గదీర్ సందేశాన్ని నిరాకరించిన మొదటి వ్యక్తి

శని, 08/26/2017 - 07:01

.గదీర్ సందేశాన్ని నిరాకరించిన మొదటి వ్యక్తి పేరు హరిస్ ఇబ్నె నోమానె ఫెహ్రీ. అల్లాహ్ అతడి పై తన ఆగ్రహాన్ని కురిపించాడు.

గదీర్ సందేశాన్ని నిరాకరించిన మొదటి వ్యక్తి

“గదీరె ఖుమ్”లో హజ్రత్ అలీ[అ.స]ను  దైవప్రవక్త[స.అ] తన తరువాత ముస్లిముల నాయకుడిగా నియమించిన వార్త అందరికి తెలిసింది. అలా అలా “హారిస్ ఇబ్నె నోమానె ఫెహ్రీ” వరకు కూడా చేరింది కాని అతడికి ఈ మాట నచ్చలేదు.
అతడు దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చి ఇలా అన్నాడు: ఓ ముహమ్మద్! నీవు నీ తమ్ముడిని అందరి పై ప్రతిష్టతను ప్రసాదించి ఇలా అన్నావు: “నేను ఎవరికి స్వామినో అలీ[అ.స] కూడా వారికి స్వామి”. ఈ మాట అల్లాహ్ తరపు నుండి చెప్పావా లేక నీ తరపు నుండా చెప్పావా?
ఇది విని దైవప్రవక్త[స.అ] కళ్ళు(కోపంతో) ఎర్రబడ్డాయి, మూడుసార్లు ఇలా అన్నారు: “ఆయన తప్ప మరెవ్వరూ పరమేశ్వరుడు కానటువంటి ఆ అల్లాహ్ ప్రమాణంగా ఇది అల్లాహ్ తరపు నుండి నా తరపు నుండి కాదు” హారిస్ ఇది విని నిలబడి ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్ ముహమ్మద్[స.అ] చెప్పేది ఒకవేళ నిజం అయితే నా పై ఆకాశం నుండి రాళ్ళను కురిపించు లేదా బాధాకరమైన శిక్ష విధించు”. రావి ఇలా ప్రవచించెను: అల్లాహ్ సాక్షిగా అతడు ఇంకా తన ఒంటె వరకు కూడా చేరలేకపోయాడు ఆకాశం నుండి అతడి తలపై ఒక రాయి వచ్చి పడింది మరియు అతడి క్రిందిభాగం నుండి బయటకు వచ్చేసింది, అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరియు అల్లాహ్ ఈ ఆయత్‌ను అవతరింపజేశాడు: سَأَلَ سَآئِلُۢ بِعَذَابٖ وَاقِعٖ لِّلۡكَٰفِرِينَ لَيۡسَ لَهُۥ دَافِعٞ; అడిగేవాడు అవిశ్వాసుల కొరకే సంభవించే శిక్షను గురించి అడిగాడు. అది తప్పకుండా సంభవిస్తుంది.[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ352].

రిఫ్రెన్స్
తబర్సీ, మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ352

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11