జనాబె సల్మానె ముహమ్మదీ చరిత్ర-1

శుక్ర, 12/23/2022 - 16:17

దైవప్రవక్త(స.అ) యొక్క అత్యంత ఉత్తమ సహాబీ అయిన జనాబె సల్మాన్ గురించి సంక్షిప్త వివరణ...

జనాబె సల్మానె ముహమ్మదీ చరిత్ర-1

దైవప్రవక్త(స.అ) అతిదగ్గర సహచరులలో ఒకరు “సల్మాన్ ఫార్సీ”. హిజ్రత్ కు చాలా సంవత్సరాల క్రితం ఇరాన్ దేశంలో ఉన్న  ఇస్ఫెహాన్ కు చెందిన “జీ” అనే ఒక గ్రామంలో ఒక పిల్లాడు జన్మించాడు, అతడి పేరు “రూజ్ బెహ్” దైవప్రవక్త(స.అ)తో కలిసిన ప్రవక్త వారిని “సల్మాన్” అని నామకరించారు.
జనాబె సల్మాన్ తండ్రి జర్దుష్తీయుల ధర్మకర్త, అతను ఆ ధర్మం వారు విశ్వసించే నిప్పు గుండాన్ని నిరంతరం వెలుగుతూ ఉండేందుకు కట్టేలు వేసే పని చేసేవారు. జనాబె సల్మాన్ జర్దుష్తీయుల సమాజంలో జన్మించిప్పటికీ ఎప్పుడు కూడా నిప్పు ముందు ఆరాధ్యపరంగా తన తలను వంచలేదు అతను ఏకేశ్వరుని విశ్వసించేవారు. వారి చిన్నతనంలోనే తల్లి పరణించింది, వారి అత్త వారి పోషణబాధ్యతలు తీసుకున్నారు.
వారిని 6 నెలల పాటు కారాగారంలో ఉంచి ఆ తరువాత కూడా వారి పూర్వీకుల నమ్మకాలను అనుసరించకపోతే ఉరి తీయాలి అని నిర్ణయించబడింది అని తెలుసుకున్న జనాబె సల్మాన్ వారి అత్త సహాయంతో తప్పించుకుని ఏడారుల వైపుకు వెళ్ళిపోయారు. ఏడారుల్లో షామ్ వైపుకు వెళ్తున్న ఒక బాటసారులగుంపుతో కలిసి తెలియని దేశాలకు ప్రయాణం సాగించారు. చివరికి అల్లాహ్ వారిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చాడు. హిజ్రత్ యొక్క మొదట్లోనే దైవప్రవక్త(స.అ) చేతుల మీదుగా ఇస్లాంను స్వీకరించారు.[1].

సల్మాన్ నామకరణం మరియు విముక్తి

ఇరాన్ దేశంలో జన్మించిన సల్మానె ఫార్సీ, వారి పూర్వీకుల విశ్వాసాలను నమ్మకపోతే ఉరి తీయబడతారు అని తెలుసుకొని వారి అత్త సహాయంతో అక్కడ నుండి తప్పించుకొని షామ్ కు చెందిన ఒక బటసారుల గుంపుతో కలిసి తనకు తెలియని దేశం వైపుకు ప్రయాణం సాగించారు. హిజ్రత్ యొక్క ముందు రోజుల్లోనే వారు దైవప్రవక్త(స.అ) కలిశారు.
దైవప్రవక్త(స.అ) సల్మాన్ ను ఒక యూదుడి నుండి నలభై కర్జూరపు చెట్లు మరియు నలభై వఖియ(ప్రతీ వఖియహ్ నలభై దిర్హములకు సమానం అంటే 1600 వేల దిర్హములు) ఇచ్చి బానిసత్వం నుండి విముక్తిని ప్రసాదించి వారికి “సల్మాన్” అని ఒక మంచి పేరు పెట్టారు.[2]
పేరు మార్చడం రెండు విషయాలకు సూచన:
1. అజ్ఞానపు కాలం యొక్క పేర్లు ముస్లిములకు ఉచితమైనవి కావు.
2. సల్మాన్ అనే పదం సలామతీ మరియు తస్లీమ్ అనబడే పదాల నుండి తీసుకోబడినవి. దైవప్రవక్త(స.అ), వారికి సల్మాన్ అని పేరు పెట్టడం సల్మాన్ ఆత్మ యొక్క పవిత్రత మరియు సలామతీకి నిదర్శనం. 

జనాబె సల్మాన్ ధర్మనిష్ట
జనాబె సల్మాన్ ధర్మనిష్ట కలిగి ఉండేవారు. వారి పూర్తి జివితం చాలా సాధారణంగా, పవిత్రంగా మరియు మనోవాంఛలకు దూరంగా గడిచింది. అతను ప్రాపంచిక జీవితాన్ని ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. సల్మాన్ దైవప్రవక్త(స.అ) మరియు ఇమామ్ అలీ(అ.స) యొక్క అసలైన అనుచరుడు, అందుకని వారి మార్గన్నే ఎన్నుకున్నారు చివరికి .మదాయిన్. గవర్నర్ గా ఉన్నప్పుడు కూడా చాలా సాధారణ జీవితాన్ని గడిపారు. అతని ధర్మనిష్ట మరియు మాన్యత అతని మిక్కిలి విశ్వాసం నుండి; ఎందుకంటే ఎవరి ఈమాన్ ఎంత బలంగా ఉంటుందో అతని దృష్టి ప్రపంచం పై అంత తక్కువగా ఉంటుంది. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు: “ఈమాన్ కు పది స్థానాలున్నాయి, మిఖ్దాద్ ఎనిమిదవ స్థానంలో మరియు అబూజర్ తొమ్మిదవ స్థానంలో మరియు సల్మాన్ పదవ స్థానంలో ఉన్నారు”[3]
సల్మాన్ కు ఇల్లు ఉండేది కాదు, అలా అని ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా అతనికి ఉండేది కాదు. ఒక వ్యక్తి అతనికి ఒక ఇల్లు కట్టిస్తానన్నాడు కాని సల్మాన్ అంగీకరించలేదు. చివరికి చాలా బలవంతం చేయడంతో అతని కోసం ఒక ఇంటి నిర్మాణానికి అంగీకరించారు కాని ఆ ఇల్లు నిలబడితే తల పైకప్పుకు తగలాలీ, పడుకునేటప్పుడు కాళ్ళు గోడకు తగిలేలా ఉండాలి అని కోరారు.[4] అతని రాబడి తక్కువైనా సరే ధీనులకూ, పేదవారికీ, అవసరంవున్న వారికి సహాయం చేసేవారు అందులో నుంచి కొంచెమే తన కోసం ఉంచుకునే వారు.

రిఫరెన్స్
1. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ366
2. షీరాజీ హుసైనీ, సయ్యద్ అలీ ఖాన్ ఇబ్నె అహ్మదె మదనీ, అల్ దరజాతుల్ రఫీఅహ్, పేజీ203.
3. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ317.
4. షర్హే నెహ్జుల్ బలాగహ్ ఇబ్నె అబిల్ హదీద్, భాగం18, పేజీ36.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13