ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్

శుక్ర, 08/13/2021 - 14:39

ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ గురించి, అతడు చేసిన మంచి పనుల గురించి సంక్షిప్తంగా...

ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్

ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్
అబూ హఫ్స్ ఉమర్, తండ్రి అబ్దుల్ అజీజ్ ఇబ్నె మర్వాన్ ఇబ్నె హకమ్. తల్లి “ఉమ్మె ఆసిమ్” ఆసిమ్ ఇబ్నె ఉమర్ కుమార్తె. అతడు మిస్ర్ కు చెందిన “హలవాన్” అనబడే గ్రామంలో జన్మించాడు. అప్పుడు అతడి తండ్రి అక్కడ పరిపాలకుడిగా ఉండేవారు. తండ్రి మరణానంతరం ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ పినతండ్రి అబ్దుల్ మలిక్, అతడ్ని దమిష్క్ (డమస్కస్)కు వచ్చేయమని ఆహ్వానించాడు.

హిజ్రీ యొక్క 99వ ఏట, సఫర్ నెలలో ప్రజలు అతడితో ఖలీఫాగా బైఅత్ చేశారు. రెండు సంవత్సరాల ఐదు నెలల తరువాత హిజ్రీ యొక్క 101వ సంవత్సరంలో 39 సంవత్సరాల వయసులో దమిష్ఖ్ ప్రాంతానికి చెందిన “సమ్ఆన్”లో మరణించాడు.[1]

ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ చర్యలు
ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్, ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) కాలంలో ఉన్న ఖలీఫాలందరిలో ఇతడి తీరు వేరు.  ఇతడు మిగతావారితో పోల్చి సూస్తే న్యాయానికి కట్టుబడి ఉండేవాడు. దైవప్రవక్త(స.అ) అహ్లెబైత్(అ.స) పట్ల ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగివుండేవాడు. అతడు “బనీహాషిమ్” మరియు “ఫాతెమియూన్” లకు జరిగిన అన్యాయాల మరియు సామూహిక న్యాయ చర్యలను సమాజంలో తీసుకొచ్చాడు. వాటిలో ముఖ్యమైనవి:
1. ముఆవియా కాలం నుంచి అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)ను దూషించడం రీతిగా మారిన విధానాన్ని నిషేధించాడు.
2. ఫిదక్ భూమిని తిరిగి హజ్రత్ ఫాతెమా(స.అ) పిల్లలకు తిరిగి ఇచ్చాడు.
3. అరేబీయాకు చెందని ముస్లిములకు అధికారం తరపు నుంచి ఇవ్వబడే రొక్కము అరేబీయ ముస్లిములకు ఇవ్వబడే రొక్కములలో సమానత్వం ఉండేది కాదు, వారికి మద్దత్తు తెలిపాడు.
4. హజ్రత్ అబూబక్ర్ మరియు హజ్రత్ ఉమర్ దైవప్రవక్త(స.అ) తరువాత తమ ఖిలాఫత్ అధికారంలో హదీసు లేఖనాన్ని నిషేదించారు. హజ్రత్ అబూబక్ర్ ఇలా అన్నారు: “దైవప్రవక్త నుంచి ఏదీ ఉల్లేఖించకండి. ఒకవేళ ఎవరైనా మీతో దేని గురించయినా ప్రశ్నిస్తే, వారితో అల్లాహ్ గ్రంథం(ఖుర్ఆన్) మీ మరియు మా మధ్యలో ఉంది, దాని హలాల్ ను హలాల్ గా మరియు దాని హరామ్ ను హరామ్ గా భావించండి.[2] రెండవ ఖలీఫా దైవప్రవక్త(స.అ) హదీసు లేఖనాన్ని నిషేదించే విషయంలో ఇస్లామీయ ప్రాంతాలకు ఇలా వ్రాసి పంపారు: “ఎవరైనా దైవప్రవక్త(స.అ) హదీసును వ్రాసి ఉంటే, నిస్సందేహంగా దాన్ని నాశనం చేయాలి”[3] ఇంతే కాకుండా ఎవరైనా దైవప్రవక్త(స.అ) హదీసులను ఉల్లేఖిస్తే వారిపై కఠిన చర్య జరిగేది, వారిని కారాగారంలో బంధించేవారు; ఈ క్రమంలోనే “ఇబ్నె మస్ఊద్” “అబూ దర్దా” మరియు అబూజర్, లాంటి ప్రముఖ సహాబీయులను బంధించారు. వారు రెండవ ఖలీఫా జీవించినంతకాలం కారాగారంలోనే ఉన్నారు. మొదటి రెండు ఖలీఫాల కాలంలో నిషేదించబడ్డ హదీస్ లేఖనాన్ని అధికారమ పరంగా ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ తన ఖిలాఫత్ కాలంలో రద్దు చేశాడు. ముహద్దిసీనులను హదీసుల ఉల్లేఖన మరియు వాటి సేకరణ విషయంలో ప్రోత్సహించారు. బహుశ అతడి ఈ సేవల వలనే ఇమామ్ అతడి గురించి ఇలా అన్నారు: “ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్, బనీ ఉమయ్యాహ్ లో శ్రేష్ఠమైన వాడు”[4]
హదీస్ లేఖనాన్ని నిషేధించడం వల్ల ఇస్లాం ఉమ్మత్‌కు చాలా నష్టం కలిగింది. ఇస్లాంకు ఆపదలు తెచ్చిపెట్టింది. దాని ప్రభావాలు ఇప్పటికీ ఉన్నాయి. వీటన్నింటికి ఎవరు జవాబుదారి...!?.

ఇతరుల దృష్టిలో ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్
1. ఖైస్ ఇబ్నె జబీర్: “బనీ ఉమయ్యాలో ఉమర్ యొక్క ఉపమానం మోమినె ఆలె ఫిర్ఔన్ లాంటిది”[5]
2. మస్ఊదీ ఇలా అనెను: “ఉమర్ చాలా వినయంగా మరియు భక్తి పరంగా ఉండేవాడు. ఖిలాఫత్ అధికారం పై వచ్చిన తరువాత అందకు ముందు ఉన్న అమవీ కార్యకర్తలను తొలగించి వారికి బదులుగా మంచి వ్యక్తులను నియమించాడు”.[6]

ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎంత మంచి చర్యలు చేపట్టినా ఇతడు ఖిలాఫత్ ను ఇమాములకు ఇవ్వలేదు. తానే ఖలీఫాగా ఉన్నాడు. 

రిఫరెన్స్
1. తారీఖె తబరీ, తబరీ, తహ్ఖీఖ్: ముహమ్మద్ అబుల్ ఫజ్ల్ ఇబ్రాహీమ్, బీరూత్, దారుల్ మఆరిఫ్, బీతా, భాగం6, పేజీ55.
2. జహబీ, తజ్కిరతుల్ ఉఫ్పాజ్, బీరూత్, దారుత్తురాస్ అల్ అరబీ, భాగం1, పేజీ3.
3. అబూ రయ్యహ్, అజ్వా అలస్సున్నహతిల్ ముహమ్మదియ్యహ్, తా2, మత్బఅతు సువరిల్ హదీసహ్, పేజీ43.
4. సీవ్తీ, తారీఖుల్ ఖులఫా, తా3, తహ్ఖీఖ్: మొహమ్మద్ మొహ్యుద్దీన్ అబ్దుల్ హమీద్, ఖాహిరహ్, మత్బఅతుల్ మదనీ, పేజీ230.
5. తారీఖుల్ ఖులఫా, సీవ్తీ, తహ్ఖీఖ్ మొహియుద్దీన్ అబ్దుల్ హమీద్, బీరూత్, దారుల్ జబీల్, 1408హి, పేజీ278.
6. అత్తంబీహ్ వల్ అష్రాఫ్, మస్ఊదీ, తెహ్రాన్, ఇల్మి వ ఫర్హందీ, 1381 భాగం3, పేజీ193.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9