పూర్వ పాలకుల ప్రయత్నాలు

గురు, 12/16/2021 - 13:17

దైవప్రవక్త(స.అ) పవిత్ర సున్నత్
ను నిషేదించడానికి మరియు దానిని పాలకులు తమ బిద్అత్, స్వయపరియా లోచన, సహాబీయుల అభిప్రాయాలు మరియు వాళ్ళ నెపములతో మార్చేయడానికి, వాటి వెనక ఉన్న కుట్రపై పడివున్న ముసుగును తొలగించడం అవసరం... 

పూర్వ పాలకుల ప్రయత్నాలు

ఇక్కడ మేము ఏ ఒక్క పరిశోధకుడు కూడా లోతుగా ఆలోచించ కుండా ఉండలేనటు వంటి ముఖ్య విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాము. దానివల్ల ఎవరైతే తమను అహ్లెసున్నత్ అని అంటారో, నిజానికి వారికి దైవప్రవక్త(స.అ) సున్నత్
తో ఎటువంటి సంబంధం లేదు. మరియు దైవప్రవక్త(స.అ) యొక్క సున్నత్ నుండి ఏదైనా చెప్పేందుకు వాళ్ళ వద్ద ఎటువంటి అంశం లేదు, అని ఎటువంటి సందేహం లేకుండా ఈ విషయం స్పష్టమవ్వాలి; ఎందుకంటే వాళ్ళకు లేదా వాళ్ళ పూర్వీకులైన సహాబీయులు మరియు ఖులఫాయే రాషిదీన్ లకు దైవప్రవక్త(స.అ) సున్నత్ పట్ల ఇంకా ఎక్కువ వ్యతిరేక భావం ఉండేది. మరియు అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వాళ్ళు, ఈ ఖులఫాల విధేయత మరియు వాళ్ళ పట్ల ప్రేమే అల్లాహ్
కు సామిప్యానికి కారణం, అని భావిస్తారు. మరి చివరికి వాళ్ళే హదీసులను కాల్చేశారు. దానిని వ్రాయకుండా ఆపివేశారు. దాని ప్రవచనను నిషేదించారు.[1]           
మేము ఈ విషయాన్ని వివరించినప్పటికీ దైవప్రవక్త(స.అ) పవిత్ర సున్నత్
ను నిషేదించడానికి మరియు దానిని పాలకులు తమ బిద్అత్, స్వయపరియా లోచన, సహాబీయుల అభిప్రాయాలు మరియు వాళ్ళ నెపములతో మార్చేయడానికి, వాటి వెనక ఉన్న కుట్రపై పడివున్న ముసుగును తొలగించడం అవసరం.

పూర్వ పాలకుల ప్రయత్నాలు
1. వాళ్ళ అభిలాషను సమ్మతించే విధంగా దైవప్రవక్త(స.అ) సాధారణ మరియు ప్రముఖ హదీసుల లేఖాన్నాని వ్యతిరేకించనటువంటి తప్పుడు హదీస్
ల తయారీ.
"ముస్లిం” తన గ్రంథం “సహీ”లో “హుదాబ్ ఇబ్నె ఖాలిద్ అల్ అజ్దీ” ద్వార “హమామ్ ఇబ్నె అస్లం” ద్వార అతను “అతా ఇబ్నె యసార్” ద్వార మరియు అతను “అబూ సయీద్ ఖుద్రీ” ద్వార రివాయత్
ను ఉల్లేఖించారు, దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: “నా మాటలను లిఖించవద్దు, ఎవరైనా ఖుర్ఆన్ తప్ప నా మాటలను లిఖించి ఉంటే దానిని చెరిపేయండి, ఎటువంటి ఇబ్బందిలేదు”[2]
ఈ హదీసును తయారు చేయడానికిగల ఉద్దేశమే, అబూబక్ర్ మరియు ఉమర్ల కార్యములను నిర్లక్ష్యం చేయడానికి, ఎందుకంటే వారు సహాబీయులలో కొందరు సంగ్రహించిన దైవప్రవక్త(స.అ) హదీసులను కాల్చేశారు. ఈ హదీస్ ఖులఫాయే రాషిదీన్
ల ఖిలాఫత్ కాలం తరువాత తయారు చేయబడినదని, స్పష్టంగా తెలుస్తుంది. కాని ఈ దీసును తయారు చేసిన వారు కొన్ని విషయాలను మరిచారు. అవి:

మొదటిది: ఒకవేళ దైవప్రవక్త(స.అ) ఈ హదీస్
ను ప్రవచించి ఉంటే, దైవప్రవక్త(స.అ) హదీసులను వ్రాసుకున్న ఆ సహాబీయులు కూడా దానిపై అమలు చేసి ఉండేవారు. మరి వాళ్ళు దైవప్రవక్త(స.అ) మరణాంతరం ఎన్నో సంవత్సరాల తరువాత నిప్పంటించకుండా అబూబక్ర్ మరియు ఉమర్ ఖిలాఫత్ కాలం కన్న ముందే చెరిపేసి ఉండేవారు.

రెండవది: ఒకవేళ ఈ హదీస్ సరైనదై ఉంటే ముందుగా అబూబక్ర్, ఆ తరువాత ఉమర్; ఈ హదీస్
ను, “హదీసులను లిఖించే మరియు దానిని చెరిపివేసే” దాని నుండి బయటపడడానికై రుజువుగా ప్రదర్శించేవారు. వాళ్ళు మరియు మరిచి హదీసులు వ్రాసుకున్న సహాబీయులు కూడా క్షమాపణ కోరేవారు. ఒకవేళ ఈ హదీస్ సరైనది అయి ఉంటే అబూబక్ర్ మరియు ఉమర్‌ పై ఈ హదీసులను చెరిపేయడం(అదృశ్యం) వాజిబ్ నిప్పంటించడం కాదు.

మూడవది: ఒకవేళ ఈ హదీసును సరైనది అని ఒప్పుకున్నట్లైతే “ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్” యొక్క కాలం నుండి ఈనాటి వరకు ముస్లిములందరూ పాపం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు దైవప్రవక్త(స.అ) నిరాకరించిన దానినే అమలు చేస్తూ ఉన్నారు. మరియు అందురి కన్నా ముందు ఉలమాలకు హదీస్‌లను సంగ్రహించండి మరియు దానిని వ్రాయమని ఆదేశించిందే ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్. బుఖారీ మరియు ముస్లిం ఇద్దరూ కూడా ఈ హదీస్
ను సరైనది అని నిర్ధారించారు. మరి వాళ్ళిద్దరు దైవప్రవక్త(స.అ) హదీసుల నుండి వేల సంఖ్యలో హదీసులను ఉల్లేఖించి అపరాధం చేశారు.

నాలుగోవది: ఒకవేళ ఈ హదీస్ సరైనదై ఉంటే, విజ్ఞాన పట్టణానికి ద్వారం లాంటివారైన అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)కు తెలియకుండా ఎలా ఉండిపోయింది? మరి అతను దైవప్రవక్త(స.అ) హదీసులను 70 గజముల పొడవైన గ్రంథంలో సంగ్రహించారు. దాని పేరు “సహీఫతుల్ జామే”

2. “దైవప్రవక్త(స.అ) ప్రతి అపరాధం పట్ల పవిత్రులు కారు, అంతేకాదు దైవప్రవక్త(స.అ) కూడా వేరే మానవుల వలే తప్పుఒప్పులు కూడా చేయగలరు” అన్న ప్రయత్నంలోనే బనీఉమయ్యాహ్ పాలకులు ఉండేవారు. ఈ అంశం పై వాళ్ళు ఎన్నో హదీసులను ప్రవచిస్తారు. నిజానికి ఈ తప్పుడు హదీసులు తయారు చేయడానికి గల కారణం దైవప్రవక్త(స.అ) కూడా తన అభిప్రాయం ద్వార ఇజ్తహాద్ చేసేవారు, అని తెలియపరడం. అలా అతను చేసే ఇజ్తిహాద్ (స్వయపరియాలోచన)లో పొరపాటు కూడా జరిగేది మరి వాటిని సహాబీయులు సరిచేసేవారు. ఉదా: తాబీరున్నఖ్ల్ (కర్జూరం చెట్లకు ఎరువుల) సంఘటన; మరియు హిజాబ్‌కు సంబంధించిన ఆయత్ అవతరణ సంఘటన; లేదా కపటవర్తనుల కోసం అస్తగ్ఫార్ చేయడం; బద్ర్ ఖైదీయుల నుండి పరిహారాన్ని అంగీకరించడం. అహ్లెసున్నత్ వల్ జమాఅత్‌లు తమ “సహాహ్ గ్రంథా”లలో ఇలాంటివే మరెన్నో సంఘటనలు ఉల్లేఖించారు. వాళ్ళు ముహమ్మద్(స.అ)ను ప్రవక్త అనే నమ్మేవారు కాదు.

రిఫరెన్స్
1. ఇంకా వివరంగా తెలుసుకోవాలి అని అనుకుంటే “فاسئلو اھل الذکر” పేజీ 200 మరియు ఆ తరువాయి అంశాలను చూడండి.
2. సహీ ముస్లిం భాగం8, పేజీ 229, کتاب الزھد و الرقائق، باب الثبت فی الحدیث و حکم کتابۃ العلم .

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19