శని, 01/23/2021 - 16:38
ఖుర్ఆన్ లో పలు రకాల త్యాగాల గురించి వివరించబడి ఉంది. వాటిలో ఒకటి సంతాన త్యాగం.
ఖుర్ఆన్ లో పలు రకాల త్యాగాల గురించి వివరించబడి ఉంది. వాటిలో ఒకటి సంతాన త్యాగం. మనిషి తమ పిల్లలనూ చాలా ఇష్టపడతారు మరియు వారి పట్ల ప్రేమానురాగాలు కలిగి వుంటారు. వారికి ఎటువంటి కష్టం రాకూడదని భావిస్తారు. కాని ఖుర్ఆన్ అల్లాహ్ కోసం తన కుమారుడ్ని బలిచ్చిన తండ్రి సంఘటన ఉల్లేఖిస్తుంది.
ఖుర్ఆన్: “మరి ఆ కుర్రాడు(ఇస్మాయీల్) అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, “నా ప్రియ కుమారా! నేను నిన్ను ‘జిబహ్’ చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అతను(ఇబ్రాహీమ్) అన్నారు. “నాన్న గారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని నిస్సంకోచంగా నెరవేర్చండి. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు” అని ఆ బాలుడు అన్నాడు”[సాఫ్పాత్:102]
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి