స్త్రీ ప్రాముఖ్యత ఇస్లాం దృష్టిలో

ఆది, 10/29/2017 - 21:00

ఈ క్రింది వ్యాసంలొ స్త్రీ ప్రాముఖ్యతను ఖురాన్ మరియు హదీస్ అనుసారంగా వివరించడం జరిగింది.

స్త్రీ ప్రాముఖ్యత ఇస్లాం దృష్టిలో

ఇస్లాం ధర్మంలొ అన్ని విధాలుగా, ఒక స్త్రీ యొక్క ప్రతిష్టత మరియు ప్రాముఖ్యతను వివరించడం జరిగింది, ఒక కూతురిగా కాని ఒక భార్యగా కాని ఒక తల్లిగా కాని అన్ని విధాలుగా స్త్రీకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది, ఎక్కడైతే ఇస్లాం పురుషుల హక్కులను వివరిస్తుందో అక్కడే  స్త్రీల యొక్క హక్కులను కూడా వివరిస్తు కనిపిస్తుంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: وَلَهُنَّ مِثْلُ الَّذِي عَلَيْهِنَّ بِالْمَعْرُوفِ ۚ وَلِلرِّجَالِ عَلَيْهِنَّ دَرَجَةٌ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
అనువాదం: "సాధారణంగ పురుషులకు స్త్రీలపై ఎలాంటి హక్కులున్నాయో న్యాయపరంగ స్త్రీలకు కూడా పురుషులపై అలాంటి హక్కులే ఉన్నాయి కాకపోతె పురుషులకు స్త్రీలపై ఒక మెట్టు ఆధిక్యత ఉన్నది,దెవుడు శక్తిమంతుడు మరియు వివేచనాపరుడు"[దివ్య ఖురాన్,2:228].
దైవప్రవక్త[స.అ] స్త్రీ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు: ఎవరైతే తమ స్త్రీలతొ మంచితనంతో వ్యవహరిస్తారో వారే ప్రళయం నాడు నాకు దగ్గరగా ఉండటానికి అర్హులు.
దైవప్రవక్త[స.అ]: మంచి పద్దతులను అలువరించుకొండి మరియు ఇరుగు పొరుగువారితో దయాగుణంతో ప్రవర్తించండి మరియు మీ యొక్క స్త్రీలను గౌరవించండి, మీరుగాని ఇలా చేస్తే ఎటువంటి లెక్కింపు లేకుండా స్వర్గంలొకి ప్రవేశిస్తారు.[అత్-తౌహీద్,పేజీ నం :127]
దైవప్రవక్త[స.అ] వేరొక చోట ఈ విధంగా సెలవిచ్చారు:సిగ్గును పది భాగాలుగా విభజిస్తే అందులో తొమ్మిది భాగాలు స్త్రీలలో మరియు ఒక భాగం పురుషులలో పొందుపరిచబడినది.[కంజుల్ ఉమ్మాల్, 3వ సంపుటి, పేజీ నం:121, హదీసు నం:5769].
ఒక స్త్రీలో అందం కంటే ముఖ్యమైనది ఆత్మసౌందర్యం, దీనిని యెల్లప్పుడు కాపాడుకోవడంలోనే ఇహపరలోకాలలో స్త్రీకి విజయం ప్రాప్తిస్తుంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Rajjab Basha on

Jazakallah khair.Bare ilaha,jo bhi Deen ki khidmat kar rahe hai unke house badhade aur unke Sarai Dua email khubool kar.salawat

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19