కరోనా నుంచి నేర్చుకున్న పాఠం

మంగళ, 02/16/2021 - 18:26

ఒకరోజు నేను కంగారు కంగారుగా టాక్సీ ఎక్కాను, నాకు ఏమాత్రం మాస్క్ పెట్టుకోలేదని గుర్తులేదు...

కరోనా నుంచి నేర్చుకున్న పాఠం

ఒకరోజు నేను కంగారు కంగారుగా టాక్సీ ఎక్కాను, నాకు ఏమాత్రం మాస్క్ పెట్టుకోలేదని గుర్తులేదు. కూర్చుండిపోయాను. టాక్సీ డ్రైవర్ బండి స్టార్ట్ చేశాడు, ఇంతలో వెనక నుండి మిష్టర్! ప్లీజ్ మీరు మీ మాస్కును పెట్టుకోండి అని వినబడింది, వెనక్కి తిరిగి చూశాను, వెనక సీటులో ఒకామె సగం హిజాబ్ చేసుకొని ఉంది కాని మాస్కులు మాత్రం రెండు పెట్టుకొని ఉంది.
నేను: క్షమించండి, కంగారులో మాస్క మర్చిపోయాను. జేబులో నుంచి మాస్క్ తీసుకొని పెట్టుకున్నాను
ఆ తరువాత నేను ఆమెతో ఇలా అన్నాను: మిస్! ఏమీ అనుకోకపోతే నాదీ ఒక విన్నపం; దయచేసి మీరు సరిగా హిజాబ్ చేసుకోండి!
ఆమె గట్టిగా “మిష్టర్! ఇది మీకు సంబంధం లేని విషయం” అని అంది
నేను: మిస్! ఎలాగైతే నేను మాస్క్ వేసుకోకపోతే మీకు వైరస్ సోకుతుందేమోనన్న భయం ఉందో, అలాగే మీరు ధరించిన విధానం వల్ల నేనూ నా కుటుంబ సభ్యులే కాకుండా చాలా మంది కుటుంబాలు చెల్లా చెదురు అయ్యే అవకాశం ఉంది. మీ ఈ పని కేవలం శారీరక నష్టాలతో పాటు అధ్యాత్మిక నష్టాలకు గురి చేస్తుంది.
ఆమె: నా ఇష్టం, ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు నీ కళ్ళను కట్రోల్ లో పెట్టుకో!!!
అప్పటి వరకు మౌనంగా మా మాటలు వింటున్న డ్రైవర్ ఇలా అన్నాడు: “మిస్! మీ ఇష్టం మీ ఇంటికి పరిమితం అంతే! బయటికి వచ్చినప్పుడు సమాజం యొక్క బాగు కోసం కూడా ఆలోచించాలి, కట్టుబాట్లను నిర్వర్తించాలి, ఇక్కడ ఇదే చట్టం.
నేనూ ఏదైనా చెబుదామని సిద్ధమయ్యే లోపే “డ్రైవర్ కారాపు దిగాలి” అని అంది.
డ్రైవర్ కూడా వెంటనే ఆపేశాడు. ఆమె దిగి కారు డోరును గట్టిగా వేసి వెళ్ళిపోయింది.
నేను నవ్వి డ్రైవర్ తో అన్నాను, క్షమించు నీ గిరాకీను చెడగొట్టాను, ఆమె కిరాయి డబ్బులు ఇవ్వకుండానే వెళ్లిపోయింది.
ఆ డ్రైవర్ చిన్నగా నవ్వి అదేమి పట్టించుకోకు అని అన్నాడు.
అప్పుడు నాకు ఇలాంటి ఆలోచనలు రావడం మొదలయ్యాయి; కొన్ని నెలల లోనే అధికారం మరియు ప్రజలూ కలిసి కట్టుగా మాస్క్ వేసుకునే ఆచారాన్ని సహజంగా మార్చగలిగారు! కాని ఇదే పని హిజాబ్ విషయంలో ఎందుకని చేయరు.
కరోనా కోసం అన్ని చోట్ల మాస్క్ లేకుండా ప్రవేశించకండి అని వ్రాసి పెట్టారు, ఒకవేళ మాస్క్ లేకుండా ప్రవేశిస్తే చాలు అందురూ పైనుంచి క్రింద వరకు చూస్తారు. కొన్ని చోట్లైతే మాస్క్ లేకపోతే వారికి సర్వీసే ఇవ్వడం మానేస్తున్నారు.
ఇదే పని హిజాబ్ విషయంలో కూడా చేస్తే ఎంత బాగుండేది. ఇంతిలా కాకపోయినా ఇందులో 50% చేసినా ఫలితం దక్కుతుంది.   

రిఫరెన్స్
https://btid.org/fa/news/158377

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15