జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ మరియు ఇమాం హుసైన్[అ.స] దర్శనం.

సోమ, 09/30/2019 - 19:31

కర్బలా లో ఇమాం హుసైన్[అ.స] ల వారి దర్శనభాగ్యం కలిగిన తొలి వ్యక్తి జాబిర్.ఇమాం[అ.స] ల వారు వీరమరణం పొందిన తరువాత కఠినమైన దారులలో సైతం ప్రయాణించి ఆనాడు ఇమాం హుసైన్[అ.స] ల వారి సమాధిని దర్శించారు. 

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్,ఇమాం హుసైన్,దర్శనం.

జాబిర్ ఇబ్నె అబ్దుల్లహ్ అన్సారి దైవప్రవక్త[స.అ.వ] ల వారి సహాబీయులు మరియు ఇమాం అలి[అ.స] ల వారి నుండి ఇమాం బాఖిర్[అ.స] ల వారి వరకు అందరిని దర్శించి వారి అనుచరులుగా ఉండే భాగ్యాన్ని కూడా పొందారు.వారు దైవప్రవక్త[స.అ.వ] ల వారితో కలిసి 19 యుధ్ధాలలో పాల్గొన్నారు.సిఫ్ఫీన్ యుధ్ధ సమయంలో ఇమాం అలి[అ.స] ల వారి సైన్యంలో ఉన్నారు.జాబిర్ దైవప్రవక్త[స.అ.వ] ల వారి నుండి చాలా హదీసులను వ్యాఖ్యానించారు వాటిలో “హదీసె గదీర్”,”హదీసె మంజిలత్”,”హదీసె సఖలైన్” ముఖ్యమైనవి. ఇమాం హుసైన్[అ.స] ల వారు కర్బలాలో వీరమరణం పొందిన నలభై రోజులకు వారిని దర్శించే భాగ్యాన్ని పొందిన తొలి వ్యక్తి జాబిర్ బిన్ అబ్దుల్లాహ్.61వ హిజ్రిలో కర్బలాలో ఇమాం హుసైన్[అ.స] ల వారిని దర్శించే సమయానికి వృధ్ధాప్యం వలన జాబిర్ తన కంటిచూపును కోల్పోవటం జరిగింది. "అతియయె ఊఫి" సహాయంతో కర్బలా చేరుకుని ఫురాత్ నదిలో స్నానమాచరించి ఇమాం ల వారి సమాధి వద్దకు చేరుకున్న జాబిర్ సోకతప్త హృదయంతో కన్నీటిపర్వమై చాలా విలపించారు,చివరికి స్పృహ కోల్పోయారు.స్పృహ వచ్చిన తరువాత ఇమాం[అ.స] ల వారి జియరత్ చదివి ఆ తరువాత ఇతర అమరవీరుల జియారత్ ను కూడా చదివారు. చివరకు ఈ దైవప్రవక్త అనుచరుడు 94 సంవత్సరాల వయస్సులో 78వ హిజ్రిలో మరణించటం జరిగింది.

రెఫరెన్స్:తూసి,మిస్బాహుల్ ముతహజ్జిద్,పేజీ నం:787,బిహారుల్ అన్వార్,అల్లామా మజ్లిసి,98వ భాగం,పేజీ నం 196.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22