బానిస సంకెళ్ళలో బంధీగ ఉన్న ఇరాన్ ను స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన ఆయతుల్లాహ్ ఖుమైనీ[ర.అ] గారి గురించి సంక్షిప్త వివరణ.
ఆయతుల్లాహ్ ఖుమైనీ[ర.అ], సెప్టెంబర్ నెల 24వ తారీఖు 1902 వ సంవత్సరం ఇరాన్ దేశానికి చెందిన “ఖుమైన్” అను పట్టణంలో జన్మించారు. అతని పేరు “రూహుల్లాహ్” . తండ్రి పేరు సయ్యద్ ముస్తఫా మరియు తల్లి పేరు బాను హాజిర్. అతని జన్మించిన ఐదు నెలలకే వారి తండ్రి చంపబడ్డారు. 15 సంవత్సరాల వయసులో తల్లి మరణించారు. వారు చిన్న వయసులోనే ఖుమైన్ మరియు అరాక్ లో ఇస్లాం ధర్మశాస్త్రాభ్యాసం మొదలు పెట్టారు. 19 సంవత్సరాల వయసులో అక్కడ చదువును పూర్తి చేసుకొని 1921 వ సంవత్సరంలో పెద్దచదుల కోసమని తమ కొంతమంది మిత్రులతో కలిసి “ఖుమ్” కు వెళ్ళారు, అక్కడ పెద్ద పెద్ద మరియు మంచి మంచి పండితులతో విద్యను పొందారు.
వారు విద్యనేర్చుకోవడంతో పాటు తన ఆత్మ పవిత్రత పట్ల కూడా చాలా శ్రద్ధ చూపించే వారు. వారు ఎల్లప్పడూ చక్రవర్తుల మరియు ఇస్లాంకు విరుద్ధ పాలనను వ్యతిరేకించేవారు, కాని వారి వ్యతిరేకత రహస్యంగా మరియు మౌనంగా, ఏదో ఒక పుస్తకానికి బదులుగా రచించి లేదా ఏదో విధంగా ఉండేది. వారు ఎప్పుడైతే స్వయంగా ధర్మవేధి స్థానాన్ని పొందారో అప్పడు ఇరాన్ చక్తవర్తి “షాహ్”కు వ్యతిరేకంగా యుద్ధానికి దిగారు.
1962 లో వారు “షాహ్”కు విరుద్ధంగా ప్రజలకు “నౌరోజ్” పండగను జరుపోకోకుండా ఆపారు. ఆ తరువాత ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) షహాదత్ రోజున ఉపన్యాసం ఇస్తుండగా షాహ్ మనుషులు దండెత్తి చాలా విద్యార్ధులను హతమార్చారు. అప్పటి నుండి విప్లవం మరియు ఇస్లామీయ అధికారం కోసం ప్రయత్నం మొదలయ్యింది. అందులో భాగంగా వారికి దేశబహిష్కరణ క్రమంలో స్వదేశాన్ని విడిచి టర్కీ, ఇరాఖ్ మరియు ఫ్రెంచ్ కు వెళ్ళవలసి వచ్చింది. వారికి 1962 నుండి 1978 వరకు స్వదేశం నుండి బయట ఉండవలసి వచ్చింది.
ఫిబ్రవరి 1978లో వారు ఫ్రెంచు నుండి ఇరాన్‌కు తిరిగి వచ్చారు. వారు ఇరాన్ తిరిగి రావడం వల్ల ప్రజల్లో అభిలాష పెరిగింది మరియు ప్రజలు చాలా సహనంతో ఓర్పుగా యుద్ధం చేశారు. చివరికి వారు ఇరాన్ వచ్చిన 10వ రోజున షాహ్ యొక్క ప్రభుత్వానికి అపజయం మరియు ఇస్లామీయ విప్లవానికి విజయం దక్కింది.
వారు 87 సంవత్సరాల వయసులో జూన్ నెల 3వ తారీఖు 1989 లో మరణించారు. వారి సమాధి తెహ్రాన్ లో ఉంది.
వ్యాఖ్యలు
Mashaallah
shukriya...
వ్యాఖ్యానించండి