ఔదార్య శిఖరం

మంగళ, 03/09/2021 - 17:29

ఇమామ్ మూసా కాజిమ్(అ.స) యొక్క జీవితం మరియు వారి ఔదార్యం గురించి సంక్షిప్తంగా..

ఔదార్య శిఖరం

దైవప్రవక్త(స.అ) యొక్క 7వ ఉత్తరాధికారి, షియా ముస్లిముల 7వ ఇమామ్, ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) యొక్క కుమారులు హజ్రత్ ఇమామ్ మూసా ఇబ్నె జాఫర్(అ.స); వారి అతిముఖ్యమైన బిరుదు “కాజిమ్” మరియు వారి కున్నియత్ “అబుల్ హసన్” మరియు “అబూ ఇబ్రాహీమ్” . షియా ముస్లిములలో మరియు వారిని ఇష్టపడేవారిలో “బాబుల్ హవాయిజ్” గా ప్రసిద్ధి చెందారు. వారు సఫర్ మాసం 7వ తేదీ హిజ్రీ యొక్క 128వ సంవత్సరంలో “అబ్వా” (మక్కా మరియు మదీనహ్ మధ్యలో ఉన్న ఒక ప్రదేశం)లో జన్మించారు.
వారి తల్లి పేరు “హమీదహ్ ముసఫ్ఫహ్”; ఆమె ఆ కాలపు స్ర్తీలలోనే గొప్ప స్ర్తీ. షరా పరమైన సమస్యలలో నైపుణ్యత కలిగినవారు, ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) షరా అహ్కాములు నేర్చుకోవడానికి స్ర్రీలను వారి వద్దకు పంపేవారు. వారు ఆమె గురించి ఇలా అన్నారు: “హమీదహ్ అపవిత్రతల నుంచి శుద్ధి చేయబడినది; బంగారపు కడ్డీల వలే. నా వద్దకు చేరేంత వరకు నిత్యం దైవదూతలు ఆమెను కాపాడుతూ వచ్చారు, దీనికి కారణం; అల్లాహ్ తరపు నుంచి నాకు మరియు నా తరువాత వచ్చే వారికి ప్రసాదించబడ్డ గౌరవం”.
ఇమామ్ మూసా కాజిమ్(అ.స) 21వ ఏట అల్లాహ్ ఆదేశానుసారం గౌరవప్రదమైన ఇమామత్ పదవికి నిశ్చయించబడ్డారు. వారి ఇమామత్ కాలం 35 సంవత్సరాలు సాగింది. పవిత్ర ఇమాములందరిలో వీరి ఇమామత్ కాలం సుధీర్ఘమైనది; ఇమామ్ మహ్దీ(అ.స) ఇమామత్ తప్ప. వారు రజబ్ మాసం, హిజ్రీ యొక్క 183వ సంవత్సరంలో 55 వయసులో సిందీ ఇబ్నె షాహిక్ యొక్క కారాగారంలో హారున్ అల్ రషీద్ ఆదేశానుసారం విషం ద్వార చంపబడ్డారు. వారిని బగ్దాద్ లో ఉన్న “మఖాబిరె ఖురైష్” అను ప్రదేశంలో సమాధి చేశారు. ఇప్పుడు అది “కాజిమైన్” గా ప్రసిద్ధి చెందింది.
ఇమామ్ యొక్క సద్గుణాలు
ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఇస్లామీయ చరిత్రకారులందరి రచనానుసారం, వారు సాధారణ జీవితం మరియు ప్రార్థనలో చాలా ప్రసిద్ధి చెందినవారు; వారు తన ప్రార్థనల మరియు అతి శ్రద్ధ కలిగి ఉండడం వల్ల “అబ్దె సాలెహ్”(అత్యుత్తమ దాసుడు) గా ప్రసిద్ధి చెందారు. ఇతరులకు ప్రసాదించడంలో కూడా వారి పూర్వీకుల వలే ఉండేవారు. ఇలా ఉల్లేఖించబడి ఉంది., వారు 3 వందల దీనారుల, 4 వందల దీనారుల మరియు 2 వందల దీనారుల సంచులను పేదవారిలో పంచేవారు. ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఇలా ఉల్లేఖించారు: “నా తండ్రి(ఇమామ్ జాఫరె సాదిఖ్) నిత్యం నన్ను ఇతరులను సహాయం చేయాలి మరియు దానం చేయాలి అని చెప్పేవారు”
అయితే వారు ఇంతిలా ఇతరులను సహాయం చేస్తున్నప్పటికీ వారు మాత్రం మొరటు దుస్తులు ధరించేవారు. ఈ నడవడిక వారి ఆత్మ యొక్క గొప్పతనం మరియు వారికి ఈ ప్రాపంచిక అందచందాల పట్ల మక్కువ లేకపోవడం పై నిదర్శనం అని ఉల్లేఖించబడి ఉంది. వారు తమ భార్యా, పిల్లల మరియు వారి వద్ద ఉండేవారి పట్ల చాలా ప్రేమగా ఉండేవారు, నిత్యం పేదవారి గురించే ఆలోచిస్తూ ఉండేవారు, వారికి ఏదో విధంగా సహాయపడుతూ ఉండేవారు. 
వారు ఖుర్ఆన్ పఠనాన్ని చాలా ఇష్టపడేవారు, ఖుర్ఆన్ ను మంచి స్వరంతో పఠించేవారు, వారి స్వరం వల్ల ప్రజలు వారి ఇంటి చూట్టూ వచ్చి చేరేవారు. వారు ఖుర్ఆన్ పఠిస్తూ రోధించేవారు.
దుర్మార్గులు వారిని మరియు వారి పూర్వీకులను దూషించేవారు, వారిని నిందించేవారు, కాని ఇమామ్ వారి పట్ల ఔదార్యంగా ఉండేవారు, వారిని ఏమీ అనేవారు కాదు. ఒక్కోసారి వారికి మేలు చేసి సన్మార్గం చూపేవారు. ఈ లక్షణాల వలనే వారికి “కాజిమ్” అనే బిరుదు ఇవ్వబడింది. కాజిమ్ అనగా ఆపుకునేవాడు, ఆగ్రహాన్ని అణిచేవాడు అని అర్ధం. కాని న్యాయఅన్యాయాల మాటకోస్తే వారు ఉరుకునేవారు కాదు. వారు ఇలా ఉల్లేఖించారు: “యదార్థాన్నే చెప్పు దాని ద్వార నువ్వు నాశనం అయిపోయినా సరే”[1]
వారు పేదావారితో కూర్చునేవారు, అనాధులకు ధైర్యాన్ని ఇచ్చేవారు, బానిసలను కూడా ఇతర వ్యక్తుల మాదిరి చూసేవారు. ఆదమ్ సంతానం అల్లాహ్ సృష్టి అని చెబుతూ ఉండేవారు. అబూహనీఫహ్ ద్వార ఇలా ఉల్లేఖించబడి ఉంది: “నేను అతనిని చిన్నప్పుడు చూసాను, అతనిని కొన్ని ప్రశ్నలు అడిగాను, వారిచ్చిన సమాధానంతో తెలిస్తుంది వారు విలాయత్ నది నుంచి నిండుగా ఉన్నవారు అని. నిజానికి ఇమామ్ మూసా ఇబ్నె జాఫర్(అ.స) ఫఖీహ్, జ్ఞాని మరియు నైపుణ్యం గల ముతకల్లిమ్”[2]

రిఫరెన్స్
1. వర్రామ్, మజ్ముఅయె వర్రామ్, భాగం1, పేజీ12
2. షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, ముంతహల్ ఆమాల్, భాగం2, పేజీ237-245        

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir Mirza on

Mashaallah, thanks for brief the topics of Hz. Imam Musa e Kazim a.s.
Jazakallah

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12