ఐక్యమత్యం గురించి హజ్రత్ అలీ[అ.స] ఉల్లేఖనం

ఆది, 11/10/2019 - 14:40

ఐక్యమత్యం గురించి హజ్రత్ అలీ[అ.స] యొక్క హదీసులు వివరణ...

ఐక్యమత్యం గురించి హజ్రత్ అలీ[అ.స] ఉల్లేఖనం

హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఇలా ప్రవచించెను: “... మరియు అల్లాహ్ పట్ల భయం కలిగి ఉండు. ప్రాణం, ధనం మరియు నోటి ద్వార జిహాద్ విషయంలో పరస్పరం ఒకరితో మరొకరి సంబంధాలను అనుకూలంగా చేసుకోండి, ఒకరినొకరు సహాయపడండి. ఖబడ్డార్! ఒకరిని చూసి ఒకరు ముఖాలను త్రిప్పుకోకండి, సంబంధాలను తెంచుకోకండి, మంచి పట్ల ప్రేరణ మరియు చెడు పట్ల నిషేధన(అమ్ర్ బిల్ మారూఫ్ వ నహ్యి అనిల్ మున్కర్)ను వదలకండి దాంతో మీ పై దుర్మార్గులు అధికారం చెలాయిస్తారు ఆపై మీరు మొర పట్టుకొన్నా దానిని వినే వారు ఉండరు[నెహ్జుల్ బలాగహ్, వసియ్యత్..41, పేజీ566]
మరో చోట ఇలా ఉల్లేఖించారు: “నిస్సందేహముగా షైతాన్ నీకోసం మార్గాలను శులభం చేస్తాడు.... అతడు నిన్ను ఐక్యత నుండి విభజన యొక్క ఆపదలలో ముంచేయాలని అనుకుంటాడు, అందుకని అతడి వలలో చిక్కకుండా అతడి నుండి ముఖాన్ని త్రిప్పుకోండి”[నెహ్జుల్ బలాగహ్, ఖుత్బహ్:121, పేజీ239]

రిఫ్రెన్స్
నెహ్జుల్ బలాగహ్, సయ్యద్ రజీ, ముహమ్మద్ ఇబ్నె అబీ అహ్మద్ హుసైన్, ముతర్జిమ్.. అల్లామహ్ జీషాన్ హైదర్ జవాదీ, ఇంతెషారాతె అన్సారీయాన్, ఖుమ్, చాప్ చహారుమ్, 1430హి.ఖ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5