సుఫియానె సూరి కి ఇమాం సాదిఖ్[అ.స] ల వారి తాకీదులు

సోమ, 09/30/2019 - 13:04

సుఫియానె సూరి ఇమాం సాదిఖ్[అ.స] ల వారి తాకీదులు.

ఇమాం సాదిఖ్,సుఫియనె సూరి,తాకీదు.

సుఫియానె సూరి ఈ విధంగా ఉల్లెఖించారు: నేను ఇమాం సాదిఖ్[అ.స] ల వారితో "ఓ దైవప్రవక్త కుమరుడా! నాకు ఏమైనా సత్భొధన చేయండి" అని అన్నాను దానికి ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ముందు నాలుగు ఆ తరువాత ఐదు ఆ తరువాత తొమ్మిది రకాల సత్భోధనలను నాకు చేసారు అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి :

1.అబధ్ధాలాడేవాడు,సభ్యతను[గౌరవాన్ని] పొందలేడు.

2.రాజు,స్నేహితుడిని కలిగి ఉండలేడు[రాజకీయం స్నేహాన్ని ఎరుగదు].

3.అసూయతో[ఈర్ష్యతో] ఉన్నవాడు,సుఖాన్ని పొందలేడు.

4.చెడు ఆచరణ కలిగిన వాడు,గొప్పవాడు కాలేడు.

5.దేవునిపై నమ్మకాన్ని కలిగి ఉండు,ఇదే ఈమాన్[విశ్వాసము].

6.ఏదైతే ఆ భగవంతుడు నీకు ఇచ్చాడో దానితో రాజీ పడు,ఇదే నిరపేక్షాపరత్వం[ఏ అక్కరా లేకపోవటం].

7.ఇరుగుపొరుగువారితో మంచితనంతో ప్రవర్తించు,ఆ విధంగా ముస్లిముగా ఉండగలవు.

8.దైవభీతి లేని వారితో స్నేహము చేయకు,ఎందుకంటే అతను అవిధేయతను నీకు నేర్పుతాడు కాబట్టి.

9.దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నవారి సలహాలను[మాత్రమే] తీసుకో.

రెఫరెన్స్: అల్ ఖిసాల్,1వ భాగము,పేజీ నం: 169.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 29