ఇమామ్ అలీ(అ.స) మరణాంతరం తనను ఇస్లాం ఉమ్మత్ యొక్క ఖలీఫాగా నిర్ధారించుకున్నటువంటి ముఆవియా ఇస్లాం స్వీకరణ గురించి సంక్షిప్తంగా.

ముఆవియా, అబూసుఫ్యాన్ యొక్క కుమారుడు. అబూసుఫ్యాన్ ఖురైష్ యొక్క ప్రముఖులలో ఒకడిగా లెక్కించబడేవాడు. తల్లి హింద్ బింతె ఉత్బహ్. ముఆవియాను “అబూ అబ్దిర్రహ్మాన్”గా కూడా సంభోదించేవారు. ప్రముఖ రచయితలు అతడు బేసత్ కు 5 సంవత్సరాల క్రితం జన్మించాడు అని అంటారు. అబూసుప్యాన్ దైవప్రవక్త(స.అ)ను చాలా ద్వేషించేవాడు. తండ్రి అడుగుజాడలలో నడిచి ఇస్లాం వచ్చిన 20 సంవత్సరాల తరువాత “ఫత్హె” మక్కా వరకు ఇస్లాంను స్వీకరించలేదు. తల్లిదండ్రులు, సొదరుడితో పాటు ఇతడు కూడా ఇస్లాం స్వీకరించి “ముస్లమతుల్ ఫత్హ్” (ఫత్హె మక్కా తరువాత అయిన ముస్లిముల) సమూహంలో నిర్ధారించబడ్డారు. అనగా ఇస్లాంను అన్ని విధాలుగా నాశానం చేయాలనుకొని ప్రయత్నించి చివరికి ఏమీ చేయలేక అలసిపోయి ఇస్లాం స్వీకరించిన ముస్లిములు అన్నమాట. ఇలా ఇస్లాం స్వీకరించినదుకు అతడు నిరంతరం విమర్శలకు గురి అయి ఉండేవాడు.
“ఖైస్ ఇబ్నె సఅదె ఇబాదహ్” అతడికి ఇలా వ్రాసేవారు: “బలవంతంగా ఇస్లాంను స్వీకరించావు”. కాని ఇతడి సోదరి “ఉమ్మె హబీబహ్” తన కుటుంబీకుల మార్గం నుండి వేరై “ఫత్హె” మక్కా కన్నా ముందు ఇస్లాంను స్వీకరించారు మరియు దైవప్రవక్త(స.అ)తో వివాహమాడారు.[తబఖాతుల్ కుబ్రా, భాగం7, పేజీ285].
రిఫ్రెన్స్
వాఖిదీ, తబఖాతుల్ కుబ్రా, తహ్ఖీఖ్ అతా అబ్దుల్ ఖాదిర్, భాగం7, పేజీ285, దారుల్ కుతుబ్ అల్ ఇల్మియహ్, బీరూత్, 1410 హిజ్రీ.
వ్యాఖ్యలు
ماشا ء اللہ
Shukriya...
వ్యాఖ్యానించండి