తాబెయీన్‌ల సున్నత్

సోమ, 02/21/2022 - 04:08

ఏ విధంగా అయితే “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” వారు సహాబీయులందరి సున్నత్ పై అమలు చేస్తారో అదే విధంగా “తాబెయీన్”ల అభిప్రాయల పై కూడా అమలు చేస్తారు...

తాబెయీన్‌ల సున్నత్

అహ్లెసున్నత్
లు, తమ తరపు నుండి సృష్టించుకున్నటువంటి మూల ఆధారములలోనే వారి మరియు షియాల మధ్య వ్యతిరేకత ఉంది. వాటిలో ఒకటి: తాబెయీన్ ల సున్నత్. దాని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందా
ఏ విధంగా అయితే “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” వారు సహాబీయులందరి సున్నత్ పై అమలు చేస్తారో అదే విధంగా “తాబెయీన్”ల అభిప్రాయల పై కూడా అమలు చేస్తారు. మరియు తాబెయీన్
లను “ఉలమాయే అసర్” అని కూడా అంటూ ఉంటారు. ఉదాహారణకు “ఔజాయీ”, “సుఫ్యానె సూరీ”, “హసనె బసరీ” మరియ “ఇబ్నె ఉనైయ్” మొ॥. అహ్లెసున్నత్
ల నాలుగు వర్గ నాయకుల యొక్క అభిప్రాయాలను కూడా కళ్ళకు అద్దుకొని స్వీకరిస్తారు. వారిని ఫాలో అవుతారు. వాస్తవానికి ఈ నలుగురు నాయకులు “తబెతాబెయీన్”
లలో లెక్కించబడతారు. మరియు చూసినట్లైతే స్వయంగా సహాబీయులే ఎన్నో సార్లు తమ తప్పులను అంగీకరించారు. మరియు వారు, వారికి తెలియని మాటలను కూడా పలికి ఉన్నారు.
అబూబక్ర్, ఒక ప్రశ్నకు జవాబుగా ఇలా అన్నారు: “నేను తొందరలోనే నా అభిప్రాయం ద్వార జవాబు ఇస్తాను. ఒకవేళ జవాబు సరైనదైతే అది అల్లాహ్ తరపు నుండి, మరియు ఒకవేళ సరైనది కాకుంటే అది నా తరపు నుండి లేదా షైతాన్ తరపు నుండి అయి ఉంటుంది”.

ఉమర్ ఇలా అన్నారు: “బహుశ నేను మీకు ఉపయోగపడనటువంటి మరియు మేలు కలగనటువంటి ఆదేశాలు ఇవ్వవచ్చు, మరియు మీకు మేలు కలిగే వాటి నుండి అడ్డుకో వచ్చు”.[1]
సహాబీయుల జ్ఞానం పరిస్థితి ఇలా ఉంది. వారు సందేహాత్మకమైన వాటిని అనుచరిస్తున్నారు. మరి అది యదార్ధానికి చేరేందుకు ఏమాత్రం సహాకరించదు. ఇలాంటి పరిస్థితిలో ఒక ముస్లిం వారి ప్రవచనములను మరియు చరితమును “నమ్మదగ్గ సున్నత్” మరియు “ఫిఖా యొక్క మూలాధారం”, అని ఎలా అంగీకరించగలడు?. ఇంత జరిగిన తరువాత కూడా “اصحابی کالنجوم” ఈ హదీస్ యొక్క ప్రాముఖ్యత ఇంకా మిగిలి ఉంటుందా?
దైవప్రవక్త(స.అ) సభలో హాజరు అయ్యే, మరియు అతని నుండి జ్ఞానం పొందే సహాబీయుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సహాబీయుల తరువాత వచ్చేవాళ్ళు, వీరి నుండి నేర్చుకున్నారు. మరియు “ఫిత్నా” సంభవించిన కాలంలో ఉన్నారు. మరి వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తూనే ఉంది.
నాలుగు వర్గాల నాయకులు, అల్లాహ్ దీన్ విషయంలో తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. మరియు స్పష్డంగా మా అభిప్రాయాలలో తప్పులు ఉండడం సాధ్యమని, వ్యక్తం చేస్తూ ఉంటారు. వారిలో ఒకరైతే “నా అభిప్రాయం ప్రకారం ఇది సరైనది మరియు ఒక్కోసారి ఇతరుల అభిప్రాయం సరైనది” అని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ముస్లిములకు వారి తఖ్లీద్
ను తమ పై విధిగా భావించడం న్యాయమేనా!?

రిఫరెన్స్
1. తారీఖే బగ్దాది, భాగం14, పేజీ81. ఇలాంటి వారిని మేము ఇలా ప్రశ్నిస్తున్నాము: మీరు ఇంత తక్కువ జ్ఞానం గల వారిని పురాతనకాలం నుండి భవిష్యతు వరకు అన్నింటి జ్ఞానం ఉన్నటువంటి మిక్కిలి గౌరవనీయలైన వారి పై ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు మరియు ఉమ్మత్
కు అతని నాయకత్వం నుండి ఎందుకు దూరం చేశారు మరియు దానిని మార్గభ్రష్టత మరియు అజ్ఞానంలో ఎందుకు వదిలేశారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17