దైవప్రవక్త(స.అ) తరువాత అధికారంలో వచ్చిన సహాబీయులు దైవప్రవక్త(స.అ) తరపు నుంచి ఖలీఫాగా నియమించబడ్డ హజ్రత్ అలీ(అ.స) పట్ల పన్నిన పన్నాగాల వివరణ యొక్క చివరి భాగం...

దైవప్రవక్త(స.అ) మరణానంతరం ముస్లిములు రెండు భాగాలుగా విడిపోయిన తరువాత అధికారం పై వచ్చిన ఖలీఫా అహ్లెబైత్(అ.స) ప్రతిష్టత మరియు వారి గొప్పతనాన్ని కించపరచడానికి పన్నిన కొన్ని పన్నాగాలు:
1. ఆర్థిక పరంగా దెబ్బతీయడం[1]
2. సంఘం దృష్టిలో అప్రతిష్టతకు గురిచేయడం[2]
3. రాజకీయ రంగం నుండి దూరం చేయడం
ఇంతకు ముందు మేము, బాయికాట్ మరియు ఆర్థిక పరంగా దెబ్బతీసీ, మరియు దోచుకున్న తరువాత అలీ(అ.స)ను ఇస్లామీయ సమాజం నుండి దూరం చేశారు, అని చెప్పాము. అందుమూలంగా ప్రజలు అలీ(అ.స) నుండి ముఖం త్రిప్పుకున్నారు. కాని అధికారంలో ఉన్న పార్టీ అంతటితో ఆగకుండా వారిని రాజకీయ రంగం నుండి కూడా దూరం చేశారు. వాళ్ళు, దైవప్రవక్త(స.అ) జీవితకాలంలో ఇస్లాంకు వ్యతిరేకంగా యుధ్దానికి సిధ్దంగా ఉండే బనీ ఉమయ్యాహ్
ల బానిసలకు మరియు దుర్మార్గులకు రాజ్యాధికారాలు పంచేవారు, కాని అతనికి ఎటువంటి పోస్టును ఇవ్వలేదు. అతనికి ఎటువంటి బాధ్యతను గాని లేదా పదవి గాని ఇవ్వలేదు. ఆ విధంగా అలీ(అ.స) 25 సంవత్సరాలు అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్ ఖిలాఫత్ కాలం వరకు రాజకీయరంగం మరియు పదవీ బాధ్యతల నుండి దురంగా ఉంచబడ్డారు. మరి చూసినట్లైతే అదే కాలంలో సహాబీయులలో కొందరు సొమ్ము కూడబెట్టుకొని, దాంతో ఇంటి వెనక దొడ్లు నింపేసుకున్నారు. మరి వెండీ, బంగారాన్ని కూడ బెట్టుకున్నారు. అలీ(అ.స) యూదుల తోటలో వ్యవసాయం చేసి కష్టపడి చెమటోర్చి సంపాదించేవారు. జ్ఞానపట్టణ ద్వారం, ఉమ్మత్ శ్రేష్ఠులు, దైవప్రవక్త(స.అ) సున్నత్ ద్వజాన్ని ఎత్తుకొని ఉన్నవారేమో ఇంట్లోనే కూర్చొని ఉన్నారు, అతనిని ఎవ్వరు అడిగేవాడు లేడు. అతి తక్కువ సహాబీయులు అతనిని గౌరవించేవారు, ఆ సహాబీయులు కూడా ఎటువంటి సంపద లేనివారే. హజ్రత్ అలీ(అ.స) తన ఖిలాఫత్ కాలంలో ప్రజలను ఖురఆన్ మరియు సున్నత్ వైపుకు మరలించాలని అనుకున్నారు, కాని ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ యొక్క ఇజ్తిహాద్
ను సమ్మతించేవారు, “అయ్యో! ఉమర్ సున్నత్, అయ్యో! ఉమర్ సున్నత్” అని అనడం మొదలు పెట్టారు.
ఈ పై చర్చ ఫలితం, దైవప్రవక్త(స.అ) సున్నత్
ను కేవలం అలీ(అ.స) మరియు షియాలే ఆశ్రయించేవారు మరియు వారే దానిపై అమలు చేశారు. వారు ఎప్పుడు కూడా సున్నత్
ను వదలలేదు. కాని మిగిలినవారు అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్ మరియు ఆయిషాను ఆశ్రయించారు. మరియు వాళ్ళ బిద్అత్
ను “మంచి బిద్అత్” అని అనేవారు.[3]
ఇది కేవలం వాదన కాదు. ముస్లిములందరు ఏకాభిప్రాయం కలిగవున్న ఇదొక యదార్ధం. మరియు అహ్లెసున్నత్
లు తమ “సహాహ్” గ్రంథాలలో కూడా ఉల్లేఖించారు. మరి అలా అని ప్రతీ పరిశోధకుడికి తెలుసు.
హజ్రత్ అలీ(అ.స), ఖుర్ఆన్ కాపలి. అతనికి అహ్కాములన్నీ తెలుసు. మరియు అతను ఖుర్ఆన్‌ను ఒక క్రమంలో సంగ్రహించిన మొట్టమొదటి వ్యక్తి. “సహీ బుఖారీ” రచయిత, “బుఖారీ” యే స్వయంగా దీనిని ఉల్లేఖించారు. మరి అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మన్ విషయానికొస్తే వాళ్ళకు ఖుర్ఆన్ తో సంబంధమే ఉండేదికాదు. మరియు వాళ్ళకు దాని అహ్కాములు కూడా తెలిసి ఉండేవికాదు.[4] వారికి ఖుర్ఆన్ లో ఉన్న చిన్న చిన్న పదాలకు కూడా అర్థం తెలిసేది కాదు. ఉమర్ 70 సార్లు “لولا علی لھلک عمر అనువాదం: అలీ(అ.స)యే లేకుంటే ఉమర్ ఎప్పుడో నాశనం అయ్యేవాడు” అని అన్నారు అని చరిత్రకారులు వ్రాశారు. “ఓ అబుల్ హసన్ (అ.స)! మీరు లేని రోజున నేను కూడా ఉండకూడదు” అని అబూబక్ర్ అన్నాకు. ఇవే కాదు చరిత్ర మరియు హదీస్ గ్రంథాలలో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. మతపక్షపాతం లేకుండా పరిశోధన చేసేవారికి మాత్రమే అవి కనబడతాయి.
రిఫరెన్స్
1. http://te.btid.org/node/2038
2. http://te.btid.org/node/2039
3. సహీబుఖారీ, భాగ2, పేజీ252, باب صلواۃ التراویح . మరియు భాగం7, పేజీ97.
4. హదీసు గ్రంథాలలో ఉమర్
కు “కలాలహ్” యొక్క నిబంధనం తెలియదు, మరియు అలాగే అందరికి తెలిసిన తయమ్ముమ్ నిబంధనలు తెలియవు, అని లిఖించబడి ఉందని, అందరికి తెలుసు. చూడండి బుఖారీ, భాగం1, పేజీ90.
5. షియయె వాఖెయి, సమావీ తీజానీ, పేజీ50-56.
వ్యాఖ్యలు
Excellent
వ్యాఖ్యానించండి