గొప్ప త్యాగం

ఆది, 08/01/2021 - 07:37

లైలతుల్ మబీత్ లో అలీ(అ.స) యొక్క గొప్ప త్యాగం గురించి చరిత్ర చెప్పిన యదార్థం... 

గొప్ప త్యాగం

బెఅసత్ యొక్క 13వ సంవత్సరంలో యస్రబ్(మదీనహ్) వాసులు దైవప్రవక్త(స.అ)తో మేము మీకు మద్దత్తు తెలుపుతామనీ మరియు మీ తరపు నుంచి పోరాడతామని చెప్పి యస్రబ్ కు రమ్మని ఆహ్వానించారు. ఈ ఒప్పందం జిల్ హిజ్ మాసం 13వ తారీఖున జరిగింది ఆ మరుసటి రోజు నుంచి మెల్లమెల్లగా ముస్లిములు యస్రబ్ కు వలసిపోవడం మొదలు పెట్టారు. ఖురైష్ కు చెందిన పెద్దలకు ఇస్లాం ప్రచారం కోసం యస్రబ్ లో కొత్త కేంద్రం ఏర్పడుతుంది అని తెలిసింది, దాంతో వారి కోసం ఇది ప్రమాధంగా మారుతుంది అని భావించారు. మేము దైవప్రవక్త మరియు వారి సహచరులను వేధించినందుకు దానికి ప్రతిచర్యగా వారు పగ తీర్చుకోవచ్చు. ఒకవేళ యుద్ధం చేసే ఉద్దేశం లేకపోయినా షామ్ నుంచి యస్రబ్ గుండా వచ్చే వ్యాపారవేత్తలను మధ్యలో భయపెట్టవచ్చు అని అనుకున్నారు. ఇలాంటి ప్రమాధాలను ఎదురుకొనేందుకు బెఅసత్ యొక్క 14వ ఏట సఫర్ మాసం చివరిలో “దారున్నద్వా”(మక్కా సలహా మండలి) కు చేరి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ కమిటీలో ఉన్నవారిలో కొందరు దైవప్రవక్త ను బహిష్కరించాలి లేదా కారాగారంలో బంధించాలి అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, కాని ఈ అభిప్రాయం రద్దు చేయబడింది. చివరికి దైవప్రవక్తను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అయితే దైవప్రవక్తను చంపడం అంత సులభం కాదు, ఇలా జరిగితే బనీ హాషిమ్ వర్గంవారు ఊరుకోరు రక్తం చిందించడానికి సిద్ధమౌతారు. చివరికి ప్రతీ సమూహం నుంచి ఒక యువకుడు ఈ పనికి సిద్ధమవ్వాలి అందరు కలిసి ఒకరోజు రాత్రి దైవప్రవక్త పై విరుచుకుపడి అతడిని అతడి పాన్పు పైనే ముక్కలు ముక్కలుగా నరికేయాలి అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల చేయబడే హత్యా నేరం ఒకడి పై రాదు దాంతో బనీ హాషిమ్ లు ప్రతికారం కోసం రాలేరు ఎందుకంటే ఇన్ని సమూహాలతో వారు యుద్ధం చేయలేరు చివరికి వారు రక్తమూల్యం పై రాజీ పడతారు, కథ అంతటితో ముగుస్తుంది.
ఖురైషీయులు వారి ఈ పన్నాగం అమలు పరచడానికి రబీవుల్ అవ్వల్ మాసం యొక్క మొదటి రాత్రిని ఎంచుకున్నారు. అల్లాహ్ వారి పన్నగాలను గుర్తు చేస్తూ దైవప్రవక్తతో ఇలా అన్నాడు:
“ఓ ప్రవక్తా! కాఫిరులు నీకు వ్యతిరేకంగా వ్వూహ రచన చేసిన సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకో. నిన్ను బందీగా పట్టుకోవాలా? లేక నిన్ను హత్య చేయాలా? లేక నిన్ను దేశం నుంచి వెళ్ళగొట్టాలా? అని వారు తమ తరపున ఎత్తులు వేస్తుండగా, అల్లాహ్ పైఎత్తులు వేస్తూ ఉన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లాహ్ సాటిలేనిమేటి”[సూరయె అన్ఫాల్, ఆయత్30]

ఖురైషీయులు ఈ పన్నాగం పన్నిన వెంటనే దైవవాణిదూత దైవప్రవక్త వద్దకు వచ్చి వారి పన్నాగాన్ని తెలియపరిచి దైవప్రవక్త మక్కాను విడిచి యస్రబ్ కు బయలుదేరమని అల్లాహ్ ఆదేశాన్ని చేర్చాడు.

ఇక్కడ దైవప్రవక్త శత్రువుల పన్నాగాన్ని చిత్తు చేసి మక్కా నుంచి బయటకు వెళ్లడానికి వాళ్ల కళ్లలో మట్టిపోయాలి. అలా చేయాలంటే ఆ రాత్రి వారి పాన్పుపై పడుకునే త్యాగమూర్తి కావాలి, దాంతో దాడి చేయలనుకున్నవారు దైవప్రవక్త ఇంట్లోనే ఉన్నారు అని అనుకోవాలి. ఈ ఆలోచన వల్ల వారి దృష్టి మరో వైపు వెళ్ళదు అలా రహదారులపై తనిఖీ చర్య తగ్గుతుంది. తన ప్రాణాలను పణంగా పెట్టె వ్యక్తి అలీ(అ.స) తప్ప మరెవరుంటారు.

దైవప్రవక్త(స.అ) ఖురైషీయుల పన్నాగాన్ని అలీ(అ.స)కు వివరించి ఇలా అన్నారు.. ఈ రోజు రాత్రి నువ్వు నా పాన్పుపై పడుకొని నేను రాత్రుళ్లు కప్పుకొనే ఆకుపచ్చ గుడ్డను కప్పుకో, దాంతో వాళ్లు నేను నా పాన్పుపైనే ఉన్నానని అనుకుంటారు(నా గురించి వెతకరు).

అలీ(అ.స) చెప్పిన విధంగా అమలు పరిచారు, ఖురైషీయుల తరపు నుంచి నియోగింపబడినవారు సంధ్యసమయం నుంచి దైవప్రవక్త ఇంటిని చుట్టుముట్టారు, సూర్యోదయానికి ముందు ఒరనుంచి కత్తులు తీసుకొని ఇంటిపై దాడి చేశారు. అలీ(అ.స) పాన్పు పైనుండి లేచారు. వాళ్లు తమ పన్నాగం అప్పటి వరకు 100% వాళ్లు అనుకున్నట్లుగా జరుగుతుదని అనుకుంటున్నవారు అలీను చూడగానే తట్టుకోలేని క్షోభకు గురి అయి అలీ తో ఇలా అన్నారు: ముహమ్మద్ ఎక్కడా? అలీ ఇలా సమాధానమిచ్చారు: వారిని నాకు అప్పగించినట్లు నన్ను అడుగుతున్నారేమిటీ? ఏదో చేశారు అందుకే వారు ఇంటిని వదిలేయల్సి వచ్చింది. “తబరీ” ఉల్లేఖనం ప్రకారం అలీ(అ.స)ను వేధించారు, మస్జిదుల్ హరామ్ వైపుకు లాక్కోని వెళ్లారు, విచారణ తరువాత విడిచిపెట్టారు. ఆ తరువాత దైవప్రవక్త(స.అ)ను వెతుకుతూ మదీనహ్ వైపుకు వెళ్లారు. అప్పుడు దైవప్రవక్త(స.అ) గారె సూర్ లో ఆశ్రయిం పొందారు.[1]

చరిత్రను సృష్టించిన హజ్రత్ అలీ(అ.స) యొక్క ఈ గొప్ప త్యాగం వల్ల ఖుర్ఆన్ వారిని అల్లాహ్ మార్గంలో ప్రాణాలు అర్పించేవారిగా సూచించింది:
“ప్రజల్లోని మరి కొంతమంది ఎలాంటివారంటే, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు తమ ప్రాణాలను సయితం పణంగా పెడుతున్నారు. అటువంటి (త్యాగధనులైన) తన దాసుల పట్ల అల్లాహ్ అమితమైన వాత్సల్యం కలిగి ఉంటాడు”[సూరయె బఖరహ్, ఆయత్207]

ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు ఇలా అంటున్నారు: ఈ ఆయత్ లైలతుల్ మబీత్ లో అలీ(అ.స) యొక్క గొప్ప త్యాగంకు సంబంధించి అవతరించబడింది.[2]

రిఫరెన్స్
1. ఇబ్నె హిషామ్, అబ్దుల్ మలిక్, అల్ సీరతున్నబవియహ్, తహ్ఖీఖ్: ముస్తఫా అస్సఖా, ఇబ్రాహీమ్ అల్ అబ్యారీ మరియు అబ్దుల్ హఫీజ్ షిబ్లీ, భాగం2, పేజీ124-128. ఇబ్నె అసీర్, అల్ కామిల్ ఫీత్తారీఖ్, భాగం2, పేజీ102. మొహమ్మద్ ఇబ్నె సఅద్, అల్ తబఖాత్ అల్ కుబ్రా, భాగం1, పేజీ228. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, భాగం3, పేజీ4. అల్ హాకిమ్ అల్ నైషాబూరీ, అల్ ముస్తద్రక్ అలస్సహీహైన్, ఏదాద్.. అబ్దుర్రహ్మాన్ అల్ మరఅషీ, భాగం3, పేజీ4. తబరీ, ముహమ్మద్ బిన్ జురైర్, తారీఖుల్ ఉమమ్ వల్ ములూక్, భాగం2, పేజీ244.
2. ఇబ్నె అబిల్ హదీద్, నెహ్జుల్ బలాగహ్, తహ్ఖీఖ్: మొహమ్మద్ అబుల్ ఫజ్ల్ ఇబ్రాహీమ్, భాగం13, పేజీ262. ముజఫ్ఫర్, మొహమ్మద్ హసన్, దలాయిల్ అస్సిద్ఖ్, భాగం2, పేజీ80.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21