అహ్లెబైత్(అ.స) పట్ల కుట్ర-2

శని, 12/04/2021 - 17:19

దైవప్రవక్త(స.అ) మరణానంతరం ముస్లిములు రెండు భాగాలుగా విడిపోయిన తరువాత అధికారం పై వచ్చిన ఖలీఫా అహ్లెబైత్(అ.స) ప్రతిష్టత మరియు వారి గొప్పతనాన్ని కించపరచడానికి పన్నిన కొన్ని పన్నాగాల వివరణ...

అహ్లెబైత్(అ.స) పట్ల కుట్ర-2

దైవప్రవక్త(స.అ) మరణానంతరం ముస్లిములు రెండు భాగాలుగా విడిపోయిన తరువాత అధికారం పై వచ్చిన ఖలీఫా అహ్లెబైత్(అ.స) ప్రతిష్టత మరియు వారి గొప్పతనాన్ని కించపరచడానికి పన్నిన కొన్ని పన్నాగాలు:
1. ఆర్థిక పరంగా దెబ్బతీయడం[1]
2. సంఘం దృష్టిలో అప్రతిష్టతకు గురిచేయడం
అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రతిపక్షులైన అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స) పార్టీని బలహీన పరచడానికి, సమాజంలో వారి శ్రేష్టతను దెబ్బ తీసే ఉద్యమాన్ని మొదలు పెట్టింది.
అబూబక్ర్ చేసిన మొదటి ప్రయత్నం, ప్రజల దృష్టిలో దైవప్రవక్త(స.అ) అహ్లెబైత్(అ.స)లను గౌరవించడాన్ని నిషేధించడం. అందుకనే పవిత్ర అహ్లెబైత్(అ.స)
లలో పెద్దవారు, దైవప్రవక్త(స.అ) పినతండ్రి కుమారుడైన అలీ(అ.స)కు అల్లాహ్ ప్రసాదించినటువంటి ప్రతిష్టత పై సహాబీయులు కూడా ద్వేషించడం మొదలు పెట్టారు. ఇక కపటవర్తనుల విషయం ఐతే వదిలేయండి, వాళ్ళు సమయం కోసం ముందు నుండే వేచి ఉన్నారు.
దైవప్రవక్త(స.అ) యొక్క ఉమ్మత్
లో కేవలం ఫాతెమా(స.అ) ఒక్కరే దైవప్రవక్త(స.అ) యొక్క జ్ఞాపకార్థం, ఆమెను స్వయంగా దైవప్రవక్తే “ఉమ్మె అబీహా” మరియు “ప్రపంచ స్త్రీల నాయకురాలు” అని అన్నారు. అందుకని ముస్లిములందరూ ఫాతెమా(స.అ)ను గౌరవించేవారు. మరియు దైవప్రవక్త(స.అ) ఆమెను గౌరవించే వారని కూడా ముస్లిములు ఆమెను మర్యాదించేవారు. మరియు దైవప్రవక్త(స.అ) ఫాతెమా(స.అ) శ్రేష్ఠత, సభ్యత మరియు పవిత్రత గురించి ప్రవచించిన ఆ హదీసుల కారణంగాను కూడా ఆమెను ప్రతిష్టించేవారు.
కాని అబూబక్ర్ మరియు ఉమర్లు, ప్రజల మనసుల నుండి ఆ గౌరవాన్ని తొలగించారు. ఇక ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ నిర్భయంగా ఫాతెమా(స.అ) ఇంటికి నిప్పు మరియు కట్టెలను తీసుకొచ్చి ప్రమాణం చేసి ఇలా అన్నారు: “ఒకవేళ అబూబక్ర్
 తో బైఅత్ చేయకుంటే నేను ఇంట్లో ఉన్న వాళ్ళతో పాటు ఇంటిని కాల్చేస్తాను”, అలీ(అ.స), అబ్బాస్ మరియు జుబైర్లు జనాబె ఫాతెమా(స.అ) ఇంట్లోనే ఉండగా అబూబక్ర్, ఉమర్ ఇబ్నె ఖత్తాబ్
ను వారిని ఫాతెమా(స.అ) ఇంటి నుండి బయటకు తీసుకొని రండీ, అని పంపారు. ఒకవేళ అతను రావడానికి నిరాకరించినట్లైతే అతనితో యుధ్దం చేయి. ఉమర్ ఆ ఆదేశం విన్న వెంటనే ఇంట్లో ఉన్నవాళ్ళతో పాటు ఇంటిని తగలబెట్టడానికై నిప్పు తీసుకొని వచ్చారు. ఫాతెమా జహ్రా(స.అ) తలుపు వెనక్కి వచ్చి “ఇబ్నె ఖత్తాబ్! మా ఇంటికి నిప్పంటించడానికి వచ్చావా?” అని అడిగారు. ఉమర్ ఇలా అన్నారు: అవును! నీవు కూడా ఉమ్మత్ చేసిందే చేయి(అనగా అబూబక్ర్ బైఅత్ చేయి)[2]
అహ్లెసున్నత్
ల “సహాహ్ గ్రంథాల”
లో ఉల్లేఖన విధంగా, “ఫాతెమా జహ్రా(స.అ) ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికి నాయకురాలు”. “ఆమె కుమారులు హసన్(అ.స) మరియు హుసైన్(అ.స) స్వర్గ యువకుల నాయకులు, దైవప్రవక్త(స.అ) యొక్క సుగంధం” వారిని కూడా చిన్న చూపు చూసేవారు. చివరికి ఉమర్ ఇబ్నె ఖత్తాబ్, ప్రజల ముందు ప్రమాణం చేసి ఇలా అన్నారు: “ఒకవేళ వీళ్ళు అబూబక్ర్
తో బైఅత్ చేయడానికి నిరాకరిస్తే నేను ఇంటితో పాటు ఇంట్లో ఉన్న వారిని కూడా తగలబెట్టేస్తాను”. ఆ సంఘటన తరువాత ప్రజల హృదయాలలో గౌరవనియులైన వారి(ఫాతెమా, హసన్, హుసైన్(అ.స)) ప్రతిష్ఠత మిగిలి ఉండ డం, లేదా హజ్రత్ అలీ(అ.స) యొక్క ఉత్తమత్వాన్ని అర్ధం చేసుకోవడం కష్టం. అదీ కాకుండా ప్రజలు అలీ(అ.స) పట్ల ముందునుండే ద్వేషం కలిగి ఉండే వారు. అంతకు మించి అతను ప్రతిపక్ష పార్టీ అద్యక్షులు కూడాను. మరియు అతని వద్ద ప్రజలకు ఇచ్చి తమ వైపు త్రిప్పుకోవడానికి కూడా ఎటువంటి ఆస్తీ లేదు.
బుఖారీ, తన “సహీ గ్రంథం”లో ఈ హదీస్
ను ఉల్లేఖించారు:
ఫాతెమా(స.అ), అబూబక్ర్
 నుండి అల్లాహ్ దైవప్రవక్త(స.అ)కు మదీనా, ఫిదక్ మరియు ఖైబర్ యొక్క ఖుమ్స్ భాగాన్ని ఇచ్చిన తన తండ్రి దైవప్రవక్త(స.అ) యొక్క ఆస్తిని అడగగా, అబూబక్ర్ ఆస్తి ఇచ్చేందుకు నిరాకరించగా, ఫాతెమా (స.అ) అబూబక్ర్
తో నిరాశ పడ్డారు. అతనితో సంబంధాన్ని తెంచుకున్నారు. చివరి నిమిషం వరకు మాట్లడలేదు. దైవప్రవక్త(స.అ) తరువాత ఆమె కేవలం ఆరు నెలలు మాత్రమే జీవితం గడిపారు. ఆమె మరణించిన తరువాత ఆమె భర్త ఆమెను రాత్రి చీకటిలో “గుస్ల్ స్లానం” చేయించారు, కఫన్ తొడిగించారు మరియు సమాధి చేశారు. మరియు అబూబక్ర్
ను వార్త కూడా ఇవ్వలేదు.
ఫాతెమా(స.అ) జీవితంలో, అలీ(అ.స)కి గౌరవం ఉండేది. కాని ఆమె మరణిం చిన తరువాత ప్రజల దిక్కులు మారాయి, అందుకని అలీ(అ.స) అబూబక్ర్
తో సయోధ్యించారు. అవును ఫాతెమా(స.అ) జీవించి ఉన్న కాలంలో సయోధ్య చేయలేదు.[3] ప్రతిపక్ష పార్టీ, అలీ(అ.స) యొక్క ఆర్థిక నిర్భంధనచేసీ మరియు పెట్టుబడుల స్థితులను నాశనం చేసి, సోషల్ బాయికాట్ చేసి విజయం సాధించింది. అలీ(అ.స) యొక్క ఆర్ధిక స్థితి, అర్హత, సామర్ధ్యం ప్రజల దృష్టిలో అంతం అయ్యింది. ఇక ఎటువంటి విలువ, మర్యాదా మిగిలి లేదు. ముఖ్యంగా జనాబె జహ్రా(స.అ) యొక్క మరణం తరువాత ప్రజలు మారిపోయారు. అలా అతను అబూబక్ర్
తో వేరే దారి లేక సయోధ్య చేశారు. ఇలా అని బుఖారీ మరియు ముస్లిం ఇద్దరు రివాయత్
ను ఉల్లేఖించారు.
బుఖారీ యొక్క ఈ వాక్యం “ప్రజల దిక్కులు మారాయి” ద్వార దైవప్రవక్త(స.అ) మరియు ఫాతెమా జహ్రా(స.అ) మరణాంతరం అలీ(అ.స) పట్ల ప్రజల శత్రుత్వం ఎంత పెరిగిందో మరియు అతను ఎన్ని కఠినమైన పరిస్థితులను ఎదురుకున్నారో, స్పష్టంగా తెలుస్తుంది. బహుశ సహాబీయులలో కొందరైతే అతనిని దూషించేవారు, హేళన చేసేవారు. ఎందుకంటే ముఖంపై ద్వేష ప్రభావం ఎప్పుడైతే తనకు ఇష్టం లేని మనిషిని చూస్తామో అప్పుడే కనిపిస్తుంది.
ఈ అధ్యాయంలో మేము క్రమంగా అలీ(అ.స) యొక్క చరిత్ర మరియు అతనికి జరిగిన అన్యాయం గురించి ఎలా చెప్పాలని అనుకున్నామో అలా చెప్పలేము. వాస్తవానికి అది ఒక చేదు యదార్ధాన్ని వ్యక్తం చేయడం అవుతుంది. దైవప్రవక్త(స.అ) సున్నత్ ద్వాజాన్ని ఎత్తి ఉన్న మరియు దైవప్రవక్త(స.అ) జ్ఞానం యొక్క ద్వారమైన అలీ(అ.స)ను ప్రజలు విశ్మరించారు. మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
ను నిరాకరించే, అతని పోటీదారులైన ఇజ్తిహాదీ సమూహానికి అధికారం దక్కింది. మరియు సహాబీయులలో చాలా మంది దానిని సమ్మతించారు.[4]

రిఫరెన్స్
1. http://te.btid.org/node/2038
2. అల్ అఖ్దుల్ ఫరీద్, భాగం4, పేజీ254-260.
3. సహీబుఖారీ, భాగం5, పేజీ82, باب غزوۃ خیبر. సహీ ముస్లిం, కితాబుల్ జిహాద్.
4. షియయె వాఖెయి, సమావీ తీజానీ, పేజీ48-49.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15