దైవప్రవక్త[స.అ] తన పూర్తి జీవిత కాలంలో హజ్రత్ అలీ[అ.స] పై సహాబీయులలో ఏ ఒక్కరిని కూడా నాయకుడిగా నియమించ లేదు.
దైవప్రవక్తే[స.అ] స్వయంగా తన ఉత్తరాధికారి అయిన హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టతలు ప్రతి అనుకూల సందర్భాలలో ప్రవచించారు మరియు అతని ప్రత్యేకతలతో అతనిని పరిచయించారు. అలా అని దైవప్రవక్త[స.అ] గారి చరితము చదివేవారికి తెలుసు. అంతేకాకుండా “దైవప్రవక్త[స.అ] కేవలం ప్రవచనాలతోనే ఆగలేదు ఆ ప్రవచనాల పై అమలు చేసి చూపించారు” అని. దైవప్రవక్త[స.అ] తన పూర్తి జీవితం కాలంలో హజ్రత్ అలీ[అ.స]పై సహాబీయులలో ఏ ఒక్కరిని కూడా నాయకుడిగా నియమించ లేదు. దీనికి వ్యతిరేకంగా కొందరిని కొందరి పై నాయకుడిగా నియమించారు ఉదా: “జాతుస్సలాసిల్ అను యుధ్ధంలో అబూబక్ర్ మరియు ఉమర్‌పై అమ్ర్ ఇబ్నె ఆస్‌ను నాయకుడిగా నియమించారు” అలాగే సహాబీయులందరి పై(హజ్రత్ అలీ[అ.స] తప్ప) ఒక యువకుడైన “ఉసామా బిన్ జైద్”ను సైన్యాధిపతిగా నియమించారు కాని హజ్రత్ అలీ[అ.స] ఎప్పుడైన ఎక్కడికైన పంపబడితే దైవప్రవక్త[స.అ] అతనిని అందరి పై నాయకుడిగా నియమించే పంపేవారు. చివరికి ఒకసారి దైవప్రవక్త[స.అ] రెండు సైన్యాలను పంపారు ఒక సైన్యానికి అలీ[అ.స]ని నాయకుడిగా నియమించారు మరియు రెండవ సైన్యానికి “ఖాలిద్ బిన్ వలీద్”ను ఆ తరువాత ఇలా అన్నారు: “మీరిద్దరు వేరు వేరుగా ఉన్నంత వరకు ప్రతీ ఒక్కరు తమ సైన్యానికి నాయకులు కాని ఎప్పుడైతే మీరిద్దరు కలిసి పోతారో అప్పుడు పూర్తి సైన్యానికి అలీ[అ.స]యే నాయకుడు”.
ఈ మాటలన్నీటితో, “దైవప్రవక్త[స.అ] తరువాత హజ్రత్ అలీ[అ.స]యే విశ్వాసులందరి యొక్క వలీ(స్వామి) మరియు ఎవరూ అతని కన్న ఉత్తములు కారు” అనే విషయం తెలుస్తుంది. [మఅస్సాదిఖీన్, పేజీ175]
రిఫ్రెన్స్
తీజానీ సమావీ, మఅస్సాదిఖీన్, మతర్జిమ్ రౌషన్ అలీ, అన్సారియాన్, ఖుమ్, 2005.
వ్యాఖ్యలు
సలాం...
మాషాఅల్లాహ్ చక్క గా వివరించారు.
వ అలైకుమస్సలామ్
ధన్యవాదాలు. మీరు మీ కామెంట్స్ ద్వార ప్రోత్సహిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము.
جزاک اللہ بہت خوب
جزاک اللہ بہت خوب
Shukriya.. Iltemase dua.
Mashaallah
..
Shukriya...
వ్యాఖ్యానించండి