ఐక్యమత్యం యొక్క ప్రాముఖ్యత మాసూముల హదీసులలో

ఆది, 11/10/2019 - 18:56

ముస్లిముల మధ్య ఐక్యత యొక్క ప్రాముఖ్యతను వివరించే మాసూముల కొన్ని హదీసులు.

ఐక్యమత్యం యొక్క ప్రాముఖ్యత మాసూముల హదీసులలో

దైవప్రవక్త[స.అ.వ]: “దైవపాలకులకు కట్టుబడి ఉండి వారి ఆజ్ఞలను పాటించండి ఎందుకంటే ఒక నాయకత్వం పట్ల విధేయత చూపటం ముస్లిం జాతి యొక్క ఐక్యతకు నిదర్శనం” [ఆమాలియె ముఫీద్,1వ భాగం,పేజీ నం:14].

ఇమాం అలి[[అ.స] ల వారు తన ఇద్దరు కుమారులను ఉపదేశిస్తూ ఈ విధంగా ప్రవచించారు: “మీకు ఇతరితో సంబంధాలను ఏర్పరుచుకోవటం మరియు క్షమించే అలవాటు కలిగి ఉండటం అవసరం మరియు విభజనను నివారించటం మరియు ఒకరితో ఒకరు శత్రుత్వాన్ని కలిగి ఉండటం తగదు” [నెహ్జుల్ బలాఘా,లేఖ నం:47].

ఇమాం అలి[అ.స]: “వారి భగవంతుడు ఒక్కడు,వారి ప్రవక్త ఒక్కడు,వారి దైవగ్రంధం  ఒక్కటి.వారిని ఆ భగవంతుడు ఒకరినొకరు విభజించుకోమని ఆజ్ఞాపించాడా దానిపై అమలు చేస్తున్నారు?లేదా విభేదించవద్దని ఆపినాడా,వారు అవిధేయతను చూపిస్తున్నారు?” [నెహ్జుల్ బలాఘా,ఖుత్బా నం:18].

ఇమాం సాదిఖ్[అ.స]: “విబేధాలు పుట్టుకొచ్చి దాని వలన ఒక జాతి నాశనమవుతున్న సమయంలో [వాటిని తొలగించి] ఐక్యతను సృష్టించటం మరియు వారు ఒకరికొకరు దూరమవుతున్న సమయంలో వారిని దగ్గర చేయటం ఒక రకమైన ఉపకారము దానిని ఆ భగవంతుడు ఇష్టపడతాడు”[అల్ కాఫి,2వ భాగము,పేజీ నం:209].

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 30