జనాబె సల్మానె ముహమ్మదీ చరిత్ర-2

శుక్ర, 12/23/2022 - 16:52

దైవప్రవక్త(స.అ) యొక్క అత్యంత ఉత్తమ సహాబీ అయిన జనాబె సల్మాన్ గురించి సంక్షిప్త వివరణ...

జనాబె సల్మానె ముహమ్మదీ చరిత్ర-2

జనాబె సల్మాన్ ఆరాధన పద్ధతి
జనాబె సల్మాన్ చేసే ఆరాధన కూడా వారి జ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే జ్ఞానంతో కలిసి ఉన్న ఆరాధన అంతర్ దృష్టితో కూడి ఉంటుంది. ఒక సంఘటన హదీస్ రూపంలో.
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఒకరోజు దైవప్రవక్త(స.అ) సహచరులతో ఇలా అన్నారు: మీలో ఎవరు అన్ని రోజులు ఉపవాసం ఉంటారు?
సల్మాన్: నేను ప్రవక్తా!
దైవప్రవక్త(స.అ): మీలో ఎవరు రాత్రళ్ళు ప్రార్థనలో గడుపుతారు?
సల్మాన్: నేను ప్రవక్తా!
దైవప్రవక్త(స.అ): మీలో రోజుకి ఒకసారి పూర్తి ఖుర్ఆన్ ను చదివేవారెవరైనా ఉన్నారా?
సల్మాన్: నేను ప్రవక్తా!
అక్కడున్నవారిలో ఒకడు సల్మాన్ సమాధానాలను స్వోత్కర్ష(తన్ను తాను పొగుడుకోవడం)గా భావించి ఇలా అన్నాడు: ఎన్నో సార్లు ఉదయం పూట ఉపవాసం లేకుండా సల్మాన్ ను చూశాను, రాత్రుళ్ళు నిద్రపోవడం మరియు పగలు మౌనంగా ఉండడం కూడా చూశాను, మరి ఎలా నిరంతరం ఉపవాసం మరియు రాత్రంతా ప్రార్థన మరియు ప్రతీరోజు ఒకసారి ఖుర్ఆన్ పూర్తిగా చదివేవారు!?
దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: మౌనంగా ఉండు! నీకు లుఖ్మాన్ తో సమానమైనవారితో ఏం పని?. ఎలా సాధ్యం అని తెలుసుకోవాలనుంటే స్వయంగా అతనినే అడిగి తెలుసుకో.
సల్మాన్ ఇలా వివరించారు: నేను నెలలో మూడు రోజులు ఉపవాసం ఉంటాను, మరి అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు: “ఎవరైతే ఒక మంచి పని చేస్తారో దానికి పది రెట్లు పుణ్యాన్ని ప్రసాదిస్తాను” అలాగే షాబాన్ మాసం యొక్క చివరి రోజున ఉపవాసం చేసి దానిని రమజాన్ మాసం యొక్క ఉపవాసాలతో కలిపేస్తాను, ఇలా చేసిన వారికి నిరంతరం ఉపవాసం ఉన్న వారి పుణ్యం లభిస్తుంది. దైవప్రవక్త(స.అ)ను ఇలా చెబుతుండగా విన్నాను: “శుద్ధి(ఉజూ)తో పడుకుంటే రాత్రంతా ప్రార్థనలో గడిపిన వారి పుణ్యం లభిస్తుంది” ఇక మిగిలింది ఖుర్ఆన్ చదవడం, దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “ఎవరైతే ‘ఖుల్ హువల్లాహ్’ సూరహ్ ను చదువుతారో వారికి 1/3 వంతు ఖుర్ఆన్ చదివిన పుణ్యం లభిస్తుంది, అలాగే ఎవరైతే రెండు సార్లు చదువుతారో 2/3 వంతు ఖుర్ఆన్ చదివినట్లు మరి ఎవరైతే మూడు సార్లు చదువుతారో వారు పూర్తి ఖుర్ఆన్ చదివినట్లే”[4. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ317.]

జనాబె సల్మాన్ యొక్క ప్రతిష్టతలు
సల్మాన్, పరిపూర్ణత్వాన్ని అన్వేషించే వారికి నమానా. గొప్ప గొప్ప అంశాలను తన సొంతం చేసుకున్నారు. వాటిలో కొన్ని మీకోసం:
1. దైవప్రవక్త(స.అ) సామిప్యం కలిగి ఉండడం 2. మంచి ఎరుక కలిగు ఉండేవారు. దైవప్రవక్త(స.అ) వారిని ఎవరూ చేరలేనటువంటి లోతైన జ్ఞాన సముద్రం అని అనేవారు 3. ఆరాధన; వారి ఆరాధన కూడా వారి జ్ఞానానికి నిదర్శనం. అటువంటి జ్ఞానం వలనే మంచి దాసుడు మరియు భక్తుడు కూడా అయ్యారు 4. ధర్మనిష్ట కలిగి ఉండేవారు. వారి పూర్తి జివితం చాలా సాధారణంగా గడిచింది 5. విలాయత్ కు రక్షణ కవచంగా నిలబడ్డారు.
ఇన్షాఅల్లాహ్ ప్రతీ ప్రతిష్టత గురించి హదీస్ మరియు చరిత్ర గ్రంథాల నుండి కొన్ని నిదర్శనలు మీ కోసం తరువాత వ్యాసాలలో వివరించబడుతుంది.

జనాబె సల్మాన్ జ్ఞానం
జనాబె సల్మాన్ జ్ఞానం గురించి సూచిస్తున్న కొన్ని హదీసులు మీ కోసం:
1. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “ఒకవేళ ధర్మం(దీన్) సురయ్యా(కృత్తికానక్షత్రము)లో ఉన్నా సల్మాన్ దానిని చేరుకుంటాడు”[1]
2. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “దైవప్రవక్త(స.అ) మరియు హజ్రత్ అలీ[అ.స] ఇతరులు విని సహించుకులేనటువంటి రహస్యాలను సల్మాన్ కు చెప్పేవారు. వారిని జ్ఞాననిధి మరియు రహస్యాలను కాపాడేవారుగా భావించేవారు., అందుకే ఒక విధంగా సల్మాన్ బిరుదు “ముహద్దిస్” కూడానూ.[2]
3. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “ఇస్లాంలో, ప్రజలందరిలో ధర్మశాస్త్రజ్ఞుడైన వ్యక్తి, సల్మాన్ మాధిరి సృష్టించబడలేదు”[3]
4. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “సల్మాన్, ఎవరూ చేరలేనటువంటి లోతైన జ్ఞాన సముద్రం”[4]
5. సల్మాన్ ఇలా చెప్పేవారు: “ప్రజలారా! నాకు తెలిసిన విషయాలు మీకు చెబితే, మీరు సల్మాన్ కు పిచ్చిపట్టింది అంటారు, లేదా సల్మాన్ ను చంపిన వారి పై దురూద్ పంపుతారు”[5]

రిఫరెన్స్
1. ఇబ్నె అబిల్ హదీద్, షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం18, పేజీ36.
2. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ47.
3. మామ్ఖానీ, అబ్దుల్లాహ్, తన్ఖీహుల్ మిఖాల్, భాగం2, పేజీ47.
4. షేఖ్ ముఫీద్, ఎఖ్తెసాస్, షేఖ్ ముఫీద్, పేజీ222.
5. కషీ, మొహమ్మద్ ఇబ్నె ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్, రిజాలె కషీ, పేజీ20.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17