జనాబె సల్మానె ముహమ్మదీ చరిత్ర-3

శుక్ర, 12/23/2022 - 17:36

దైవప్రవక్త(స.అ) యొక్క అత్యంత ఉత్తమ సహాబీ అయిన జనాబె సల్మాన్ గురించి సంక్షిప్త వివరణ...  

జనాబె సల్మానె ముహమ్మదీ చరిత్ర-3

సల్మాన్ అహ్లెబైత్ కు చెందినవారు హదీస్ వివరణ
దేవప్రవక్త(స.అ) “సల్మాను మిన్నా అహ్లలల్ బైత్; సల్మాన్ మా అహ్లెబైత్ కు చెందినవాడు” అన్నారు.
వివరణ: ప్రముఖ ఆరిఫ్, ముహ్యుద్దీన్ ఇబ్నె అరబీ, అహ్లె సున్నత్ ఉలమాల నుండి అయి కూడా దైవప్రవక్త(స.అ) ఈ హదీస్ యొక్క వ్యాఖ్యానంలో ఇలా ఉల్లేఖించారు: “ఈ వాక్యంలో సల్మాన్ ను అహ్లెబైత్(అ.స) తో కలపడం, సల్మాన్ యొక్క గొప్ప స్థానం, పవిత్ర మరియు ఆత్మస్వచ్ఛత పై దైవప్రవక్త(స.అ) సాక్ష్యాన్ని సూచిస్తుంది; ఎందుకంటే సల్మాన్ అహ్లెబైత్(అ.స) నుండి కాని బంధుత్వ పరంగా కాదు; ఈ బంధం సల్మాన్ లో ఉన్న అధ్యాత్మిక గొప్ప స్వభావాల వలన.[1]

సల్మాన్ మరియు విలాయత్ రక్షణ
సల్మాన్ దైవప్రవక్త(స.అ) తరువాత ఇమామ్ అలీ(అ.స) ఖిలాఫత్ విషయంలో జరిగిన అన్యాయాన్ని ఎదురుకునే వారిలో ఒకరు. వారు ఇమామ్ అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) యొక్క నిజమైన ఖలీఫా మరియు ఉత్తరాధికారి అని ఒక్క క్షణం కూడా సందేహించకుండా ఆయన పట్ల విధేయతను చాటుకున్నారు. వీలుదోరికితే చాలు యదార్థాలను చెప్పి ముస్లిములకు ఇమామ్ అలీ(అ.స) వైపుకు రమ్మని పిలిచేవారు. నిరంతరం వారు దైవప్రవక్త(స.అ) ఈ మాటను ప్రజల కోసం చబుతూ ఉండేవారు: “నిస్సందేహంగా అలీ అల్లాహ్ తెరిచిన ద్వారము. అందులో ప్రవేశించినవాడు విశ్వాసి మరియు దాని నుండి బయటకు వెళ్ళిపోయిన వాడు అవిశ్వాసి”[2] అలాగే “అలీ ఈ ఉమ్మత్ యొక్క అతిఉత్తమ వ్యక్తి”[3]
సల్మాన్ ఒక ఉపన్యాసంలో ఇలా అన్నారు: “ప్రజలారా! విలాయత్ ను మీ మధ్య శిరస్సుగా నిర్ధారించండి”
అంటే అహ్లెబైత్(అ.స) యొక్క విలాయత్ లేకుంటే, నిజమైన ముస్లిం కాలేవు మరియు నీ మతం నీకు లాభాన్ని చేకూర్చదు అని అర్థం.[4]
ఇబ్నె అబ్బాస్ సల్మాన్ ను కలలో చూసి అతనితో ఇలా ప్రశ్నించారు: స్వరంలో అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) పట్ల విశ్వాసం తరువాత ఏది ఉత్తమైనది? సల్మాన్ ఇలా సమాధానమిచ్చారు: “అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) పట్ల విశ్వాసం అనంతరం ఏదీ విలువైనది మరియు ఉత్తమమైనది లేదు అలీ ఇబ్నె అబీతాలిబ్ విలాయత్ మరియు వారి పట్ల ప్రేమ మరియు వారి అనుచరణ తప్ప”[5].

జనాబె సల్మాన్ దైవప్రవక్త(స.అ) మాటల్లో
సల్మానె ఫార్సీ, ఇస్లాం స్వీకరణ తరువాత ఈమాన్ మరియు ఇస్లాం ఎరుక మార్గంలో ఎంత ముందకు సాగిపోయారంటే దైవప్రవక్త(స.అ) వద్ద గొప్ప స్థానం పొందారు మరియు పవిత్ర మాసూముల నుండి ప్రశంసలు పొందారు. ఇప్పుడు సల్మానె ఫార్సీ గురించి వారు చెప్పిన కొన్ని హదీసులను చూద్దాం:
1. హిజ్రీ యొక్క 5వ సంవత్సరంలో సంభవించిన ఖందఖ్ యుద్ధంలో సల్మాన్ యోచనతో పట్టణం చుట్టూ గొయ్యి త్రవ్వారు. ప్రతీ ఒక్కరూ సల్మాన్ మా సమూహానికి చెందిన వారై ఉంటే బాగుండేది అని అనుకునే వారు అందుకే ముహాజిరీనులు సల్మాన్ మా నుండి అంటే అన్సారులు అతడు మా నుండి అనే వారు. అప్పుడు దేవప్రవక్త[స.అ] “సల్మాను మిన్నా అహ్లలల్ బైత్; సల్మాన్ మా అహ్లెబైత్ కు చెందినవాడు” అన్నారు.[6]
2. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “నిస్సందేహంగా సల్మాన్ స్వర్గాని చూడలనే అభిలాష కన్న స్వర్గానికి సల్మాన్ ను చూడాలనే అభిలాష ఎక్కువ”[7]
3. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “అల్లాహ్, ఈమాన్ కాంతితో ప్రకాశింపజేసిన హృదయం గల వ్యక్తిని చూడాలనుకుంటున్నవారు, సల్మాన్ ను చూడండి”[8]
4. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “సల్మాన్ నావాడు, వారిని హింసిచినవారు నన్ను హింసించినట్లే, వారిని బాధ పెట్టిన వారు నన్ను బాధపెట్టినట్లే.[9]
జనాబె సల్మాన్ మరణం
జనాబె సల్మాన్, ఉస్మాన్ ఖిలాఫత్ అధికారంలో హిజ్రీ యొక్క 35వ సంవత్సరంలో మరణించారు.[10] ఇమామ్ అలీ(అ.స) దేహాన్ని గుస్ల్ స్నానం చేయించి, కఫన్ బట్టలు వేసి అతనిపై జనాజహ్ నమాజ్ ను చదివారు. ఇమామ్ తో పాటు జాఫరె తయ్యార్ మరియు హజ్రతె ఖిజ్ర్ ఉన్నారు వారిద్దిలో ప్రతీ ఒక్కరితో పాటు దైవదూతల 70 వరుసలు సల్మాన్ పై జనాజహ్ నమాజ్ ను చదివారు.[11] వారి సమాధి మదాయిన్ లో ఉంది.
కనిపిస్తున్న ఈ రంగు రంగుల ప్రపంచం మనిషిని పాపముల సముద్రంలో మంచేస్తుంది, అల్లాహ్ నుండి దూరం చేస్తుంది, ఆయన పంపించిన నిజమైన మార్గదర్శకుల పట్ల అవిధేయులుగా నిలబెడుతుంది. కాని ఎవరైనా తన ఆత్మను సద్గుణాల ద్వార తమ అస్తిత్వాన్ని నావగా మార్చుకుంటే ఈ పాపముల సముద్రం నుండి బయటపడి పరిపూర్ణ స్థాయికి చేరుకోవచ్చు. దీనికి జనాబె సల్మాన్ యొక్క జీవితమే నిదర్శనం. 

రిఫరెన్స్
1. ఇబ్నె అబిల్ హదీద్, షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం18, పేజీ36.
2. సులైమ్ ఇబ్నె ఖైస్, కితాబు సులైమ్ ఇబ్నె ఖైస్, పేజీ251.
3. సయ్యద్ మొహమ్మద్ అమీన్, ఆయానుష్షిఅహ్, భాగం7, పేజీ287.
4. బురుజర్దీ, సయ్యద్ హుసైన్, బహ్జతుల్ ఆమాల్, భాగం4, పేజీ418.
5. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ341.
6. తబర్సీ, ఫజ్ల్ ఇబ్నె హసన్, మజ్ముఅల్ బయాన్, భాగం2, పేజీ427.
7. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ341.
8. తబర్సీ, అహ్మద్ ఇబ్నె అలీ ఇబ్నె అబీతాలిబ్, ఎహ్తెజాజె తబర్సీ, భాగం1, పేజీ150.
9. అమీన్, సయ్యద్ మొహమ్మద్, అఅయానుష్షియా, భాగం7, పేజీ287.
10. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ391-392.
11. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ373.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21