విశ్వాసి గౌరవం

సోమ, 05/23/2022 - 16:48

విశ్వాసి మానమర్యాదల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్న మాసూమీన్(అ.స) హదీసులు...

విశ్వాసి గౌరవం

విశ్వాసి మానమర్యాదల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్న మాసూమీన్(అ.స) హదీసులు:
1. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “విశ్వాసి యొక్క గౌరవం మరియు ఉనికి, స్వీయ సంపద మరియు ప్రాణాలతో సమానం”[1]
2. హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: “ఎప్పుడు కూడా నీకు చెడ్డ పేరు తెచ్చే మరియు నిన్ను అగౌరవానికి గురి చేసే పనులు చేయ్యకు”[2]
3. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “ఒక్క గౌరవం తగ్గి విలువ పోతే ఇక దాన్ని తిరిగి పొందడం చాలా కష్టమౌతుంది”[3]
4. హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: “తన గౌరవ మరియు ఉనికి రక్షణ కోసం తన ధనాన్ని కూడా లెక్క చేయడు., ఇది అతడి వాస్తవికత మరియు గొప్పతనం యొక్క సంకేతం”[4]
5. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “తన ధర్మపరమైన సోదరుడి గౌరవమర్యాదలను కాపడువాడి కోసం (ప్రళయదినం) నరకాగ్ని నుండి కాపాడడానికి 70 వేల కవచాలు ఉంటాయి”[5]
6. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “ముస్లిముల గౌరవమర్యాదలను కించపరచడానికి దూరంగా ఉన్న వాడు; అల్లాహ్ ఇలాంటి వాడి తప్పులను అంతిమ దినాన క్షమిస్తాడు”[6]
7. హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: “నీ పరువు మరియు నమ్మకాన్ని ప్రజల మాటల తూటలకు గురిగా పెట్టకు”. (నీ మర్యాద నీ చేతుల్లోనే ఉంది)[7]
8. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స): “ఈ ముగ్గురికి గౌరవమర్యాదలు లేవు.. తన మనోవాంఛల ప్రకారం బిద్అత్(ధర్మంలో లేని అంశాలు)ను సృష్టించేవాడు, దుర్మార్గపు రాజు మరియు బహిరంగంగా పాపములు చేసేవాడు.[8]
9. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “ఒక విశ్వాసి యొక్క లోపాలను మరియు రహస్యాలను, ఇతర విశ్వాసుల ముందు వ్యక్తం చేయడం నిషిద్ధమైనది(హరామ్)”.[9]
10. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “ధర్మపరమైన సోదరుడి లోపాలను తెలుసుకొని వాటిని వ్యక్తం చేయడానికి అడుగు వేస్తే అది అతడి నరకంలో వేసే మొదటి అడుగు అవుతుంది! మరియు అల్లాహ్ అతడి రహస్యాలను మరియు లోపాలను సృష్టితాలన్నింటి ముందు వ్యక్తం చేస్తాడు”[10]
11. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “విశ్వాసి యొక్క నమ్మకం అతడి నమాజె షబ్ చదవడంలో మరియు గౌరవమర్యాదలు ఇతరుల గౌరవ మర్యాదలను కించపరచకపోవడంలో ఉంది”[11]
12. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “ప్రజలారా! పరస్పరం రక్తం చిందించడం మరియు గౌరవమర్యాదలను కించపరచడం, నువ్వు నీ ప్రభువుతో కలిసేంత వరకు నిషిద్ధమైనది(హరామ్).[12]
13. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “తన ముస్లిం సోదరుడి మానమర్యాదలను కాపాడినవాడు, నిస్సందేహంగా అతడి నిలయం స్వర్గం అవుతుంది”[13]
14. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “నువ్వు ఒకరి గౌరవమర్యాదలను ఎట్టిపరిస్తితిలో కూడా కించపరచకుండా జాగ్రత్త పడు.[15]
15. హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: “తన గౌరవమర్యాదలను తానో పోగొట్టుకునేవాడు, స్వయాన్ని అవమానానికి గురి చేసుకున్నట్లే”.[15]
16. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “విశ్వాసి యొక్క పూర్తి ఉనికి గౌరవమైనది.. అతడి పరువు గౌరవమైనది, అతడి సొమ్ము గౌరవమైనది, అతడి ప్రాణాలు గౌరవమైనవి”[16]
17. ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: “గౌరవమర్యాదలు కాపాడుకోవడం ప్రాపంచిక ఆశలు మరియు మార్గభ్రష్టత మరియు చెడు లక్ష్యాలు గల చర్యల నుండి దూరంగా ఉండడానికి మించిన చర్య లేదు”[17]
18. ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) ఉల్లేఖనం: “తెలుసుకో, (ఇతరుల నుండి) సహాయం కోరడం గౌరవం పోవడానికి మరియు కష్టాలకు పాలవ్వడానికి కారణమౌతుంది”[18]
19. ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: “తన ధన రక్షణ కోసం, తన గౌరవాన్ని నాశనం చేసుకొనేవాడు., ఇది అతడి అల్ప మరియు విలువలేని తనానికి సంకేతం”[19]
20. ఇమామ్ హుసైన్(అ.స) ఉల్లేఖనం: “నీ గౌరవమర్యాదలను కాపాడే మార్గంలో ఖర్చు పెట్టబడే ధనమే ఉత్తమ ధనం”[20]

రిఫరెన్స్
1. లిఆలిల్ అఖ్బార్, భాగం5, భాగం5, పేజీ226.
2. ఫహ్రిస్తె గురర్, పేజీ242.
3. అఅలాముద్దీన్, పేజీ303.
4. ఫెహ్రిస్తె గురర్, పేజీ242.
5. బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ253.
6. బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ256.
7. నెహ్జుల్ బలాగహ్, నామా69.
8. ఖుర్బుల్ అస్నాద్, పేజీ82.
9. ఉసూలె కాఫీ, భాగం4, పేజీ63.
10. లిఆలి అల్ అఖ్బార్, భాగం5, పేజీ241.
11. ఫురూ-ఎ-కాఫీ, భాగం3, పేజీ477.
12. తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ31.
13. సవాబుల్ ఆమాల్, పేజీ324.
14. షహాబుల్ అఖ్బార్, పేజీ350.
15. ఫెహ్రిస్తె గురర్, పేజీ242.
16. ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ239.
17. ఫెహ్రిస్తె గురర్, పేజీ242.
18. బిహారుల్ అన్వార్, భాగం78, పేజీ378.
19. ఫెహ్రిస్తె గురరుల్, పేజీ242.
20. బిహారుల్ అన్వార్, భాగం44, పేజీ189.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11