మతస్థులు

సోమ, 08/05/2019 - 11:32

ముసల్మాన్, మొమిన్, కాఫిర్, ముర్తదె మల్లీ, ఫిత్రీ, జిమ్మీ, మొదలగు వారు ఎవరూ అన్న విషయం పై సంక్షిప్త వివరణ.

మతస్థులు

ఈ లోకంలో జీవిస్తున్న వారిలో కొందరు మతాన్ని నమ్ముతారు మరి కొందరు నమ్మరు. మతాన్ని నమ్మేవారిలో కూడా ఎన్నో రకాలువారున్నారు అలాగే మతాన్ని నమ్మని వారిలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. వివరణ:
ముసల్మాన్: అనగా తౌహీద్, రిసాలత్ మరియు ఖియామత్ ను విశ్వసించిన వారు
మొమిన్: అనగా తౌహీద్, అదాలత్, రిసాలత్, ఇమామత్ మరియు ఖియామత్ ను విశ్వసించేవారు
కాఫిర్: అనగా ఉసూలె దీన్ లేదా నమాజ్, రోజా మొదలగు వాటి దీన్ యొక్క వేరే మూలమైనవాటిని వ్యతిరేకించిన వాడు
మునాఫిఖ్: అనగా నోటితో ఇస్లాంను స్వాకరించినా మనసులో అవిశ్వాసాన్ని ఉంచుకున్న వాడు
ముష్రిక్: అనగా బుహుదేవారాధన చేయువాడు
ముర్తద్: అనగా అవిశ్వాసి(కాఫిర్)గా మారిన విశ్వాసి(ముస్లిం)
ముర్తదె మిల్లి: అనగా విశ్వాసి(మస్లిం)గా మారి మరలా అవిశ్వాసి(కాఫిర్)గా మారిన ఒక అవిశ్వాసి(కాఫిర్)
ముర్తదె ఫిత్రీ: అనగా తన తల్లిదండ్రుల నుండి ఎవరో ఒకరు విశ్వాసి(ముస్లిం) అయి ఉన్న ఒక విశ్వాసి(ముస్లిం) అవిశ్వాసి(కాఫిర్)గా మారిపోయినవాడు
యహూదీ: హజ్రత్ మూసా[అ.స] తరువాత ఏ ప్రవక్త పట్ల విశ్వాసం కలిగి లేని వారు
ఈసాయీ: హజ్రత్ ఈసా[అ.స] తరువాత ఏ ప్రవక్త పట్ల విశ్వాసం కలిగిలేని వారు
మజూసీ: నిప్పును భగవంతుడిగా నమ్మేవారు
కాఫిరె జిమ్మీ: ప్రవక్త లేదా ఇమామ్ తో సంధి చేసి ఉన్న వారు
కాఫిరె హర్బీ: ప్రవక్త లేదా ఇమామ్ తో సంధి చేయని వారు

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే సివ్వుమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9