స్త్రీల కోసం ఉత్తమ నమూనా-1

శుక్ర, 12/09/2022 - 16:24

హజ్రత్ జహ్రా(స.అ) జీవితం స్ర్తీలకు ఉత్తమ నమూనా అని నిదర్శిస్తున్న హదీసులు మరియు చరిత్ర...

స్త్రీల కోసం ఉత్తమ నమూనా-1

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

భర్త, పిల్లలు మరియు ఇంటి పనులను ఎలా చేసుకోవాలి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే హజ్రత్ జహ్రా(స.అ) యొక్క పవిత్ర జీవిత చరిత్ర తెలుసుకోవడం చాలా అవసరం. ఆమె జీవించిన 18 సంవత్సరాల జీవితం, కుటుంబాన్ని మంచి కుటుంబంగా మార్చుకోవాలనుకునే వారికి నమూనాగా నిలిచింది.

ఆమె, గృహనిర్వాహక పద్దతులను మరియు భర్త పట్ల కర్తవ్యాలను ఉత్తమ పద్ధతిలో అమలు పరిచేవారు. తన జీవితంలో తన భర్త హజ్రత్ అలీ(అ.స)కు నిజమైన భాగ స్వామి, సహచరి మరియు నమ్మకస్తురాలుగా ఉన్నారు.

అప్పుడప్పుడు ఇంట్లో ఆర్థిక సంక్షోభం వల్ల కఠోర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆమె మరియు పిల్లలు ఆకలితో ఉన్నా సరే హజ్రత్ ఫాతెమా(స.అ) తన భర్త అలీ(స.అ) తో ఇది కావాలి అని ఒక్కసారి కూడా కోరలేదు; చివరికి దైవప్రవక్త(స.అ) కూడా ఈ విషయంలో ఏమి చెప్పేవారు కాదు.

కోరకపోవడానికి గల కారణం; ఎక్కడ భర్త తన కోరికను పూర్తి చేయలేక బిడియానికి గురి అవుతారో అన్న భయం.

ఆమె ఇంతిలా తన భర్త విషయంలో ఆలోచించేవారు. కేవలం అటువంటి అలీ(స.అ) కు ఇటుంటి భార్య మాత్రమే సమానం.

ఇంటి పనులు చేసే విషయంలో కూడా ఆమె మంచి నమూనా. పనుల ప్రభావం వల్ల ఆమె చేతులకు బొబ్బలు వచ్చేవి, బట్టలు దుమ్ము మయం అయ్యేవి, ఆమె బట్టలు పొగ ప్రభావం వల్ల మట్టి మట్టిగా మారేవి.

పనులను హజ్రత్ అలీ(అ.స) మరియు హజ్రత్ ఫాతెమా(స.అ) విభజించుకున్నారు. బయట పనులు హజ్రత్ అలీ(అ.స) చేసేవారు మరియు ఇంటి లోపల పనులు హజ్రత్ ఫాతెమా(స.అ) చేసేవారు. పనులను ఇలా విభజించడం పై ఆమె చాలా సంతోషంగా ఉండేవారు; ఎందుకంటే ఇక ఆమె ఏ బయట మగవారి ముందుకు వెళ్లాల్సినవసరమే ఉండదు కాబట్టి. ఇది మన స్ర్తీల పవిత్రత మరియు ఉత్తమత్వాన్ని పెంచడానికి మంచి నమూనా.

పిల్లలలో వ్యక్తిత్వాన్ని పెంచడం:

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఆచరణాత్మక జీవితంలో పిల్లలలో వ్యక్తిత్వాన్ని పెంచే మరియు వారిలో స్వయ నమ్మకాన్ని ఏర్పడే అంశాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. పిల్లలలో స్వయ నమ్మకాన్ని పెంచే మరియు కష్టాలను ఎదురుకొనే సాధనలలో ఒకటి పిల్లల మధ్య నిర్మాణాత్మకమైన పోటీలు పెట్టడం.

ఒకరోజు ఆమె కుమారులు ఇమామ్ హసన్ మరియు ఇమామ్ హుసైన్(అ.స) ఏదో వ్రాసుకుంటున్నారు. ఇమామ్ హసన్, ఇమామ్ హుసైన్ తో “నా రాత నీ రాత కన్న బాగుంది” అన్నారు. ఇమామ్ హుసైన్ “కాదు, నా రాత నీ కన్నా బాగుంది” అని అన్నారు. వారిద్దరు వారి అమ్మ వద్దకు వెళ్లి మీరే తీర్మానించండి అని అన్నారు. అమ్మకు వారిద్దరిలో ఎవరినీ కష్టపెట్టాలనుకోలేదు. అందుకే నాన్న గారి తో అడిగి తెలుసుకోండి అన్నారు. వారిద్దరు తండ్రి దగ్గరకు వెళ్లి ప్రశ్నించారు. వారు కూడా వారిద్దిరిలో ఏ ఒక్కరిని కూడా కష్టపెట్టాలని అనుకోలేదు. అందుకని మీ తాతగారిని అడిగి తెలుసుకోండి అన్నారు. వారిద్దరూ దైవప్రవక్త(స.అ) వద్దకు వెళ్లారు. దైవప్రవక్త(స.అ) కూడా “నేను తీర్మానించను కాని జిబ్రయీల్ ను అడిగి తెలుసుకుంటాను” అని అన్నారు. జిబ్రయీల్ వచ్చినప్పుడు నేను కూడా తీర్మానించలేను. ఇస్రాఫీల్ వారిని తీర్మానిస్తారు అన్నారు. ఇస్రాఫీల్ కూడా నేను తీర్మానించలేను అల్లాహ్ యే వారిని తీర్మానించగడు అని అన్నారు. ఇస్రాఫీల్ అల్లాహ్ ను కోరగా అల్లాహ్ వారి మధ్య వారి తల్లి ఫాతెమా యే తీర్మానించాలి” అనెను. హజ్రత్ ఫాతెమా(సఅ) “ప్రభూ! తప్పుకుండా నేను తీర్మానిస్తాను” అని అన్నారు. హజ్రత్ ఫాతెమా(స.అ) మెడ హారం ఉండేది. ఆమె వారిద్దరితో ఇలా అన్నారు: “నేను ఈ హరంలో ఉన్న ముత్యాలను క్రింద వేస్తాను ఎవరైతే ఎక్కువ ముత్యాలు తీసుకుంటారో అతడి రాతా బాగుందన్నమాట” ముత్యాలు భూమి పై వెశారు, నింగి పై ఉన్న జిబ్రయీల్ కు భూమి పై వెళ్లి వారిలో ఏ ఒక్కరు కూడా నిరాశ పడకుండా మిగిలిపోయిన ఆ ఒక్క ముత్యాన్ని రెండు ముక్కలు చేయమని ఆదేశించబడింది, జిబ్రయీల్ ఆ పనిని నిర్వరించారు.[1]

రిఫరెన్స్
1. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ309.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 34