ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) వసీయత్ యొక్క ముఖ్యాంశాలు సంక్షిప్తంగా...
ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) ఒక హదీస్ లో ఇలా ఉపదేశించారు: ఒకరిలో ఈ మూడు ప్రాముఖ్యతలు ఉంటే అవి అల్లాహ్ ఇష్టానికి కారణమౌతాయి: 1. ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చేయడం 2. మంచి సహవాసి కలిగి ఉండడం 3. ఎక్కువగా సద్ఖా ఇవ్వడం.
ఎవరిలో ఈ మూడు ప్రాముఖ్యతలు ఉంటాయో అతడు పశ్చాత్తాపానికి గురి కాడు: 1. తొందరపాటును విడవడం 2. తన పనులలో ఇతరుల సలహాలు తీసుకోవడం 3. ఒక పని చేయాలని అనుకున్నప్పుడు అల్లాహ్ పట్ల నమ్మకం కలిగి ఉండడం.[1]
మరో రివాయత్ లో ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) ఇలా ఉపదేశించారు: విశ్వాసిలో మూడు లక్షణాలు ఉండాలి: 1. అల్లాహ్ తరపు నుండి తౌఫీఖ్(అర్హత) కలిగి ఉండడం 2. లోపల నుండి సద్బోధన చేసేవాడు కలిగి ఉండడం 3. సద్బోధన చేసేవాడి బోధనను స్వీకరించే గుణం కలిగి ఉండడం.[2]
1. కష్ఫుల్ గుమ్మహ్, భాగం2, పేజీ349.
ثَلاثٌ يَبْلُغْنَ بِالْعَبْدِ رِضْوانَ اللّه ِ تَعالى: كِثْرَةُ الاْءسْتِغفارِ وَ لِينُ الْجانِبِ وَ كَثْرةُ الصَّدَقَةِ. وَ ثَلاثٌ مَنْ كُنَّ فيهِ لَمْ يَنْدَمْ: تَرْكُ الْعَجَلَةِ وَ الْمَشُورَةِ وَ التَّوَكُّلُ عَلَى اللَّهِ عِنْدَ الْعَزْمِ
2. బిహారుల్ అన్వార్, భాగం78, పేజీ358.
اَلمُؤمِنُ یَحتاجُ إلی ثَلاثِ خِصالٍ: تَوفیقٍ مِنَ اللهِ، وَ واعِظٍ مِن نَفسِهِ وَ قَبُولٍ مِمَّن یَنصَحُهُ
వ్యాఖ్యానించండి