దాయి సప్తాకాశాలలో ఉండే ఒక దూత గురించి హదీస్ వివరణ...
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: అల్లాహ్, సప్తాకాశాలలో, దూతను నియమించాడు. వారిని “దాయి” అంటారు. రజబ్ మాసం రాగానే, ఆ మాసం యొక్క ప్రతి రాత్రి ఉదయం వరకు ఇలా పిలుస్తూ ఉంటారు: “స్మరించేవారికి శుభవార్త, విధేయతలకు శుభవార్త”
అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “నాతో కూర్చున్న వారితో నేనూ కూర్చుంటాను, నా పట్ల విధేయత చూపే వారికి నేనూ విధేయత చూపుతాను, నాతో క్షమాపణ కోరే వారిని క్షమిస్తాను. (ఈ) నెల, నా నెల, (ఈ) దాసుడు నా దాసుడు మరియు (ఈ) దయ నా దయ. ఈ మాసంలో నన్ను పిలిచినవాడికి సమాధానమిస్తాను, మరియు నన్ను కోరుకున్నవారి కోరికలను తీరుస్తాను, మరియు నా నుండి రుజుమార్గం కోరితె నేను అతడికి రుజుమార్గం చూపిస్తాను. ఈ మాసాన్ని నా మరియు నా దాసుని మధ్య సంబంధంగా నిర్ధారించాను. ఈ సంబంధం(త్రాడు)ను పట్టుకున్నవాడు నా వరకు చేరిపోయినట్లే” [బిహారుల్ అన్వార్, భాగం98, పేజీ377, హదీస్1]
రిఫరెన్స్
మజ్లిసీ, బిహారుల్ అన్వార్, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.
వ్యాఖ్యలు
Subhanallah
వ్యాఖ్యానించండి