు క్రిందికి చేర్చాయి. అయ్యో! నేను ఇంతకు మనుపే చచ్చిపోయి ఉంటే, లోకులు నన్ను మరచిపోయి ఉంటే భావుండునే!, అని ఆమె బాధపడసాగింది. అంతలో (దైవదూత) క్రింది నుంచే ఆమెను పిలిచి ఇలా అన్నాడు: బాధ పడకు, నీ ప్రభువు నీ క్రింద ఒక నీటి ఊటను ప్రవహింపజేశాడు. ఆ ఖర్జూరపు మొదలును నీ వైపుకు ఊపు. తాజా ఖర్జూర పండ్లు నీపై రాల్తాయి. ఇక హాయిగా తిను, త్రాగు, కన్నుల పండుగ చేసుకో. ఏ మనిషైనా నీకు తారసపడితే, నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లడను, అని చెప్పు. ఆ తరువాత ఆమె ఆ పసివాణ్ణి ఎత్తుకుని తన జాతి వారి వద్దకు వచ్చింది. ఓ మర్యమ్! నువ్వు పెద్ద పాపం చేశావు. ఓ హారూన్ సోదరీ! నీ తండ్రీ చెడ్డవాడు కాడు. నీ తల్లి కూడా చెడు నడత గల స్ర్రీ కాదే! అని అందరూ అన్నారు. మర్యామ్ తన పసిపిల్లవాని వైపు సైగ చేసి చూపించింది. ఒడిలో ఉన్న ఈ పసికందుతో మేమెలా మాట్లాడగలం? అన్నారు వారంతా. ఆ పసివాడు ఇలా పలికాడు: నేను అల్లాహ్ దాసుడను. ఆయన నాకు గ్రంథం వొసగాడు. నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నేనెక్కడున్నసరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు. ఇంకా ఆయన నన్ను నా తల్లికి సేవచేసేవానిగా చేశాడు. నన్ను దైర్జన్యపరునిగానూ, దౌర్భాగ్యునిగానూ చేయలేదు. నేను పుట్టిన రోజూ, నేను చనిపోయే రోజూ, నేను సజీవినై తిరిగి లేపబడేరోజూ నాపై శాంతి కలుగుతుంది. ఇదీ మర్యమ్ కుమారూడైనా ఈసా యదార్థ గాథ. ప్రజలు సంశయంలో పడివున్న సత్యవాక్కు ఇదే.(సూరయె మర్యమ్, ఆయత్16-34)

రిఫరెన్స్
1. పజోహిషీ దర్బారె మసీహ్ వ ఇంజీల్, ఆయతుల్లాహ్ షేఖ్ మొహమ్మద్ హుసైన్ కాషిఫుల్ గితా, పేజీ17

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10