ఇమాం అలి[అ.స] తల్లితో సర్వేస్వరుడైన అల్లాహ్ సంభాషణ
మూడు రోజులు కాబాలో అల్లాహ్ అతిధిగా ఉన్న ఫాతిమ బింతె అసద్ [స.అ] తన కుమారునితో కాబా బయటకు రావాలని అనుకున్నప్పుడు ఒక శబ్దాన్ని విన్నారు,ఆ సర్వేశ్వరుడైన అల్లాహ్ ఫాతిమ బింతె అసద్ ను[స.అ] సంభోదిస్తూ ఈ విధంగా పలికెను: "ఓ ఫాతిమ! ఈ శిసువు కు అలి అని నామ కరణం చేయుము ఎందువలననగా నేను కూడా అలియ్యున్ ఆలాను[సర్వోన్నత ప్రభువును], అతని నామమును నా నామము నుండి ఎన్నుకొన్నాను,అతనికి నేను శిష్టాచారమైన అన్ని నియమాలను నేర్పాను,నా ఆదేశాలను కూడా ఇచ్చి ఉన్నాను,సమస్యాత్మకమైన మరియు కఠినమైన జ్ఞానంలో అతనికి ఆత్మ అవగాహన కల్పించాను,అతను నా ఇంట్లో జన్మించిన వాడు,నా గృహములో అజాన్ ఇచ్చే మొదటి వ్యక్తి,విగ్రహాలను వీడనాడి కాబా పై నుండి వాటిని పడవేసే వ్యక్తి కూడా అతనే, అతనిని ప్రేమించి,అతని పట్ల విధేయులై ఉన్నవారు మరియు అతనికి సహాయపడే వారు చాలా అదృష్టవంతులు,అతని పట్ల శత్రుత్వ వైఖరి ప్రదర్శించి అతనిని వ్యతిరేకించే వారు దురదృష్టపరులు,వారు అతనిని ద్వేషిస్తారు మరియు అతని హక్కును తిరస్కరిస్తారు”.
రెఫరెన్స్: అలి వలీదుల్ కాబ,పేజీ నం: 32.
వ్యాఖ్యానించండి