.ఇమామత్ అనగా నాయకత్వం, అల్లాహ్ తరపు నుండి ప్రసాదించబడుతుంది. దానికి నిదర్శనం ఖుర్ఆన్ ఆయత్ లు.
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: وَإِذِ ٱبۡتَلَىٰٓ إِبۡرَٰهِۧمَ رَبُّهُۥ بِكَلِمَٰتٖ فَأَتَمَّهُنَّۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامٗاۖ قَالَ وَمِن ذُرِّيَّتِيۖ قَالَ لَا يَنَالُ عَهۡدِي ٱلظَّٰلِمِينَ; (ఓ ప్రవక్తా! ఆ సందర్భాన్ని కూడ గుర్తుకు తెచ్చుకోండి) ఇబ్రాహీమ్ ను అతని ప్రభువు కొన్ని విషయాలలో పరీక్షించాడు. వాటన్నిటిని అతను పూర్తి చేయగా(వాటన్నిటిలో పూర్తిగా నెగ్గిన తరువాత) (అల్లాహ్) ఇలా అన్నాడు: నేను నిన్ను మానవులందరికీ ఇమామ్‌గా(నాయకునిగా) చెయ్యబోతున్నాను. ఇబ్రాహీమ్ తన ప్రభువుతో ఇలా అడిగారు: ఇది నా సంతానానికి కూడా వర్తిస్తుందా? అప్పుడు అల్లాహ్ అనెను: నా ఈ అధికారం జాలిములైన(దుర్మార్గులైన) వారికి వర్తించదు[అల్ బఖరహ్ సూరా:2, ఆయత్:124]
ఈ ఆయత్‌లో ఇలా ప్రవచించబడి ఉంది; ఇమామత్ అల్లాహ్ యొక్క అధికారం, అల్లాహ్ తన దాసులలో ఎవరికి ప్రసాదించాలను కుంటే వారికి ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఈ ఆయత్‌లో “جَاعِلُكَ لِلنَّاسِ إِمَامٗا” అని వచ్చింది దానితో పాటు ఈ ఆయత్, అల్లాహ్ యొక్క అధికారం కేవలం ఆయన ఎవరినైతే ఈ అధికారం కోసమే ఎన్నుకున్నాడో ఆ మంచి దాసులకే ప్రసాదించబడుతుంది. మరి అన్యాయులకు ఈ అధికారం దక్కదు.
రిఫ్రెన్స్
ఖుర్ఆన్ మజీద్.
వ్యాఖ్యానించండి