దైవప్రవక్త(స.అ) పొరపాట్లకు గురి అవుతారు అన్న విషయాన్ని నిదర్శిస్తున్న కొన్ని రివాయతులు మరియు అవి తప్పుుడు రివాయతులు అన్న విషయం పై సాక్ష్యులు...

దైవప్రవక్త(స.అ) పొరపాట్లకు గురి అవుతారు అన్న విషయాన్ని నిదర్శిస్తున్న కొన్ని రివాయతులు:
“హాకిం” తన “ముస్నద్”లో, “అబూదావూద్” తన “సహీ”లో, మరియు “అహ్మద్ ఇబ్నె హంబల్” తన “ముస్నద్”లో, “దారమీ” తన “సునన్”లో ఒక చాలా ముఖ్యమైన “అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్”తో ప్రత్యేకించబడిన ఒక హదీస్
ను ఉల్లేఖించారు, దాని గురించి “అబూ హురైరహ్” ఇలా ప్రవచించారు: అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ హదీసును ఇలా వ్రాశారు; అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్రే స్వయంగా ఇలా అన్నారు: నేను దైవప్రవక్త(స.అ) నుండి వినే ప్రతీ విషయం వ్రాసుకునే వాడిని కాని ఖురైషీయులు నన్న వ్రాయకుండా ఆపివేశారు. ఇలా అన్నారు: నీవు దైవప్రవక్త(స.అ) నుండి ఏది వింటే అది వ్రాసేసుకుంటావు అతను కూడా మనిషే అతను కోపంగా కూడా మాట్లాడతారు మరియు సున్నితంగా కూడా మాట్లాడతారు!
అబ్దుల్లాహ్ ఇలా అన్నారు: నేను ఆరోజు నుండి హదీస్ ను వ్రాయడం ఆపివేశాను. ఒకరోజు నేను ఇలా అని దైవప్రవక్త(స.అ) సమక్షంలో చెప్పాను, ఐతే అతను నాకు వ్రాయమని ఆదేశించి, ఇలా అన్నారు: “నీవు వ్రాస్తూ ఉండు, నా ప్రాణాలు ఎవరి చేతులో ఉన్నాయో ఆయన ప్రమాణంగా చెబుతున్నాను నా నోటి నుండి కేవలం సత్యమే బయటకు వస్తుంది”.[1]
ఆ సంఘటనతో “అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్” దైవప్రవక్త(స.అ) నుండి విన్న ప్రతీ విషయాన్ని వ్రాసేవారు. మరి దైవప్రవక్త(స.అ) అతనిని ఆ పని నుండి ఆపలేదు. అదీకాకుండా అతనికి హదీస్ వ్రాయవద్దు అని ఖురైషీయులు ఆపివేశారు, అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాని అబ్దుల్లాహ్, హదీస్ వ్రాయకుండా ఆపినవారి పేర్లు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు నిషేదించిన దానిలో దైవప్రవక్త(స.అ) పట్ల వ్యతిరేకత ఉంది. అందుకే ఈ వచనాన్ని ఖురైషీయులు చెప్పారు, అని అనబడింది. అంటే ఏమిటంటే ఖురైషీయులు అనగా ముహాజిరీన్ ల నాయకులు, పెద్దలు అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్, అబ్దుల్లాహ్ ఇబ్నె ఔఫ్, అబూ ఉబైదహ్, తల్హా, జుబైర్ మరియు వాళ్ళ అడుగుజాడలలో నడిచేవారు.
అబ్దుల్లాహ్ కు హదీస్ వ్రాయకుండా దైవప్రవక్త(స.అ) జీవితంలోనే ఆపివేశారు దీనితో వాళ్ళ కుట్రలో ఉన్న లోతును పరిగణించ వచ్చు, అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
మరి అబ్దుల్లాహ్, దైవప్రవక్త(స.అ) నుండి ఏదీ తెలుసుకోకుండా ఖురైషీయుల మాటను ఎలా నమ్మారు? మరి అలాగే వాళ్ళ వచనం “దైవప్రవక్త(స.అ) కూడా మనిషే, అతను కోపంగా కూడా మాట్లాడతారు మరియు సున్నితంగా కూడా మాట్లాడతారు!” దీనితో వాళ్ళ విశ్వాస బలహీనతను కూడా అర్ధం చేసుకోవచ్చు. దైవప్రవక్త(స.అ) పట్ల వాళ్ళకు (మాజాల్లాహ్) దైవప్రవక్త(స.అ) ఎచ్చులు పలుకుతారు, తప్పుడు తీర్పులు ఇస్తారు ముఖ్యంగా కోపంగా ఉన్నప్పుడు, అని సందేహం ఉండేది. “అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్”, దైవప్రవక్త(స.అ)తో ఖురైషీయులు నన్ను హదీస్ వ్రాయవద్దు అని ఆపివేశారు అని అన్నప్పుడు అతను ఇలా అన్నారు: “నీవు వ్రాస్తూ ఉండు, నా ప్రాణాలు ఎవరి చేతులో ఉన్నాయో ఆయన ప్రమాణంగా చెబుతున్నాను నా నోరు నుండి కేవలం సత్యమే బయటకు వస్తుంది”
ఖురైషీయులు నా న్యాయం పట్ల సందేహిస్తున్నారు, అని దైవప్రవక్త(స.అ)కు తెలిసు, అన్న విషయం పై ఇది రెండవ సాక్ష్యం. వాళ్ళు దైవప్రవక్త(స.అ)తో పొరపాట్లు జరగడం సహజం అని భావిస్తారు. మరియు అతని నోటి నుండి ఎచ్చులు పలకడాన్ని సాధ్యం, అని అనుకుంటారు. అందుకనే దైవప్రవక్త(స.అ) అల్లాహ్ ప్రమాణంగా “నా నోరు నుండి కేవలం సత్యమే బయటకు వస్తుంది” అతని ఈ వచనం నూటికి నూరు సరైనది، ఎందుకంటే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను:
(وَمَا يَنطِقُ عَنِ ٱلۡهَوَىٰٓ إِنۡ هُوَ إِلَّا وَحۡيٞ يُوحَىٰ)
అనువాదం: )అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడటము లేదు. అవి(మాటలు) అతని వద్దకు పంపబడే దైవవాణి(వహీ) తప్ప మరేమీ కాదు(.[అల్ నజ్మ్ సూరా: 53, ఆయత్: 3,4.]
దైవప్రవక్త(స.అ) పొరపాట్ల నుండి దూరంగా, మరియు అసభ్యపలుకుల నుండి పవిత్రత కలిగి ఉంటారు. ముహమ్మద్, దైవప్రవక్త(స.అ) కాదు అని అర్ధం కలిగి ఉన్న రివాయత్ లు అమవీయుల కాలంలో తయారు చేయబడినవి. అవి ఏమాత్రం సరైనవి కావు, అని గట్టి నమ్మకంతో చెప్పగలం. ఉదాహారణకు ఇంతకు ముందు హదీస్ ద్వార మనకు “అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్” పై ఖురైషీయు ల ప్రభావం ఎక్కువగా ఉండేది చివరికి వాళ్ళు ఆపివేస్తే అతను హదీస్ ను వ్రాయడం మానేశారు, అని కూడా అర్ధమవుతుంది. అలా అని అతనే స్వయంగా అన్నారు నేను హదీస్ వ్రాయడం మానేశాను. చాలా రోజుల వరకు ఏమి వ్రాయ లేదు, చివరికి ఒక సందర్భం వచ్చింది మరియు అతను దైవప్రవక్త(స.అ) ఇస్మత్ గురించి పుట్టుకొచ్చిన సందేహాలను దూరం చేసుకునేందుకు దైవప్రవక్త(స.అ) సమక్షానికి చేరారు.
రిఫరెన్స్
1. ముస్తద్రక్, భాగం1, పేజీ105., సుననె అబీ దావూద్, భాగం3, పేజీ318, హదీస్3646., సుననె దారమీ, భాగం1, పేజీ162. కన్జుల్ ఉమ్మాల్, భాగం10, పేజీ222.
2. అహ్లె సున్నతె వాఖెయీ, తీజానీ సమావీ, భాగం1, పేజీ89,90.
దైవప్రవక్త(స.అ) ను సాధారణ వ్యక్తిగా చూపించి తమ లక్ష్యాలను చేరుకోవాలనుకున్నవారి ప్రయత్నాలను అందరికి తెలియాలనే చిన్న ప్రయత్నం...
వ్యాఖ్యానించండి