అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) సోదరుడు

ఆది, 08/01/2021 - 07:53

ఇస్లామీయ సామాజిక సూత్రాలలో ఒకటి ఇస్లామీయ సహోదరత్వం మరియు సోదరత్వ ఒప్పందం... 

అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) సోదరుడు

ఇస్లామీయ సామాజిక సూత్రాలలో ఒకటి ఇస్లామీయ సహోదరత్వం మరియు సోదరత్వ ఒప్పందం. దైవప్రవక్త(స.అ) వివిధ రకాలుగా ఈ సహోదరత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే మదీనహ్ కు వలసి వచ్చిన తరువాత ముహాజిరీన్ మరియు అన్సారుల మధ్య సహోదరత్వాన్ని ఒప్పందం ద్వార ముడి వేయాలని అనుకొని ముస్లిముల సభలో నిలబడి ఇలా ఉపదేశించారు: تآخوا فى الله اخوین اخوین; అల్లాహ్ మార్గంలో ఇద్దరిద్దరు సోదరులు కండి” అప్పుడు ముస్లిములు ఇద్దరిద్దరు ఒకరిచేతిని మరొకరు పట్టి సహోదరత్వ ఒప్పందంగా ఒత్తారు, అలా వారి మధ్య ఐక్యమత్యం మరియు సమానత్వం స్థిరపడింది.

అయితే ఈ ఒప్పందంలో వారి వారి విశ్వాసం, ప్రతిష్టత మరియు ఇస్లామీయ వ్యక్తిత్వం దృష్టిలో ఉంచేవారు. ఈ విధంగా ఎవరు ఎవరి సోదరుడిగా నిశ్చయించబడుతున్నారో వారి పరిస్థితి ద్వార వారి విశ్వాసం స్పష్టమౌతుంది.

అక్కడున్నవారు ఇద్దరిద్దరి మధ్య సోదరత్వాన్ని ఒప్పందంతో ముడివేశారు, చివరికి అలీ(అ.స) ఉండిపోయారు, కళ్లనిండా నీళ్లతో దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చి ఇలా అన్నారు: నన్ను మీరు ఎవరి సోదరునిగా నిశ్చయించలేదు. అప్పుడు దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: “నువ్వు ఇహపరలోకాలలో నా సోదరుడివి”[1] అప్పుడు తన మరియు అలీ మధ్య ఒప్పందాన్ని నిశ్చయించారు.[2] దీంతో అలీ(అ.స) యొక్క గొప్పతనం మరియు ప్రతిష్టత చాలా స్పష్టంగా తెలిసివస్తుంది. దైవప్రవక్త(స.అ) వారు ఎంద దగ్గర సంబంధం ఉందో తెలుస్తుంది.

రిఫరెన్స్
1. హాకిమె నైషాబూరీ, అల్ ముస్తద్రక్ అలస్సహీహైన్, ఏదాద్: అబ్దుర్రహ్మాన్ అల్ మరఅషీ, భాగం3, పేజీ14.
2. ఇబ్నె అబ్దుల్ బిర్ర్, అల్ ఇస్తిఆబ్ ఫీ మఅరిఫతిల్ అస్హాబ్, భాగం3, పేజీ35.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15