ఆత్మహత్య హదీస్ దృష్టిలో

సోమ, 01/28/2019 - 08:47

ఆత్మహత్య ఒక దుష్కార్యం అన్న విషయం మరియు దానికి పాలుపడినవారి ఫలితం గురించి వివరించే పవిత్ర మాసూముల హదీస్ ల సూచన.

ఆత్మహత్య హదీస్ దృష్టిలో

ఆత్మహత్య తిరస్కారం పట్ల మరియు అది దుష్కార్యం అని చాలా హదీసులు రివాయతులు వివరిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్నవారు నరకవాసులనీ మరియు స్వర్గం వారిపై హరామ్ గా నిర్ధారించబడిందని వివరిస్తున్నాయి. కొన్ని రివాయతులు:
1. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: “ఎవరైనా కావాలనే ఆత్మహత్య చేసుకుంటే, సదా నరకాగ్నిలోనే ఉంటాడు”[అల్ ఫఖీహ్, షేఖ్ సదూఖ్, భాగం3, పేజీ571, హదీస్4953]
2. దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఎవరైతే ఏ ప్రాపంచిక విషయం కోసం ఆత్మహత్య చేసుకున్నాడో, అల్లాహ్ ప్రళయంనాడు దాని ద్వారానే శిక్షిస్తాడు”[కన్జులు ఉమ్మాల్, ముత్తఖీ హిందీ, భాగం15, పేజీ36, హదీస్39965]
3. దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఎవరైతే ఊపిరాడని విధంగా ఆత్మహత్య చేసుకుంటారో వారు నరకాగ్నిలో ఊపిరాడకుండా చేసుకున్నట్లే”[ కన్జులు ఉమ్మాల్, ముత్తఖీ హిందీ, భాగం15, పేజీ35, హదీస్39961].
4. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఉల్లేఖనం: “విశ్వాసికి ఎటువంటి కష్టమైన రావచ్చు, ఎటువంటి మరణమైన సంభవించవచ్చు కాని ఆత్మహత్య మాత్రం చేసుకోడు”[వసాయిలు అల్ షియా, హుర్రెఆములి, భాగం29, పేజీ240, బాబొ తహ్రీము ఖతలల్ ఇన్సాను నఫ్సహు, హదీస్3].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13