హజ్రత్ అలీ(అ.స) ఖలీఫ-ఎ-రషీద్ -3

బుధ, 12/15/2021 - 15:17

అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు సహాబీయు లందరు న్యాయస్థులే, అని నమ్మడం మొదలు పెట్టారు. ఐతే అలీ(అ.స)ను సహాబీయుల నుండి వేరు చేయడం వాళ్ళకు సాధ్యం కాలేదు. అందుకని వాళ్ళు సాధారణ మనుషులను మోసగించడానికి ఖులఫాయే రాషిదీన్
ల నుండి అలీ(అ.స)ను ‘నాలుగోవ ఖలీఫా’ ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

హజ్రత్ అలీ(అ.స) ఖలీఫ-ఎ-రషీద్ -3

కాలం గడిచింది, ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)లు ఈ లోకాన్ని విడిచారు. మరియు (చూడ్డానికి)వారు తిరిగిరారు. పాలకులు మరియు రాజులలో ఉన్న భయం పోయింది. మరియు ఇస్లామీయ ఖిలాఫత్ ముక్కలయ్యింది. బానిసలు, ముగలేయులు మరియు తాతారులు దానిని ఆక్రమించుకున్నారు. దీన్
లో బలహీనత్ ఏర్పడింది. ముస్లిములలో ఎక్కువ మంది మద్యపానం మరియు ఆటపాటలకు గురి అయ్యారు. ఈ క్రమం నడుస్తూనే ఉంది, నమాజును వాళ్ళు మరిచారు, కామంలో మునిగిపోయారు. మంచి పనులను చెడుగా భావించడం మొదలు పెట్టారు. చెడు పనులను మంచి పనులు, అని భావించడం మొదలు పెట్టారు. ప్రతీచోట దౌష్ట్యం వ్యాపించింది, ఇక ఇప్పుడు ముస్లిములు తమ పూర్వీకుల కోసం ఏడుస్తున్నారు. వాళ్ళ శ్రేష్ఠతలను గుర్తుచేసుకుంటున్నారు. వాళ్ళ కాలపు చిత్రాన్ని గీస్తున్నారు మరియు వాళ్ళ కాలాన్ని బంగారపు కాలం అంటున్నారు. వాస్తవానికి వాళ్ళ దృష్టిలో ఉత్తమమైన కాలం, సహాబీయుల కాలం, ఎందుకంటే వాళ్ళే పట్టణాలపై విజయం సాధిం చారు మరియు తూర్పూ, పడమరలలో ఇస్లామీయ రాజ్యాన్ని స్థాపించారు. ఖైసర్ మరియు కిస్రాలను వాళ్ళ ముందు విలువ లేనివారిగా చేశారు. అందుకని ఆ సహాబీయులందరిని “రజియల్లాహు అన్హూ” అని అనేవారు. అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స) కూడా సహాబీయులలో ఒకరు కాబట్టి అతన్ని కూడా “రజియల్లాహు అన్హు” అనేవారు. మరియు అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు సహాబీయు లందరు న్యాయస్థులే, అని నమ్మారు. ఐతే అలీ(అ.స)ను సహాబీయుల నుండి వేరు చేయడం వాళ్ళకు సాధ్యం కాలేదు.
ఒకవేళ అలీ(అ.స)
ను సహాబీయులలో నుండి వేరు చేయాలి, అని చెప్పుంటే కష్టంలో పడేవారు. వివేకులకు వాళ్ళ ఆలోచన తెలిసిపోయేది, అందుకని వాళ్ళు సాధారణ మనుషులను మోసగించడానికి ఖులఫాయే రాషిదీన్
ల నుండి అలీ(అ.స)ను ‘నాలుగోవ ఖలీఫా’, ‘విజ్ఞాన పట్టణానికి ద్వారం’, ‘రజియల్లాహు అన్హూ’, ‘కరమల్లాహు వజ్హూ’ అని అనడం మొదలు పెట్టారు.
అహ్లెసున్నత్ వల్ జమాఅత్
కు మా ఒక ప్రశ్న. మరి ఆ ప్రశ్న “ఒకవేళ మీరు అలీ(అ.స)ని సరైన విధంగా విజ్ఞాన పట్టణానికి ద్వారం అని అంగీకరించినట్లైతే మీరు మా మతం మరియు ప్రపంచం కార్యములలో అతని ఆజ్ఞలను ఎందుకు అనుసరించరూ?”.
మీరు తెలిసి కూడా ఎందుకు విజ్ఞాన పట్టణ ద్వారాన్ని వదిలేశారు. మరియు అబూ హనీఫా, మాలిక్, షాఫెయీ, అహ్మద్ ఇబ్నె హంబల్ మరియు ఇబ్నె తైమియానే ఎందుకు ఫాలో అయ్యారు. వీళ్ళు విజ్ఞానం, అమలు మరియు శ్రేష్ఠత్వం, ఉత్తమత్వంలో అలీ(అ.స)కి మించి పోయారా?, మట్టితో పవిత్ర జ్ఞానికి ఏమి సంబంధం. ఒకవేళ మీరే గనక వివేకులై ఉంటే ముఆవియాను అలీ(అ.స)తో పోల్చేవారే కాదు.
దైవప్రవక్త(స.అ) యొక్క రివాయత్
లను ప్రక్కన పెట్టి, దైవప్రవక్త(స.అ) తరువాత అలీ(అ.స) విధేయత ముస్లిములందరి పై వాజిబ్ చేసే వాటన్నీంటిని వదిలేసి స్వయంగా అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లో ఎవరో ఒకరు ఇలా చెప్పవచ్చు; “అలీ(అ.స) యొక్క శ్రేష్ఠత, అతని యొక్క మొట్టమొదట ఇస్లాం స్వీకరణ, అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం, అతని విజ్ఞానం, అతని ఉత్తమత్వం మరియు అతని ధర్మనిష్ఠ అందరికి తెలుసు” అంతేకాదు అహ్లెసున్నత్
లకు అలీ(అ.స) గురించి బాగా తెలుసు. వాళ్ళకు షియాల కన్న ఎక్కువ అతనిపై ప్రేమ ఉంది.[1]

మా విజ్ఞప్తి
ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, కొంచెం మీ పూర్వీకుల మరియు ఉలమాలను కూడా చూడండి, వారు రెండు శతాబ్ధాల పాటు పీఠాల నుండి హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ(అ.స)పై లఅనత్ చేశారు. మేము వారిలో ఏ ఒక్కరి గురించి కూడా “ఫలానా వ్యక్తి అలీ(అ.స)పై లఅనత్ చేసేందుకు నిరాకరించారు, లేదా ఫలానా వ్యక్తి అలీ(అ.స) పట్ల ప్రేమ వల్ల చంపబడ్డారు” అని విననూలేదు మరియు చరిత్ర మనకు చూపించనూలేదు. అహ్లెసున్నత్ ఉలమాలలో ఇలాంటి ధైర్యసాహస కార్యములు చేయువారు లేరూ మరియు ఇక ముందు రారూ. దానికి వ్యతిరేకంగా వారు రాజుల, ధనవంతుల మరియు పాలకులకు దగ్గరగా ఉండే వారు; ఎందుకంటే వాళ్ళ బైఅత్ మరియు వాళ్ళను సమ్మతించడం ద్వార విరాళములు, బహుమానాలు లభించేవి. అలా వారు అలీ(అ.స) మరియు అతని సంతానాన్ని ఇష్టపడేవారిని, అధికారుల బైఅత్ నిరాకరణ పై చంపేయడానికి ఫత్వాలు ఇచ్చేవారు. ఇలాంటి ఉలమాలు ఈనాడు మన ఈ కాలంలో కూడా ఉన్నారు.
క్రైశ్తవులు, యూదులను శతాబ్ధాల నుండి మన శత్రువులు, అని అనుకుంటూ వచ్చాము. మరియు జనాబె “ఈసా ఇబ్నె మర్యమ్(అ.స)”ను చంపిన అపరాధం నింద వాళ్ళ పైనే వేసే వారము, కాని క్రైస్తవులలో బలహీనత వచ్చినప్పుడు మరియు విశ్వాసాలు చెల్లాచెదురైనప్పుడు, మరియు చాలా మంది నాస్తికులుగా మారినప్పుడు, చర్చుల పరిస్థితి, జ్ఞానం మరియు ఉలమాలకు వ్యతిరేకమైన పాతవస్తువులగారంగా మారింది. మరియు యూదులు శక్తివంతులయ్యారు, వాళ్ళ ధైర్యం పెరిగింది. చివరికి వాళ్ళు అరేబీయ ఇస్లామీయ ప్రదేశాలను ఆక్రమించుకున్నారు. తూర్పూపడమరాలలో వాళ్ళు దూరిపోయారు. మరియు ఇజ్రాయీల్ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అప్పుడు యూదుల ఉలమాలతో ఒక భేటిలో “పాప్ యుహన్నా పౌల్స్” జనాబె ఈసా(అ.స)ను చంపిన వాళ్ళ ఆ అపరాధం నుండి ముక్తిని ప్రసాదించాము, అని నిర్ధారించారు.
ప్రజలు, ప్రజలే. కాలం కాలమే.

రిఫరెన్స్
1. ఈనాడు ఇలాంటి మాటలు చాలా మంది అహ్లెసున్నత్
లు చెబుతూ ఉన్నారు.
2. షియయె వాఖెయి, సమావీ తీజానీ, పేజీ60.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27